Swetha
కథలో దమ్ముంటే ఇక ఆ సినిమాను ఎవరు ఆపలేరు అనడానికి ఇప్పటి వరకు చాలానే నిదర్శనాలు ఉన్నాయి. కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లో రిలీజ్ అవుతూ ఉంటాయి. ఒకటి రెండు రోజుల తర్వాత చూస్తే హాల్ అంతా జనంతో నిండిపోయి ఉంటుంది. అలా మౌత్ టాక్ వలన ఆయా సినిమాలకు క్రేజ్ వస్తూ ఉంటుంది.
కథలో దమ్ముంటే ఇక ఆ సినిమాను ఎవరు ఆపలేరు అనడానికి ఇప్పటి వరకు చాలానే నిదర్శనాలు ఉన్నాయి. కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లో రిలీజ్ అవుతూ ఉంటాయి. ఒకటి రెండు రోజుల తర్వాత చూస్తే హాల్ అంతా జనంతో నిండిపోయి ఉంటుంది. అలా మౌత్ టాక్ వలన ఆయా సినిమాలకు క్రేజ్ వస్తూ ఉంటుంది.
Swetha
కథలో దమ్ముంటే ఇక ఆ సినిమాను ఎవరు ఆపలేరు అనడానికి ఇప్పటి వరకు చాలానే నిదర్శనాలు ఉన్నాయి. కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లో రిలీజ్ అవుతూ ఉంటాయి. ఒకటి రెండు రోజుల తర్వాత చూస్తే హాల్ అంతా జనంతో నిండిపోయి ఉంటుంది. అలా మౌత్ టాక్ వలన ఆయా సినిమాలకు క్రేజ్ వస్తూ ఉంటుంది. కానీ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా సరే ముందైతే ప్రమోషన్స్ కచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ముందు ప్రమోట్ చేసుకుంటే అప్పుడు ఈ మొదటి రెండు రోజుల కలెక్షన్స్ కూడా వేరేలా ఉంటాయి.
ఇక ఇప్పుడు మరోసారి ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే.. రీసెంట్ గా తిరువీర్ హీరోగా నటించిన ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో కు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో తెలియంది కాదు. ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్‌లో స్పెషల్ ప్లేస్ ను సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ సినిమా నార్త్ అమెరికాలో $100,777+ వసూళ్లను క్రాస్ చేసిందట. చాలా సింపుల్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను రూపొందించిన ఈ సినిమా.. ఎలాంటి భారీ ప్రమోషన్స్ లేకుండా కేవలం మౌత్ టాక్ తోనే ఈ రేంజ్ లో కలెక్షన్స్ అందుకోవడం విశేషం.
కథ కథనం బావుంటే ప్రేక్షకులు సినిమా కోసం వెతకాల్సిన అవసరం లేదు.. సినిమానే ప్రేక్షకులను వెతుక్కుంటూ వెళ్తుంది అనడానికి ఈ సినిమానే నిదర్శనం. పైగా ఓవర్శిస్ ఆడియన్స్ ఇలాంటి కంటెంట్ ఉండే సినిమాలను బాగా ఆదరిస్తూ ఉంటారు. మాస్ సినిమాకు ఉన్న రేంజ్ కాకపోయినా.. సమయం తీసుకుని మరీ ఈ సినిమాలను చూస్తూ ఉంటారు. ఇక ముందు ముందు ఇలాంటి సినిమాలు వస్తాయో లేదో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.