విజయసాయిరెడ్డి ఏమయ్యారు.. ఎందుకు మౌనంగా ఉన్నారు..అసలు ఎటు పోయారు..జగన్ కి సాయిరెడ్డికి చెడిందా.. అందుకే ఆయన్ని హెలికాప్టర్ ఎక్కకుండా అడ్డుకున్నారా.. ప్రమాదం జరిగిన పరిశ్రమలో సాయిరెడ్డి మనుషులున్నారా.. భారతీ పాలిమర్స్ కి, ఎల్జీ సంస్థకు ఉన్న బంధమేమిటి.. ఇలా ఒక్కటి కాదు..అనేక ఆరోపణలు చంద్రబాబు & కో చేయగా ,వాటికి ఆంధ్రజ్యోతి మసాలా అద్ది రక రకాలుగా రాసింది..వరుస ఆ కథనాలతో విజయసాయి రెడ్డి మీద విష ప్రచారం చేసింది. కానీ ఆయన మాత్రం స్థిరంగా సాగిపోయారు. […]
ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్ర హోం శాఖకు రాసిన లేఖ వ్యవహారం కేసు పలు మలుపులు తిరుగుతుంది. మొదట్లో తాను ఆ లేఖ రాయలేదంటూ నిమ్మగడ్డ చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో ఈ లేఖ ఎవరు రాశారో తేల్చాలంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నేరుగా డీజీపీకి ఫిర్యాదు చేశారు. నిమ్మగడ్డ లేఖ వ్యవహారంలో నిజానిజాలు నిగ్గు తేల్చడానికి రంగంలోకి దిగిన సీఐడీ ప్రాథమిక సమాచారం సేకరించింది. నిమ్మగడ్డ పీఎస్ సాంబమూర్తిని పలు దఫాలుగా […]
లాక్ డౌన్ నేపధ్యంలో ఉపాధి లేక రోజువారీ అవసరాలు తీర్చుకోలేని నిరుపేదలకు వైసీపీ ప్రజాప్రతినిధులు చేస్తున్న సేవా కార్యక్రమాలపై ప్రతిపక్ష టీడీపీ అత్యంత హేయమైనా విమర్శలు చేస్తోంది. నిన్న మొన్నటి వరకు ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న టిడిపి ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు.. అధికారం పోవడంతో ఒక్కసారిగా ప్రజలతో మాకేం సంబంధం లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మేము సహాయం చేయం మరొకరిని చేయనీయం అన్నట్లుగా వైసిపి ప్రజాప్రతినిధులు చేస్తున్న సేవా కార్యక్రమాలపై యధాలాపంగా రాజకీయ బురద జల్లుతున్నారు. […]
2019 ఎన్నికల ఫలితాల తర్వాత మహా ఐతే ఒక నెల, నెలన్నర వదిలేసి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఎలా అయినా ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావడానికి ‘ఆంధ్రజ్యోతి’ వేమూరి రాధాకృష్ణ(ఆర్కే) ఎన్ని రకాలుగా ప్రయాసపడుతున్నారో ప్రజలకు తెలియనిది కాదు. తన ‘కొత్త పలుకు’ను చదివినవారెవరికైనా ఆ విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. చంద్రబాబును ప్రజలు అన్యాయంగా ఓడించినట్టు, ప్రజలు తమ నిర్ణయానికి తామే బాధ్యత వహించాలంటూ దాదాపు శాపాలు పెట్టినంత […]
ఏపీ పోలీసులు దూకుడు పెంచారు. తప్పుడు వార్తలతో జనాలను పక్కదారి పట్టిస్తున్న మీడియా సంస్థలపై దూకుడు ప్రదర్శిస్తున్నారు. అదే సమయంలో ఫేక్ లెటర్ అంటూ ఆరోపణలు వచ్చిన ఏపీ ఎన్నికల సంఘం మాజీ అధికారి కేసులో కూడా విచారణ వేగవంతం చేశారు. వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదుతో ఈ లేఖ అంశం వివాదాస్పదం అయ్యింది. ఏపీలో స్థానిక ఎన్నికల వాయిదా వేసిన తర్వాత పరిస్థితిపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేరుతో ఓ లేఖ కేంద్ర హోం శాఖకు […]
