విశాఖ సమీపంలో ఉన్నఆర్ ఆర్.వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో విష వాయువు లీకై దాదాపు నెల రోజులు కావస్తున్నా.. ఆ విషవాయువు స్థానిక ప్రజలను ఇంకా వెంటాడుతూనే ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో 12 మంది ప్రాణాలు కోల్పోగా అనంతరం కొద్ది రోజులకు ఒకరు తాజాగా ఈ రోజు మరొకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ రోజు యలమంచలి కనకరాజు అనే వ్యక్తి అకస్మాత్తుగా మరణించారు. ప్రమాదం జరిగిన తర్వాత రెండు రోజుల పాటు విశాఖ కేజీహెచ్‌లో చికిత్స […]
ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనపై రిటైర్డ్ జడ్జి శేషశయనా రెడ్డి కమిటీ తన నివేదికను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) కి సమర్పించింది. సంస్థ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని నివేదికలో పేర్కొంది. విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనపై ఎన్జీటీలో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ముందస్తుగా 50 కోట్ల రూపాయలు విశాఖ కలెక్టర్ వద్ద జమ చేయాలనీ ప్రమాదం జరిగిన సమయంలోనే ఎన్జీటీ కంపెనీకి ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు ఎల్జీ కంపెనీ […]
ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు తన కుమారుడు మాజీ మంత్రి నారా లోకేష్‌తో కలసి తాడేపల్లి నుంచి హైదరాబాద్ పయనమయ్యారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకంటూ 63 రోజుల తర్వాత రాష్ట్రానికి వచ్చేందుకు అనుమతి తీసుకున్నారు. 25వ తేదీన హైదరాబాద్ నుంచి విశాఖకు అక్కడ నుంచి సాయంత్రం రోడ్డు మార్గాన తాడేపల్లికి చేరుకునేందుకు ఏపీ డీజీపీ నుంచి అనుమతి తీసుకున్నారు. అయితే 25వ తేదీన విమాన […]
Unconventional politics of Jagan Man is a creature of habit అంటారు మానసిక విశ్లేషకులు. మనిషి ఒక పద్ధతికి అలవాటు పడిపోయి అలాగే జీవితం గడుపుతూ ఉంటాడు. ఏ కారణం చేతనైనా అది కొంచెం మారితే కంగారుపడిపోయి ఆ పద్ధతి తిరిగి నెలకొనేవరకూ అశాంతికి గురవుతాడు అంటారు విశ్లేషకులు. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో నాయకులు తరతరాలుగా పార్టీలకతీతంగా అలవాటు పడిపోయిన పద్ధతులను ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఛిన్నాభిన్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. […]
ఎల్జీ పాలిమర్స్ కి ఆశాభంగం అయ్యింది. సుప్రీంకోర్ట్ ని ఆశ్రయించినా ఆశించినది జరగలేదు. ఎన్జీటీ ఆదేశాలపై మధ్యంతర ఉత్తర్వుల విడుదలకు సుప్రీంకోర్ట్ నిరాకరించింది. విశాఖలో జరిగిన స్టైరీన్ గ్యాస్ ప్రమాదంలో నష్టపరిహారం కింద రూ. 50 కోట్లు డిపాజిట్ చేయాలన్న ఎన్జీటీ ఆదేశాలు చెల్లవంటూ ఎల్జీ పాలిమర్స్ పిటీషన్ దాఖలు చేసింది. కానీ కోర్ట్ మాత్రం జోక్యం చేసుకునేందకు తిరస్కరించింది. ఈనెల 7వ తేదీన విశాఖ వెంకటాపురంలో జరిగిన ప్రమాదంలో కంపెనీ యాజమాన్యం సకాలంలో స్పందించడంలో జరిగిన […]
సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పట్ల జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నా ఇంకా అనేక మంది హద్దులు దాటిపోతున్నారు. అర్థసత్యాల ఆధారంగా అందరినీ నమ్మించేందకు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి వారిని అదుపు చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేసింది. ఫేక్ పోస్టులతో సమాజాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేసిన వారిని చట్ట ప్రకారం పట్టుకుని శిక్షించింది. అయినా తీరు మారిన తెలుగుదేశం నేతలు కొందరు అడ్డగోలుగా సాగుతున్నారు. చివరకు తాజాగా ఎల్జీ పాలిమర్స్ ఘటనలో కూడా నిబంధనలు అతిక్రమించేశారు. […]
ఎక్కడో జరిగిన తప్పిదానికి..వేరెవరో బలి అయిన ఘటన అందరినీ కలచివేస్తుంది. అలాంటిది ఎప్పుడు, ఎక్కడ జరిగినా కలవరపడాల్సి ఉంటుంది. అలాంటి ఓ పారిశ్రామిక ప్రమాదంలో ప్రజల ప్రాణాలు కేవలం ఆక్సిజన్ అందని కారణంతో కోల్పోవడం మరింత అలజడి రేపుతుంది. అలాంటి సమయంలో బాధ్యత గల ప్రభుత్వం ఎలా వ్యవహరించాలన్నది తాజాగా ఏపీ ప్రభుత్వం రుజువు చేసింది. ముఖ్యమంత్రిగా జగన్ పనితీరుకి ఎల్జీ పాలిమర్స్ ఎపిసోడ్ ఓ ఉదాహరణగా నిలిచిపోతుందని చెప్పవచ్చు. తనదైన పంథాలో కదులుతూ ప్రజల సంక్షేమం […]
విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ దుర్ఘటనలో బాధితులకు అందించే పరిహారం పరిధిని రాష్ట్ర ప్రభుత్వం పెంచుకుంటూ పోతోంది. అస్వస్థతకు గురైన ప్రభావిత గ్రామాలనే కాకుండా, పక్క ప్రాంతాలనూ ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను చేపట్టారు. ఇప్పటికే 12 మంది మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున, చికిత్స తీసుకున్న వారికి రూ. 25 వేల నుంచి లక్ష […]
విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ప్రమాద బాధితులకు పరిహారం, యుద్ధప్రాతిపదికన పునరావాస చర్యలు చేపట్టడమే కాదు వారి భవిష్యత్తుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతోంది. స్టైరిన్ విషవాయువు వల్ల భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులు వస్తాయన్న అనుమానంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి నుంచే ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. రాబోయే రోజుల్లో ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని భరోసా నింపుతోంది. ఇందుకోసం గ్యాస్ లీకేజీ ప్రభావిత గ్రామాల్లో ని […]
ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీ గ్యాస్ లీకేజీ ప్రమాదం నేపధ్యంలో చంద్రబాబునాయుడు నిర్వాకాన్ని ఎల్లోమీడియానే బయటపెట్టింది. రాష్ట్రంతో పాటు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖల అనుమతులు లేవన్న విషయాన్ని చంద్రబాబు సొంత మీడియానే స్పష్టం చేసింది. ఎల్జీ పాలిమర్స్ కు పర్యావరణ అనుమతులు లేవన్న విషయాన్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సమావేశాల్లో చర్చించారు కానీ చర్యలు తీసుకునే విషయంలో మాత్రం ఆలోచించలేదని చెప్పింది. 2019 మే 10వ తేదీన ప్రభుత్వాలకు ఇచ్చిన అఫిడవిట్ లోనే కంపెనీ స్వయంగా అంగీకరించినట్లు […]