iDreamPost
android-app
ios-app

‘మాయాబజార్’ కు ‘కాంత’ కు ఏదైనా కనెక్షన్ ఉందా !

  • Published Nov 12, 2025 | 3:01 PM Updated Updated Nov 12, 2025 | 3:01 PM

కాంత సినిమా ట్రైలర్ చూస్తే పాత బ్లాక్ అండ్ వైట్ సినిమాలు గుర్తురాకుండ పోవు. అయితే తెలుగు సినిమా చరిత్రలో మాయాబజార్ కు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఈ సినిమా 1957లో వచ్చింది. దీనిని ఇప్పుడు చూసినా కూడా అదే ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అయితే ఇప్పుడు మాయాబజార్ కు కాంత కు ఏదైనా సంబంధం ఉందా అనే కొత్త సందేహాలు మొదలయ్యాయి

  • Published Nov 12, 2025 | 3:01 PMUpdated Nov 12, 2025 | 3:01 PM
‘మాయాబజార్’ కు ‘కాంత’ కు ఏదైనా కనెక్షన్ ఉందా !

కాంత సినిమా ట్రైలర్ చూస్తే పాత బ్లాక్ అండ్ వైట్ సినిమాలు గుర్తురాకుండ పోవు. అయితే తెలుగు సినిమా చరిత్రలో మాయాబజార్ కు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఈ సినిమా 1957లో వచ్చింది. దీనిని ఇప్పుడు చూసినా కూడా అదే ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అయితే ఇప్పుడు మాయాబజార్ కు కాంత కు ఏదైనా సంబంధం ఉందా అనే కొత్త సందేహాలు మొదలయ్యాయి. కానీ ఇది పరంగా కాదు టేకింగ్ పరంగా.

అసలు విషయం ఏంటంటే ఏడు దశాబ్దాలు క్రితం మాయాజాజర్ కోసం ఉపయోగించిన కెమెరాను.. ఇప్పుడు ఈ సినిమా కోసం ఉపయోగించారట. ఈ విషయాన్నీ నిర్మాతలలో ఒకరైన రానా దగ్గుబాటి స్వయంగ వెల్లడించారు. ఇది కాకుండా ఈ సినిమా ’ తమిళ తొలి తరం సూపర్ స్టార్లలో ఒకరైన ఎం.కె.త్యాగరాజన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ విషయం మీద రకరకాల చర్చలు కూడా జరుగుతున్న సంగతి తెలిసిందే. కానీ అది వాస్తవం కాదని.. కేవలం ఆ సమయంలో జరిగిన సంఘటనలను ఉదాహరణగా మాత్రమే తీసుకున్నారని టీం అంటున్నారు.

దీనిని బట్టి కథ అంతా కూడా 1930-1940 ప్రాంతంలో జరిగినట్టు తెలుస్తుంది. కాబట్టి ఆ యాస్థాటిక్ నేచర్ కనిపించడం కోసం అప్పట్లో వాడిన మిచెల్ కెమెరాను ఈ సినిమాలో వాడామని రానా వెల్లడించాడు. అది మాత్రమే కాకుండా ఆ రోజుల్లో వాడిన కార్లు, ఫోన్లు సహా అప్పటి సినిమా ఎక్విప్మెంట్ అంతా ఈ చిత్రంలో ఉపయోగించినట్లు చెప్పుకొచ్చారు. అలా మాయాబజార్ ను కాంత కు లింక్ చేసారు. ఇక సినిమా రిలీజ్ తర్వాత ఎలాంటి రెస్పాన్స్ సంపాదించుకుంటుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.