ఏపీ బీజేపీ అధ్యక్షుడికి పరిస్థితులు అంత సానుకూలంగా కనిపించడం లేదు. తొందరపాటు తో చేసిన కొన్ని పనులు చివరకు ఆయన మెడకే చుట్టుకుంటున్నాయి. చివరకు అవి పార్టీలోనూ, ప్రజల్లోనూ పలుచన అయ్యేందుకు కారణం అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఇప్పటికే కన్నా లక్ష్మీనారాయణ మీద బీజేపీ నేతలే కొందరు గుర్రుగా ఉన్నారు. చంద్రబాబు అడుగులకు మడుగులొత్తే ఆయన తీరు బీజేపీని తీవ్రంగా నష్టపరుస్తోందని వారు మధనపడుతున్నారు. ఇప్పటికే అధిష్టానానికి పలుమార్లు ఫిర్యాదులు కూడా చేశారు. చివరకు […]
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వారం వారం తన పేపర్లో కొత్తపలుకు పేరుతో వ్యాసాలు రాస్తుంటారు. అందులో రాష్ట్ర రాజకీయాలు, పరిణామాలపై తనదైన శైలిలో విశ్లేషణలు గావిస్తుంటారు. అయితే రాధాకృష్ణ విశ్లేషణ కంటే విషాపురాతలకే ప్రాధాన్యం ఇస్తాడంటూ ఆయన వ్యవహార శైలి, రాతలు నచ్చని వారు విమర్శిస్తూ ఉంటారు. కాగా తాజా కొత్త పలుకును చూస్తుంటే ఆర్కే వైసీపీ అధినాయకత్వంలో చిచ్చుపెట్టే ప్రయత్నం చేశాడా అనే అనుమానం కలుగుతోంది. ఆర్కే కొత్తపలుకు ఎక్కువగా వైఎస్ జగన్ చర్యలు, ఆయన వ్యవహార శైలిని విమర్శించే కోణంలోనే […]
‘అధిష్టానం ఎవరికి ఏమి చెప్పిందో తెలీదుకానీ వివాదం సద్దుమణిగింది’ .. ఇది తాజాగా కన్నా లక్ష్మీనారాయణ-విజయసాయిరెడ్డి మధ్య జరిగిన ఆరోపణలు, ప్రత్యారోపణల గురించి ఎల్లోమీడియాలో వచ్చిన ఓ వ్యాఖ్య. ప్రతి ఆదివారం ఎల్లోమీడియాలో వచ్చే కొత్తపలుకులో మీడియా యాజమాని వేమూరి రాధాకృష్ణ బిజెపి-విజయసాయిరెడ్డి మధ్య జరిగిన మాటల యుద్ధం గురించి సవివరంగా ప్రస్తావించాడు. జరిగిన సంఘటనల ఆధారంగా చూస్తే బిజెపి అదిష్టానానికి పార్టీ నేతలకన్నా తానే దగ్గరనేట్లుగా విజయసాయిరెడ్డి వ్యవహరిస్తున్నాడంటూ తెగ బాధపడిపోయాడు. సరే వేమూరి బాధగురించి […]
ప్రతిపక్ష నేతలు వైసిపి రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డిని బెదిరించటం మొదలుపెట్టారు. తమకు తక్షణమే క్షమాపణ చెప్పకపోతే పరువునష్టం దావా వేస్తానంటూ తెలుగుదేశంపార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య బెదిరించాడు. ఇదే తరహా బెదిరింపులను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా రెండు రోజుల క్రితమే చేశాడు. పైగా విజయసాయిరెడ్డి మీద కేసు వేయటానికి తమ జాతీయ పార్టీ నాయకత్వం అనుమతి కూడా తీసుకున్నట్లు చెప్పటం గమనార్హం. ఇంతకీ విషయం ఏమిటంటే రాష్ట్ర ఎన్నికల కమీషన్ మాజీ […]
కన్నా..కాణిపాకం ఎప్పుడొస్తావ్.. అంటూ ఓవైపు విజయసాయిరెడ్డి కవ్విస్తున్నారు. రెండో వైపు నిరాధారంగా, అధిష్టానం అనుమతి లేని విమర్శలు ఇక చాలించాలని కేంద్రం నుంచి కట్టడి చేస్తున్నారు. దాంతో ఇప్పుడు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ కుతకుతలాడిపోతున్నట్టు కనిపిస్తోంది. రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉన్న కన్నాకి ఇది కష్టకాలంగా భావిస్తున్నారు. టీడీపీ నేతలను, సుజనా చౌదరి వంటి వారిని చూసి చెలరేగిపోతే చివరకు సైలెంట్ కావాల్సిన పరిస్థితి వస్తుందనే అభిప్రాయం బలపడుతోంది. బీజేపీ అధిష్టానం తాజా […]