Swetha
ఓ స్ట్రాంగ్ కంబ్యాక్ ఓ సాలిడ్ హిట్ కోసం చూస్తున్న హీరోలలో అల్లరి నరేష్ కూడా ఒకరు. సాధారణంగా అల్లరి నరేష్ సినిమాలంటే అందరూ కామిడి టైమింగ్ నే ఆసిస్తూ ఉంటారు. కానీ నరేష్ కాస్త రూటు మార్చి నాంది, ఉగ్రం, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం లాంటి సీరియస్ సినిమాలు తీసాడు. కమర్షియల్ గా వర్కౌట్ అవ్వలేదు కాని కథ పరంగా మాత్రం బాగానే ఆకట్టుకున్నాయి.

ఓ స్ట్రాంగ్ కంబ్యాక్ ఓ సాలిడ్ హిట్ కోసం చూస్తున్న హీరోలలో అల్లరి నరేష్ కూడా ఒకరు. సాధారణంగా అల్లరి నరేష్ సినిమాలంటే అందరూ కామిడి టైమింగ్ నే ఆసిస్తూ ఉంటారు. కానీ నరేష్ కాస్త రూటు మార్చి నాంది, ఉగ్రం, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం లాంటి సీరియస్ సినిమాలు తీసాడు. కమర్షియల్ గా వర్కౌట్ అవ్వలేదు కాని కథ పరంగా మాత్రం బాగానే ఆకట్టుకున్నాయి. ఇప్పటివరకు అల్లరినరేష్ టచ్ చేయని జోనర్ ఏదైనా ఉందంటే అది హర్రర్ జోనర్ ఏ. ఇప్పుడు రాబోయే సినిమాతో ఇది కూడా ఫుల్ ఫిల్ కాబోతుంది.
ప్రస్తుతం అల్లరినరేష్ నుంచి రిలీజ్ కు రెడీగా ఉన్న సినిమా ’12ఏ రైల్వే కాలనీ’. నాని కాసరగడ్డ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. తాజాగా మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేసారు . ఆ ట్రైలర్ లో కాన్సెప్ట్ తో పాటు స్టోరీ ఎంతో చెప్పే ప్రయత్నం చేసి ట్విస్టులకు హింట్స్ ఇచ్చి వదిలేసారు. ట్రైలర్ ను బట్టి గమనిస్తే… అల్లరి నరేష్ కు కొన్ని అనుహ్యమైన కలలు వస్తూ ఉంటాయి. దాని వెనుక ఉండే రహస్యం ఏంటి అనేది ఎవరికీ తెలీదు. ఈ క్రమంలో కొంతమంది దోషులను వెతుకుతున్న పోలీస్ ఆఫీసర్ కు ఇతని సహాయం అవసరమౌతుంది. ఆ తర్వాత ఏమి జరిగింది ? ఆ హత్యలు చేస్తున్నది ఎవరు ? ఈ కథలో ఇంకా ఎన్ని మలుపులు ఉన్నాయి ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
చూడాలి మరి ఈసారైనా అల్లరినరేష్ సినిమా కాసుల వర్షం కురిపిస్తుందో లేదో. పైగా ఈ సినిమాలో అల్లరినరేష్ కాస్త డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. బీజీఎమ్, కెమెరా వర్క్ కూడా బావున్నాయి. ఎప్పుడు నవ్వించే అల్లరినరేష్ ఈసారి భయపెడతాడా లేదా అనేది చూడాలి. ఇలాంటి బ్యాక్డ్రాప్ కథలు కొత్త కాదు కానీ అల్లరినరేష్ నుంచి రావడం కాస్త డిఫరెంట్. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.