iDreamPost
android-app
ios-app

కింగ్ నాగ్ ‘శివ’ కు ఇన్స్పిరేషన్ బ్రూస్ లీ!

  • Published Nov 11, 2025 | 11:30 AM Updated Updated Nov 11, 2025 | 11:30 AM

కొన్ని సినిమాలు అప్పటివరకు ఉన్న ఇండస్ట్రీ ట్రాక్ రికార్డ్స్ ను మార్చేస్తూ ఉంటాయి. ఇప్పటి జెనెరేషన్ కు అది బాహుబలి అయితే అప్పట్లో రామ్ గోపాల్ వర్మ తీసిన శివ. ఈ సినిమా ఎలాంటి సంచలనం సృష్టించిందో తెలియంది కాదు. ముఖ్యంగా ఆ సైకిల్ చైన్ సీన్ అయితే అందరి మైండ్స్ లో రిజిస్టర్ అయిపోయి ఉంటుంది. అలాంటి కల్ట్ క్లాసిక్ మూవీ ఇంకొద్ది రోజుల్లో 4కె వెర్షన్లో రీరీలీజ్ కాబోతుంది.

  • Published Nov 11, 2025 | 11:30 AMUpdated Nov 11, 2025 | 11:30 AM
కింగ్ నాగ్ ‘శివ’ కు ఇన్స్పిరేషన్ బ్రూస్ లీ!

కొన్ని సినిమాలు అప్పటివరకు ఉన్న ఇండస్ట్రీ ట్రాక్ రికార్డ్స్ ను మార్చేస్తూ ఉంటాయి. ఇప్పటి జెనెరేషన్ కు అది బాహుబలి అయితే అప్పట్లో రామ్ గోపాల్ వర్మ తీసిన శివ. ఈ సినిమా ఎలాంటి సంచలనం సృష్టించిందో తెలియంది కాదు. ముఖ్యంగా ఆ సైకిల్ చైన్ సీన్ అయితే అందరి మైండ్స్ లో రిజిస్టర్ అయిపోయి ఉంటుంది. అలాంటి కల్ట్ క్లాసిక్ మూవీ ఇంకొద్ది రోజుల్లో 4కె వెర్షన్లో రీరీలీజ్ కాబోతుంది. ఏకంగా 36 సంవత్సరాల తర్వాత ఈ సినిమా రాబోతుంది. దీనితో అక్కినేని ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషి అయిపోతున్నారు. ప్రస్తుతం ఈ రీరిలీజ్ కు సంబందించిన ప్రమోషన్స్ జరుగుతున్నాయి.

ఈ క్రమంలో రామ్ గోపాల్ వర్మ శివ కు సంబంధించిన ఓ సీక్రెట్ బయటపెట్టేశారు. అసలు శివ కథకు ఇన్స్పిరేషన్ ఏంటి అనే విషయాన్నీ చెప్పేసారు. ఏ కథకైనా మరో కథను చూసి ఇన్పుట్స్ తీసుకోవాల్సిందే. ఎంత కొత్త కథలు సృష్టించిన ఎక్కడో కొన్ని కొన్ని ఆల్రెడీ జరిగిన వాటి నుంచే తీసుకుంటూ ఉంటారు. శివ కూడా అలాంటిదే అట. ఆర్జీవీ డైరెక్టర్ గా ప్రయత్నాలు మొదలుపెట్టిన డేస్ లో అతని దగ్గర ‘రాత్రి’ అనే కథ మాత్రమే ఉండేదట. ఆ తర్వాత అక్కినేని వెంకట్ కలిసి నాగార్జునకు సూటయ్యే స్టోరీ రాయమని సలహా ఇచ్చారట. దీనితో తన ఫేవరెట్ బ్రూస్ లీ రిటర్న్ అఫ్ ది డ్రాగన్ పదిహేనోసారి చూసిన తర్వాత రామ్ గోపాల్ వర్మకు ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చి.. ఆ మూవీలో క్యాంటీన్ తీసి కాలేజీగా మార్చేశారట.

దానికి తన పర్సనల్ అనుభవాలను జోడించి శివను రెడీ చేశారట. ఇలా శివకు ఇన్స్ పిరేషన్ బ్రూస్ లీ అయింది. 1989లో ఇప్పట్లా ఓటిటిలు యూట్యూబ్ లు లేవు కాబట్టి వేరే భాషల సినిమాలు చూసే అవకాశాలు చాలా తక్కువగా ఉండేవి. కాబట్టి శివను, రిటర్న్ అఫ్ ది డ్రాగన్ ను పోల్చి చూసే అవకాశం లేదు. ఇప్పుడు ఒకవేళ అలా కంపేర్ చేసి చూసినా సరే పెద్దగా జరిగే నష్టమేమి లేదు. ఎందుకంటే శివ ఎప్పటికి ఓ ఎవర్ గ్రీన్ సినిమానే. ఇంకో యాభై వంద సంవత్సరాల తర్వాత కూడాఈ మూవీ స్టేటస్ తగ్గదు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.