Swetha
ఈ మధ్య కాలంలో ఓటిటి లు ఆచి తూచి అడుగులు వేస్తున్నాయి. కొన్ని సినిమాలకు రిలీజ్ లు అయినా కూడా ఓటిటి పార్ట్నర్స్ లాక్ అవ్వడం లేదు. మరి కొన్ని ఇంకా సెట్స్ మీదకు వెళ్లకుండా లాక్ అయిపోతున్నాయి. ఇక ఇప్పుడు రవి తేజ అప్ కమింగ్ సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది.

ఈ మధ్య కాలంలో ఓటిటి లు ఆచి తూచి అడుగులు వేస్తున్నాయి. కొన్ని సినిమాలకు రిలీజ్ లు అయినా కూడా ఓటిటి పార్ట్నర్స్ లాక్ అవ్వడం లేదు. మరి కొన్ని ఇంకా సెట్స్ మీదకు వెళ్లకుండా లాక్ అయిపోతున్నాయి. ఇక ఇప్పుడు రవి తేజ అప్ కమింగ్ సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. హిట్స్ ప్లాప్స్ తో సంబంధం లేకుండా రవి తేజ వరుసగా సినిమాలు తీస్తూనే ఉన్నాడు. రీసెంట్ గా రవి తేజ నుంచి మాస్ జాతర సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా కూడా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. అయినాసరే రవి తేజ ఎక్కడా బ్యాక్ స్టెప్ వేయకుండా ఆడియన్స్ ను మెప్పించడానికి వెంటనే మరో సినిమాతో రెడీ అవుతున్నాడు. ప్రముఖ దర్శకుడు కిషోర్ తిరుమల రవి తేజ కొత్త సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు టైటిల్ ను ఈరోజు రివీల్ చేయనున్నారు. అయితే దీనికంటే ముందే ఓటిటి ఇంకా శాటిలైట్ పార్ట్నర్స్ లాక్ అయ్యిపోయారు.
ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులని ప్రముఖ సంస్థ జీ 5 వారు సొంతం చేసుకున్నారు. అలాగే శాటిలైట్ హక్కులు కూడా జీ తెలుగు సంస్థే సొంతం చేసుకుంది. ఇక ముందు ముందు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి, మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.