iDreamPost
android-app
ios-app

వీళ్లెప్పుడు సైంటిస్టులు అయ్యారబ్బా !!

వీళ్లెప్పుడు సైంటిస్టులు అయ్యారబ్బా !!

విశాఖ ఘటనపై విచారణకు టిడిపి ఎమ్మెల్యేల బృందం నియామకం

ప్రతిపక్ష నేత చంద్రబాబు తాను ఏది మాట్లాడితేఅదే గొప్ప అనుకుంటారు. తాను సర్వజ్ఞుడిని అని భ్రమల్లో ఉంటుంటారు.
ఎల్జీ పాలిమర్స్ సంస్థలో విష వాయువులు లీకైన ఘటన అనంతరం తనను ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కనీసం సంప్రదించలేదని, అన్నీ ఐఏఎస్ అధికారులతోనే మాట్లాడారని చంద్రబాబు తెగ ఫీలయ్యారు..అసలు ఐఏఎస్ అధికారులకు ఏమి తెలీదని,వాళ్ళతో రివ్యూలు పెట్టడం పెద్ద దండగ అని బాబు వాకృచ్చారు. తనకన్నా ఐఏఎస్ అధికారులను ఎక్కువేమి తెలీదని, తనది 40 ఏళ్ల అనుభవమని చెప్పుకొచ్చారు.

పనిలోపనిగా రాజకీయ అనుభవం ఉన్న ముగ్గురు నాయకులు అచ్చెన్నాయుడు, చినరాజప్ప, రామానాయుడులతో కూడిన ఓ కమిటీ వేశారు.
ఈ ముగ్గురు ఎక్స్పీరియెన్స్డ్ ఎమ్మెల్యేలు కమ్ రసాయన శాస్త్రవేత్తల స్థాయి మేధస్సు కలిగిన ఉద్దండులు
సదరు రసాయన పరిశ్రమలో జరిగిన గ్యాస్ లీకేజీ, దానివల్ల కలిగే దుష్ప్రరిణామాలు, ప్రజలకు ఆరోగ్యపరంగా ఎదురయ్యే చిక్కుల మీద విచారణ జరిపి చంద్రబాబుకు నివేదిక ఇస్తారన్నమాట.
వీళ్ళు ఇప్పుడు విశాఖలో పర్యటించి రసాయన వాయువుల లీకేజీ మీద లోతైన దర్యాప్తు చేస్తారు. అనంతరం ఒక నివేదిక రూపొందించి అధినేతకు ఇస్తారు. దాన్ని రసాయన శాస్త్రవేత్త
చంద్రబాబు నాయుడు పరిశీలించి ప్రభుత్వానికి, ఇంకా ఆ ఘటన మీద ఇప్పటికే దర్యాప్తు చేస్తున్న కేంద్ర,రాష్ట్ర సంస్థలకు సూచనలు చేస్తారన్నమాట.

సరే రాజకీయ నాయకుల ఆలోచనలు ఎప్పుడూ తమ మైలేజీ గురించే ఉంటాయి కానీ కొంతలో కొంతయినా వాస్తవానికి దగ్గరలో ఉంటే ప్రజలు మెచ్చుతారు. పోనీ ఈ కమిటీలో తమ పార్టీకి మొదటి నుంచి సానుభూతిపరులుగా ఉంటున్న ప్రొఫెసర్లు, రసాయనశాస్త్రము చదివిన మేధావులను వేస్తే బాగుణ్ణు గానీ అచ్చెన్న, చినరాజప్ప, రామానాయుడులను వేయడం ద్వారా ప్రజలకు ఏం మెసేజి ఇస్తున్నారో అర్థం కావడం లేదని పార్టీ శ్రేణులు అంటున్నాయి. లేదా రాత్రికిరాత్రి మా ఎమ్మెల్యేలు శాస్త్రవేత్తలు గట్రా ఐపోనారా ఏటీ అని ఆశ్చర్యపోతున్నారు.