iDreamPost
android-app
ios-app

‘వారణాసి’ గొడవ! ఇప్పుడేం చేస్తాడు రాజమౌళి ?

  • Published Nov 18, 2025 | 4:25 PM Updated Updated Nov 18, 2025 | 4:25 PM

చిన్న చిన్న గ్లిచెస్ ఉన్నా సరే ఎండ్ ఆఫ్ ది డే గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. బాబు ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషి ఖుషీగా గా ఉన్నారు. టైటిల్ వారణాసి అని అనౌన్స్ చేసేసారు. అంతా బాగానే జరుగుతుంది అనుకునే సమయానికి. టైటిల్ వివాదం తెర మీదకు వచ్చింది. ఈ ఈవెంట్ జరగడానికి కొద్దిరోజుల ముందు ఓ చిన్న నిర్మాత ‘వార‌ణాసి’ అనే టైటిల్ తో ఓ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు.

  • Published Nov 18, 2025 | 4:25 PMUpdated Nov 18, 2025 | 4:25 PM
‘వారణాసి’ గొడవ! ఇప్పుడేం చేస్తాడు రాజమౌళి ?

చిన్న చిన్న గ్లిచెస్ ఉన్నా సరే ఎండ్ ఆఫ్ ది డే గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. బాబు ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషి ఖుషీగా గా ఉన్నారు. టైటిల్ వారణాసి అని అనౌన్స్ చేసేసారు. అంతా బాగానే జరుగుతుంది అనుకునే సమయానికి. టైటిల్ వివాదం తెర మీదకు వచ్చింది. ఈ ఈవెంట్ జరగడానికి కొద్దిరోజుల ముందు ఓ చిన్న నిర్మాత ‘వార‌ణాసి’ అనే టైటిల్ తో ఓ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. ఫిల్మ్ ఛాంబ‌ర్ లో ఆ పేరుతో ఇది వ‌రకే టైటిల్ రిజిస్ట‌ర్ చేయించేశారు. కానీ ఇప్పుడు రాజమౌళి కూడా అదే టైటిల్ ను అనౌన్స్ చేశారు.

ఇప్పుడు ఈ టైటిల్ వివాదానికి దారి తీసింది. రామభక్త హనుమ క్రియేషన్స్ అనే బ్యానర్ ఈ పేరుని ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో రిజిస్టర్ చేసినట్టుగా పక్కా ఆధారంతో ఒక లెటర్ ని విడుదల చేసింది. సో ఇప్పుడు రాజమౌళి తన టైటిల్ ను మార్చుకోవాల్సిందే అని ఓ వర్గం వారు అంటున్నారు. మరి ఇప్పుడు ఏమి చేస్తాడు రాజమౌళి అనే ప్రశ్న అందరిలో వస్తుంది. గతంలో కూడా ఇలాంటి కాంట్రవర్సీలు చాలానే వచ్చాయి. కానీ అప్పుడు పరిస్థితులకు తగినట్టు వాటిని సర్దుబాటు చేశారు తప్ప.. టైటిల్స్ మార్చేయలేదు.

సో ఇప్పుడు కూడా ఇదే జరగనుందని మరో వర్గం వారు అంటున్నారు. వరల్డ్ వైడ్ మూవీ లవర్స్ కి ఆ పేరు ఆల్రెడీ చొచ్చుకుపోయింది. సో రాజమౌళి ఇప్పుడు టైటిల్ మార్చే ప్రసక్తే లేదు. కానీ ఈ వివాదానికి ఎలా తెర పడుతుంది అనేది చూడాలి. సాధారణంగా ఇలాంటి విషయాల్లో దర్శక నిర్మాతలు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. క‌థ‌కు త‌గ్గ‌ట్టుగా ఓ టైటిల్ అనుకొని, ఆ టైటిల్ అందుబాటులో ఉందా, లేదా? వేరే ఎవ‌రైనా రిజిస్ట‌ర్ చేయించుకొన్నారా అనే విష‌యాలు ఆరా తీస్తారు. కానీ ఈసారెందుకో రాజమౌళి పొరపాటున ఇలాంటి ఉచ్చులో చిక్కుకుపోయారు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.