iDreamPost
android-app
ios-app

మన శంకర వరప్రసాద్ గారి స్పెషల్ సాంగ్ ఎవరితో అంటే !

  • Published Nov 12, 2025 | 11:54 AM Updated Updated Nov 12, 2025 | 11:54 AM

ఈసారి చిరు నుంచి వచ్చే సినిమా పక్కా బ్లాక్ బస్టర్ హిట్ అని అంతా కన్ఫర్మ్ అయిపోయారు. ఖైదీ నంబర్ 150తో ఎంట్రీ ఇచ్చిన చిరు ఆ తర్వాత కొన్ని ప్లాపులు చూసిన సంగతి తెలిసిందే. దీనితో ఇప్పుడు అనిల్ రావిపూడి ఛార్జ్ తీసుకున్నాడు. ఎలా అయినా సరే చిరు సెకండ్ ఇన్నింగ్స్ లో ఓ సాలిడ్ హిట్ పడేలా చేయాలనీ డిసైడ్ అయ్యి. మన శంకర వర ప్రసాద్ గారి రూపంలో కథను రెడీ చేసుకున్నాడు.

  • Published Nov 12, 2025 | 11:54 AMUpdated Nov 12, 2025 | 11:54 AM
మన శంకర వరప్రసాద్ గారి స్పెషల్ సాంగ్ ఎవరితో అంటే !

ఈసారి చిరు నుంచి వచ్చే సినిమా పక్కా బ్లాక్ బస్టర్ హిట్ అని అంతా కన్ఫర్మ్ అయిపోయారు. ఖైదీ నంబర్ 150తో ఎంట్రీ ఇచ్చిన చిరు ఆ తర్వాత కొన్ని ప్లాపులు చూసిన సంగతి తెలిసిందే. దీనితో ఇప్పుడు అనిల్ రావిపూడి ఛార్జ్ తీసుకున్నాడు. ఎలా అయినా సరే చిరు సెకండ్ ఇన్నింగ్స్ లో ఓ సాలిడ్ హిట్ పడేలా చేయాలనీ డిసైడ్ అయ్యి. మన శంకర వర ప్రసాద్ గారి రూపంలో కథను రెడీ చేసుకున్నాడు. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ బాగానే హైప్ క్రియేట్ చేస్తుంది. పైగా మీసాల పిల్ల సాంగ్ అయితే ఏ రేంజ్ లో హిట్ అయిందో తెలియనిది కాదు.

ఇక త్వరలోనే సెకండ్ సాంగ్ ను కూడా రిలీజ్ చేయాలనీ అనుకుంటున్నారట. సినిమాలో ఓ ఐటెం సాంగ్ కూడా ఉందట. ఈ ఐటెం సాంగ్ కు ఫిమేల్ రోల్ కోసం చాలా రీసెర్చ్ చేసి చివరకు మిల్కీ బ్యూటీ తమన్నాను ఫైనల్ చేశారట. సో మన శంకర వర ప్రసాద్ గారు తమన్నతో కలిసి స్టెప్పులు వేయబోతున్నారన్నమాట. తమన్నా ఇప్పటికే చాలా సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసింది. అవన్నీ కూడా మంచి హిట్స్ అందుకున్నాయి. ఇంతకుముందు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’లోనూ తమన్నా ఐటెం సాంగ్ చేసింది. ఇక ఈ సినిమాలో ఎలా ఉంటుందో చూడాలి.

పైగా ఈ ఐటెం సాంగ్ లో వెంకీ కూడా ఓ స్టెప్ వేస్తాడని ఇన్సైడ్ టాక్ . ప్రస్తుతం చిరు-వెంకీ కలయికలో కీలక సన్నివేశాలు తీస్తున్నారు. షూటింగ్ ఆల్మోస్ట్ ఆఖరి దశకు చేరుకుందట. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ముందు ముందు సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.