Swetha
ఇంకో రెండు రోజుల్లో దుల్కర్ నటించిన 'కాంత' సినిమా రిలీజ్ కాబోతుంది. ఇప్పటివరకు సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అంతా కూడా సినిమా మీద ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తూనే ఉన్నాయి. అంతేకాకుండా ఒరిజినల్ గా మలయాళ నటుడైనా సరే తెలుగులో దుల్కర్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. అతని నుంచి సినిమాలు వస్తున్నాయంటే కచ్చితంగా కంటెంట్ బావుంటుంది అనే నమ్మకం అందరిలో క్రియేట్ చేసాడు.

ఇంకో రెండు రోజుల్లో దుల్కర్ నటించిన ‘కాంత’ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇప్పటివరకు సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అంతా కూడా సినిమా మీద ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తూనే ఉన్నాయి. అంతేకాకుండా ఒరిజినల్ గా మలయాళ నటుడైనా సరే తెలుగులో దుల్కర్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. అతని నుంచి సినిమాలు వస్తున్నాయంటే కచ్చితంగా కంటెంట్ బావుంటుంది అనే నమ్మకం అందరిలో క్రియేట్ చేసాడు. కాంత కథ కూడా చాలా కొత్తగా ఉంది. ఒక సినిమాను తెర మీదకు తెచ్చే ముందు వరకు కూడా తెర వెనుక ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయనే విషయాలను ఈ సినిమాలో చూపించబోతున్నారు.
సరే సినిమా రిలీజ్ అయ్యాక మౌత్ టాక్ ను బట్టి చూడొచ్చు అనే అంతా అనుకుంటున్నారు. ఇంతవరకు బాగానే ఉంది అయితే ఇప్పుడు ట్రైలర్ లు టీజర్ లు చూసి కొంతమందికి కొత్త డౌట్స్ పుట్టుకొస్తున్నాయి. ఇప్పటివరకు వచ్చిన కంటెంట్ అంతా మణిరత్నం తీసిన ‘ఇద్దరు’ సినిమాను గుర్తుకుతెచ్చాయి. అయితే తెలుగు ఇండస్ట్రీలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కంటే ముందు.. చిత్తూరు నాగయ్య అనే వ్యక్తి సూపర్ స్టార్ గా ఉండి కనుమరుగయ్యారు. అలానే తమిళంలో కూడా ఎంకే త్యాగరాజన్ అనే వ్యక్తి ఉండేవారు.. ఫ్యాన్స్ అప్పట్లో ఆయనను ఎంకేటీ అని పిలుచుకునేవారు
ఇప్పుడు కాంత సినిమా ఆయన జీవిత చరిత్రకు సంబంధించిందే అని అంటున్నారు. 1910లో పుట్టిన త్యాగరాజన్‌ది పేద కుటుంబం. తానూ స్వయంగా సినిమాల్లోకి వచ్చి మంచి పేరు సంపాదించుకున్నాడు. 1944లో ఒక హత్య కేసులో అనుకోకుండా ఓ హత్య కేసులో చిక్కుకున్నాడు. ఆ తర్వాత రెండేళ్ల పాటు జైల్లో గడిపారు. అలా ఆయన జీవితం ఒక్కసారిగా తలక్రిందులు అయిపోయింది. ఆ క్యారెక్టర్ లోనే దుల్కర్ నటించాడట. ఈ మొత్తాన్ని కాంత సినిమాలో చూపించినట్లు టాక్. సినిమా ఎలా ఉంటుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.