Swetha
ఎప్పుడెప్పుడు సినిమా నుంచి అప్డేట్స్ వస్తాయా అని ఆడియన్స్ తో పాటు.. మొత్తం ఇండస్ట్రీ ఎదురుచూస్తుంది. లెక్క ప్రకారం రాజమౌళి ఓ సినిమా స్టార్ట్ చేసే ముందు అనౌన్సుమెంట్ ఇస్తాడు. మహేష్ తో సినిమా విషయంలో అది జరగలేదు. సరే నవంబర్ లో అప్డేట్ ఉంటుంది కదా అని అంతా ఎదురుచూస్తున్న క్రమంలో. అసలు హింట్ కూడా ఇవ్వకుండా సంచారి అంటూ సడెన్ సర్ప్రైజ్ ఇచ్చేసాడు.

ఎప్పుడెప్పుడు సినిమా నుంచి అప్డేట్స్ వస్తాయా అని ఆడియన్స్ తో పాటు.. మొత్తం ఇండస్ట్రీ ఎదురుచూస్తుంది. లెక్క ప్రకారం రాజమౌళి ఓ సినిమా స్టార్ట్ చేసే ముందు అనౌన్సుమెంట్ ఇస్తాడు. మహేష్ తో సినిమా విషయంలో అది జరగలేదు. సరే నవంబర్ లో అప్డేట్ ఉంటుంది కదా అని అంతా ఎదురుచూస్తున్న క్రమంలో. అసలు హింట్ కూడా ఇవ్వకుండా సంచారి అంటూ సడెన్ సర్ప్రైజ్ ఇచ్చేసాడు. సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసేసాడు. దీనితో ఫ్యాన్స్ ఫుల్ ఖుషిలో ఉన్నారు. మహేష్ దగ్గరకు వచ్చేసరికి అందరి ఫ్యాన్స్ ఒకటే అయిపోతారు. సోషల్ మీడియా అంతా ఈ సాంగ్ గురించే డిస్కషన్స్ నడుస్తున్నాయి.
అలా సాంగ్ రిలీజ్ అయిందో లేదో.. అప్పుడే కొందరు డీకోడింగ్ లు కూడా మొదలుపెట్టేసారు. సినిమా టైటిల్ కూడా సాంగ్ కు తగినట్టు సంచారి అనే ఉంటుందని అంటున్నారు. అసలు టైటిల్ ఏంటో ఇక జక్కన్న క్లారిటీ ఇవ్వాలి. ఎక్కువ బీట్స్ లేకుండా సీరియస్ గా సాగుతూ హీరో క్యారెక్టరైజేషన్ ని వర్ణిస్తూ ‘సంచారి మృత్వువుపై తన స్వారీ’ అంటూ ఈ సాంగ్ ను కంపోజ్ చేశారు. . చైతన్య ప్రసాద్ సాహిత్యం సమకూర్చగా శృతి హాసన్ ఈ సాంగ్ ను పాడారు. శృతి హాసన్ పాడడం అనేది కొత్త కాదు కానీ ఇలా మహేష్ సినిమాకు పాడడం అందరికి ఆశ్చర్యపరిచింది.
ఈ సాంగ్ మెల్లగా స్లో పాయిజన్ లా ఎక్కేయడం ఖాయం. గ్లోబల్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకున్న కీరవాణి దానికి తగ్గట్టే అన్ని భాషలకు సెట్టయ్యే యునివర్సల్ అప్పీల్ ఉండేలా చూసుకున్నారని చెప్పి తీరాల్సిందే. మొత్తానికి రాజమౌళి ఎలాంటి ప్రీహింట్స్ లేకుండా సడెన్ సర్ప్రైజ్ చేసి అందరికి షాక్ కు గురిచేశాడు. ఇక నవంబర్ 15 న ఎలాంటి షాక్ ఇవ్వబోతాడో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.