Swetha
టాలీవుడ్ లో రీరిలీజ్ ల సందడి ఎలా ఉంటుందో తెలియనిది కాదు. కొన్ని వందల సార్లు టీవీలలో చూసిన సినిమా అయినా సరే.. థియేటర్లో రీరిలీజ్ చేస్తున్నారంటే.. పండగల దానిని సెలెబ్రేట్ చేస్తూ ఉంటారు. కొన్ని నెలల క్రితం వరకు వరుస రీరిలీజ్ లు సందడి చేసాయి. ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని బాహుబలి ఎపిక్ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఇప్పుడు శివ వంతు

టాలీవుడ్ లో రీరిలీజ్ ల సందడి ఎలా ఉంటుందో తెలియనిది కాదు. కొన్ని వందల సార్లు టీవీలలో చూసిన సినిమా అయినా సరే.. థియేటర్లో రీరిలీజ్ చేస్తున్నారంటే.. పండగల దానిని సెలెబ్రేట్ చేస్తూ ఉంటారు. కొన్ని నెలల క్రితం వరకు వరుస రీరిలీజ్ లు సందడి చేసాయి. ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని బాహుబలి ఎపిక్ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఇప్పుడు శివ వంతు. ఇంకో రెండు రోజుల్లో శివ రీరిలీజ్ అవుతుంది. ఈ కల్ట్ క్లాసిక్ సినిమాను అప్పటితరంతో పాటు ఇప్పటితరం వారు కూడా ఎక్స్పీరియెన్స్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇక రిజల్ట్ ఎలా ఉంటుందో చూడడమే లేట్.
ఇక వన్ డే గ్యాప్ లో త్రిష , సిద్దార్ధ్ నటించిన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ఎప్పటికి అందరికి ఆల్ టైం ఫెవరెట్ అని చెప్పి తీరాల్సిందే. ఆ తర్వాత నవంబర్ 21 చిరంజీవి ‘కొదమసింహం’ రీరిలీజ్ అవుతుంది. 1990లో మెగాస్టార్ ను కౌబాయ్ గా పరిచయం చేసిన సినిమా ఇది. చిరంజీవి సినిమాల్లో ఇది కూడా అందరి ఫెవరెట్ లిస్ట్ లో ఉంటుంది. ఇవి కాకుండా నవంబర్ 22 కార్తీ ‘ఆవారా’ , నవంబర్ 28 సూర్య ‘సికందర్’ , నవంబర్ 29 మహేష్ బాబు ‘బిజినెస్ మెన్’ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇక ప్రేక్షకులు ఏ సినిమాకు ఎలాంటి హడావిడి చేస్తారో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.