iDreamPost
android-app
ios-app

పైరసీ కథకు ఎండ్ టైటిల్స్ పడినట్టే

  • Published Nov 18, 2025 | 10:36 AM Updated Updated Nov 18, 2025 | 10:36 AM

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా హ్యాపీ హ్యాపీగా ఉన్నారు. సెలెబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఐబొమ్మ అడ్మిన్ ను అరెష్ చేయడం .. అతను హ్యాండిల్ చేసే వెబ్ సైట్స్ , యాప్స్ అన్నీ క్లోజ్ చేయడంతో.. టాలీవుడ్ సంబరాలు చేసుకుంటుంది. పోలీస్ కమీషనర్ సజ్జనార్ తో కలిసి సినీ ప్రముఖులు ప్రెస్ మీట్ లో మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే .. ఇకపై ఎలాంటి సమస్యలు తలెత్తబోవనే సంతోషంలో ఉన్నట్లు ఉన్నారు.

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా హ్యాపీ హ్యాపీగా ఉన్నారు. సెలెబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఐబొమ్మ అడ్మిన్ ను అరెష్ చేయడం .. అతను హ్యాండిల్ చేసే వెబ్ సైట్స్ , యాప్స్ అన్నీ క్లోజ్ చేయడంతో.. టాలీవుడ్ సంబరాలు చేసుకుంటుంది. పోలీస్ కమీషనర్ సజ్జనార్ తో కలిసి సినీ ప్రముఖులు ప్రెస్ మీట్ లో మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే .. ఇకపై ఎలాంటి సమస్యలు తలెత్తబోవనే సంతోషంలో ఉన్నట్లు ఉన్నారు.

  • Published Nov 18, 2025 | 10:36 AMUpdated Nov 18, 2025 | 10:36 AM
పైరసీ కథకు ఎండ్ టైటిల్స్ పడినట్టే

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా హ్యాపీ హ్యాపీగా ఉన్నారు. సెలెబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఐబొమ్మ అడ్మిన్ ను అరెష్ చేయడం .. అతను హ్యాండిల్ చేసే వెబ్ సైట్స్ , యాప్స్ అన్నీ క్లోజ్ చేయడంతో.. టాలీవుడ్ సంబరాలు చేసుకుంటుంది. పోలీస్ కమీషనర్ సజ్జనార్ తో కలిసి సినీ ప్రముఖులు ప్రెస్ మీట్ లో మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే .. ఇకపై ఎలాంటి సమస్యలు తలెత్తబోవనే సంతోషంలో ఉన్నట్లు ఉన్నారు. ఇరవై వేల సినిమాలను హార్ట్ డిస్క్ లో దాచుకుని.. ఒక్క పైరసీ నుంచే ఇరవై కోట్ల రూపాయలు సంపాదించాడట ఇమ్మడి రవి.

రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో దీని గురించి చర్చలు జరుగుతున్నాయి. ఐబొమ్మ వెబ్ సైట్ నుంచి కూడా అఫీషియల్ గా అప్డేట్ వచ్చేసింది. ఇకపై సైట్ క్లోజ్ చేస్తున్నామని.. సర్వీస్ లు ఉండబోవని చెప్పేసారు. సో ఇక పైరసీ కథకు ఎండ్ టైటిల్స్ పడినట్టే. కానీ ఇక్కడితో ఈ కథ ఆగిపోతుందా అంటే అది చెప్పలేం. ఎందుకంటే రల్డ్ వైడ్ పాతుకుపోయిన పైరసీ మొత్తం కేవలం ఇమ్మడి రవి ఒక్కడివలన మాత్రమే జరగలేదు. అతను మెయిన్ క్యాండీడేట్ అంతే. ఇంకా చాలా మంది పాత్రధారులు ఇందులో ఉన్నారు.

వారందరిని కూడా పోలీసులు పట్టుకోవాలి. మరీ ముఖ్యంగా రిలీజ్ రోజే పైరసీ ప్రింట్స్ వచ్చేస్తున్నాయి. టొరెంట్స్ పేరుతో వీళ్ళు పైరసీని పంచే విధానం చాలా సంవత్సరాల నుంచి ఉంది. ఇక ఇప్పుడు హైదరాబాద్ పోలీసుల నెక్స్ట్ టార్గెట్ వీళ్ళే. ఇందులో కూడా సక్సెస్ సాధిస్తే టాలీవుడ్ కు ఇంకా పెద్ద మేలు జరుగుతుంది. పైరసీ ఉండదు అని తెలిసిన తర్వాత ప్రేక్షకులు కచ్చితంగా థియేటర్స్ కు వస్తారు. లేదా ఓటిటి లో వచ్చేంతవరకు వెయిట్ చేస్తారు. అప్పుడు మునిపటిలా టాలీవుడ్ కళకళలాడుతుంది. ఇక ముందు ముందు పోలీసులు ఈ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి. మరీ ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.