రాజ్యసభ ఎన్నికల వేళ రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బిజెపి అగ్రనాయకత్వం భారీ స్థాయిలో కుట్ర చేస్తుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.జ్యోతిరాదిత్య సింధియా భాటలోనే రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలెట్ నడవనున్నాడని ఊహాగానాలు షికారు చేస్తున్న సమయంలో రాజ్యసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థుల విజయంపై విశ్వాసాన్ని ప్రకటించి రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచాడు. జూన్ 19 న రాష్ట్రంలోని మూడు రాజ్యసభ స్థానాలకు జరగబోయే రాజ్యసభ ఎన్నికలలో కాంగ్రెస్ ఇద్దరు అభ్యర్థులు విజయం సాధిస్తారని రాజస్థాన్ […]
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో తిరిగి అధికారంలో కొనసాగేందుకు కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఒకే ఒక మార్గం మూసుకుపోయింది. తన ప్రభుత్వాన్ని బలం నిరూపించుకోవాలని గవర్నర్ జారీ చేసిన ఆదేశాలను సవాల్ చేస్తూ కాంగ్రెస్ ముఖ్య మంత్రి కమల్‌నాథ్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. గవర్నర్ నిర్ణయాన్ని సమర్థించింది. ఈ మేరకు పలుమార్లు ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం ఈరోజు సోమవారం 68 పేజీల సుదీర్ఘ తీర్పును వెల్లడించింది. మధ్యప్రదేశ్ లో 15 ఏళ్ల తర్వాత […]
మధ్యప్రదేశ్‌లో కొన్ని రోజులుగా జరుగుతున్న రాజకీయ డ్రామాకు ఎట్టకేలకు ఈ రోజు తెరపడింది. ముఖ్యమంత్రి కమల్‌నాథ్ అసెంబ్లీలో బలపరీక్షకు ముందే తన పదవికి రాజీనామా చేయడంతో 15 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలన 15 నెలలకే ముగిసింది. మళ్లీ శివరాజ్‌సింగ్ చౌహాన్ నేతృత్వంలోని ప్రభుత్వం మళ్లీ కొలువుతీరనుంది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయినా.. అవకాశాలు మాత్రం మూసుకుపోలేదని చెప్పవచ్చు. మరో ఆరు నెలల్లో మళ్లీ అధికారం చేపట్టేందుకు దారుంది. అయితే ఆ దారి.. మధ్య […]
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వానికి కి షాక్ ఇస్తూ బెంగుళూరు క్యాంపులో ఉన్న జ్యోతిరాదిత్యా సింధియా వర్గానికి చెందిన 22 మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాను ఆమోదిస్తూ శాసనసభ స్పీకర్ ప్రజాపతి నిర్ణయం తీసుకోవడంతో కాంగ్రెస్ బలం 92 కి పడిపోయింది. సభలో ప్రస్తుత బలబలాలు చూస్తే కాంగ్రెస్ పార్టీకి చెందిన మొత్తం 22 మంది, బిజెపికి చెందిన ఒక సభ్యుడి రాజీనామాలను స్పీకర్ ప్రజాపతి ఆమోదించడంతో సభలో మొత్తం సభ్యుల సంఖ్య 207 కి పడిపోయింది. దీనితో ప్రస్తుత బలబలాలను […]
మధ్యప్రదేశ్ లో కమలనాధ్ ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లో శాసనసభలో తమ బలం నిరూపించుకోవాల్సిందేనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కమల్ నాధ్ కి గవర్నర్ లాల్జీ టాండన్ వార్నింగ్ ఇచ్చారు. లేనిపక్షంలో కమల్ నాధ్ ప్రభుత్వానికి బలం లేదని భావించాల్సి ఉంటుందని గవర్నర్ హెచ్చరించారు. కాగా సోమవారంలోగా అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని లేఖ ద్వారా స్పీకర్ కు గవర్నర్ సూచించినప్పటికీ స్పీకర్ మాత్రం ఈ నెల 26 వరకు అసెంబ్లీని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. కరోనా వైరస్‌పై భయాందోళనలు వ్యక్తమవుతున్న […]