iDreamPost
android-app
ios-app

మహాశయాతో అయినా మాస్ మహారాజ్ మెప్పిస్తాడా ?

  • Published Nov 11, 2025 | 12:44 PM Updated Updated Nov 11, 2025 | 12:44 PM

రవితేజ సినిమాలకు ఆయన కామిడి టైమింగ్స్ కు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. ఇండస్ట్రీలో ఇప్పుడు ఇంతమంది హీరోలు వచ్చినా సరే రవి తేజ నుంచి సినిమా అంటే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అయితే ఈ మధ్యన మాత్రం రవి తేజ తీసే మాస్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అడ్డంగా బోల్తా పడుతున్నాయి. రీసెంట్ గా వచ్చిన మాస్ జాతర గురించైతే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది

  • Published Nov 11, 2025 | 12:44 PMUpdated Nov 11, 2025 | 12:44 PM
మహాశయాతో అయినా మాస్ మహారాజ్ మెప్పిస్తాడా ?

రవితేజ సినిమాలకు ఆయన కామిడి టైమింగ్స్ కు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. ఇండస్ట్రీలో ఇప్పుడు ఇంతమంది హీరోలు వచ్చినా సరే రవి తేజ నుంచి సినిమా అంటే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అయితే ఈ మధ్యన మాత్రం రవి తేజ తీసే మాస్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అడ్డంగా బోల్తా పడుతున్నాయి. రీసెంట్ గా వచ్చిన మాస్ జాతర గురించైతే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కానీ జనం మాత్రం మాస్ ఎంటర్టైన్మెంట్స్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. సరే ఇదంతా పక్కన పెట్టేస్తే ఇప్పుడు రవితేజ నుంచి సంక్రాంతికి రాబోతున్న సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ .

రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన చిన్న టీజర్ వదిలారు. ఇద్దరు అమ్మాయిలు జీవితంలో ఉన్న ఒక ఉద్యోగికి పెద్ద ప్రాబ్లమ్ వస్తుంది. . ఎవరిని అడిగినా ఆఖరికి ఏఐ టెక్నాలజీ వాడినా సమాధానం దొరకదు. అసలా ప్రశ్న ఏంటి, అతను ఎదురుకున్న ఆ ఇబ్బంది ఏంటనేది సినిమా కథ. ఈసారి మాస్ మహారాజ క్లాస్ గా వస్తున్నాడని అనిపిస్తుంది. ప్రస్తుతానికి ఈ చేంజ్ అవసరమనే అనిపిస్తుంది. కనీసం ఇదైనా రవితేజ కు లక్ తెచ్చిపెడితే చాలని అంతా అనుకుంటున్నారు.

సినిమాలైతే ప్లాప్ అయ్యాయి కానీ.. రవి తేజ ఇమేజ్ కు మాత్రం ఎక్కడా ఏ డోకా రాలేదు. సో భర్త మహాశయులకు విజ్ఞప్తి తో మంచి కంబ్యాక్ ఏ ఇవ్వబోతున్నాడని అనిపిస్తుంది. ఈ సినిమాలో శుభలేఖ సుధాకర్, వెన్నెల కిషోర్, మురళీధర్ గౌడ్, సునీల్ ఇలా సీనియర్ నటీనటులు నటించబోతున్నారు. ఈ సంక్రాంతికి ఈ మూవీ ఎలాంటి సందడి చేస్తుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి