iDreamPost
android-app
ios-app

రాజాసాబ్ ముచ్చట్లు ఇంకెప్పుడో

  • Published Nov 10, 2025 | 11:12 AM Updated Updated Nov 10, 2025 | 11:12 AM

ఈసారి అసలు కంగారు పడాల్సిన పనే లేదు.. అన్నీ సక్రమంగా జరుగుతాయని రాజాసాబ్ టీం భరోసా ఇస్తుంది. రెండు రోజుల క్రితమే రాజాసాబ్ ప్రమోషన్స్ గురించి తమన్ ఓ అప్డేట్ ఇచ్చాడు. ఇటు చూస్తే సినిమా రిలీజ్ కు ఇంకా సరిగ్గా రెండు నెలల సమయం మాత్రమే ఉంది. కానీ అప్డేట్స్ పరిస్థితి ఏమో నత్త నడక నడుస్తున్నట్లు ఉన్నాయి. ఈ నెలలో అంటే నవంబర్ 14 లేదా 15 న ఎస్ఎస్ఎంబి 29 సాలిడ్ అప్డేట్ ఉంటుంది.

  • Published Nov 10, 2025 | 11:12 AMUpdated Nov 10, 2025 | 11:12 AM
రాజాసాబ్ ముచ్చట్లు ఇంకెప్పుడో

ఈసారి అసలు కంగారు పడాల్సిన పనే లేదు.. అన్నీ సక్రమంగా జరుగుతాయని రాజాసాబ్ టీం భరోసా ఇస్తుంది. రెండు రోజుల క్రితమే రాజాసాబ్ ప్రమోషన్స్ గురించి తమన్ ఓ అప్డేట్ ఇచ్చాడు. ఇటు చూస్తే సినిమా రిలీజ్ కు ఇంకా సరిగ్గా రెండు నెలల సమయం మాత్రమే ఉంది. కానీ అప్డేట్స్ పరిస్థితి ఏమో నత్త నడక నడుస్తున్నట్లు ఉన్నాయి. ఈ నెలలో అంటే నవంబర్ 14 లేదా 15 న ఎస్ఎస్ఎంబి 29 సాలిడ్ అప్డేట్ ఉంటుంది. అలాగే అఖండ 2 అప్డేట్ కూడా ఇదే నెలలో ఉంటుంది. కాబట్టి రాజాసాబ్ అప్డేట్ ను కాస్త పోస్ట్ పోన్ చేయబోతున్నారని అనిపిస్తుంది.

డార్లింగ్ ఫ్యాన్స్ ఎదురుచూసి చూసి అలసిపోయే స్టేజ్ లో ఉన్నారు. కాబట్టి వీలైనంత త్వరగా రాజాసాబ్ ముచ్చట్లు మొదలుపెట్టాలని ఆశిస్తున్నారు. ఇప్పటికే సంక్రాంతి రిలీజ్ లలో ఒకటైన మన శంకర్ వర ప్రసాద్ గారు మీసాల పిల్ల పాటతో 50 మిలియన్ల వ్యూస్ అందుకున్నారు. అటు రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ కానీ రామ్ చరణ్ పెద్ది లోని చికిరి చికిరితో మూడు రోజులకే ఆ మార్కును అందుకున్నాడు. ఈ రేంజ్ లో రాజాసాబ్ ఎప్పుడు హడావిడి చేస్తాడా అని అందరు ఆశగా ఎదురుచూస్తున్నారు.

పైగా జనవరి 9 న రిలీజ్ అవుతున్న విజయ్ జన నాయకుడు నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అయినా సరే ప్రమోషన్స్ కు అతీతం కాదు. దానిని తేలికగా తీసుకోడానికి లేదు. కాంపిటీషన్ కు మరే సినిమా లేదు అనుకోడానికి కూడా అవకాశం లేదు. దేనికంటే అది సంక్రాంతి సీజన్.. వేరే సినిమాలకు కూడా స్క్రీన్స్ అవసరం. సో రాజాసాబ్ టీం ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని సినిమా ముచ్చట్లు మొదలుపెడుతుందో లేదో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.