iDreamPost
android-app
ios-app

సుప్రిత నాయుడు డెబ్యూ మూవీ నుంచి మాస్ అప్‌డేట్

  • Published Nov 19, 2025 | 1:20 PM Updated Updated Nov 19, 2025 | 1:20 PM

సోషల్ మీడియా ఫేమ్ సుప్రిత నాయుడు, సీనియర్ నటి శురేఖవాణి కుమార్తె అన్నది తెలిసిన విషయమే. ఇప్పుడు ఆమె హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. “చౌదరి గారి అబ్బాయి తో నాయుడు గారి అమ్మాయి” అనే రాబోయే తెలుగు చిత్రంతో సుప్రిత తన తొలి అడుగు వేస్తోంది.

  • Published Nov 19, 2025 | 1:20 PMUpdated Nov 19, 2025 | 1:20 PM
సుప్రిత నాయుడు డెబ్యూ మూవీ నుంచి మాస్ అప్‌డేట్

అమ్మ పక్కన డబ్బింగ్ – సెట్ మీద ఫుల్ ఫైరే!

సోషల్ మీడియా ఫేమ్ సుప్రిత నాయుడు, సీనియర్ నటి శురేఖవాణి కుమార్తె అన్నది తెలిసిన విషయమే. ఇప్పుడు ఆమె హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. “చౌదరి గారి అబ్బాయి తో నాయుడు గారి అమ్మాయి” అనే రాబోయే తెలుగు చిత్రంతో సుప్రిత తన తొలి అడుగు వేస్తోంది. ఈ సినిమాలో హీరోగా బిగ్ బాస్ ఫేమ్ అమర్‌దీప్ చౌదరి నటించగా, నూతన దర్శకుడు మల్యాద్రి రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రాన్ని M3 మీడియా బ్యానర్‌పై మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మిస్తున్నారు. ఇంతకుముందు శబరి, విరాజి వంటి చిత్రాలను నిర్మించిన ఆయన, ఇప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.డబ్బింగ్ దశలో ఉన్న ఈ చిత్రం నుండి ఒక విషయం బయటకు వచ్చింది. శురేఖవాణి స్వయంగా స్టూడియోకు వచ్చి సుప్రితకు డబ్బింగ్‌లో మార్గదర్శనం చేసిందట. కొత్త నటిగా సుప్రిత చాలా త్వరగా నేర్చుకుని, సహజంగా డైలాగ్స్ చెప్పడం అందరినీ ఆకట్టుకుందట.

ఈ చిత్రం తెలుగులో ఇప్పటివరకు చెయ్యని ఒక కొత్త తరహా కథను, భారతదేశంలో ఒక వినూత్న సాంకేతికత నేపథ్యంగా చూపించబోతోంది. సామాజికంగా సంబంధించిన విషయం కావడంతో పాటు, అమర్‌దీప్ – సుప్రిత జంట కొత్తగా ఉండటం వల్ల సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమా 2026 తొలి త్రైమాసికంలో విడుదల కానుంది.