iDreamPost
android-app
ios-app

సుప్రీంకోర్ట్ లో ఎల్జీ పాలిమర్స్ కి ఆశాభంగం

  • Published May 19, 2020 | 8:35 AM Updated Updated May 19, 2020 | 8:35 AM
సుప్రీంకోర్ట్ లో ఎల్జీ పాలిమర్స్ కి ఆశాభంగం

ఎల్జీ పాలిమర్స్ కి ఆశాభంగం అయ్యింది. సుప్రీంకోర్ట్ ని ఆశ్రయించినా ఆశించినది జరగలేదు. ఎన్జీటీ ఆదేశాలపై మధ్యంతర ఉత్తర్వుల విడుదలకు సుప్రీంకోర్ట్ నిరాకరించింది. విశాఖలో జరిగిన స్టైరీన్ గ్యాస్ ప్రమాదంలో నష్టపరిహారం కింద రూ. 50 కోట్లు డిపాజిట్ చేయాలన్న ఎన్జీటీ ఆదేశాలు చెల్లవంటూ ఎల్జీ పాలిమర్స్ పిటీషన్ దాఖలు చేసింది. కానీ కోర్ట్ మాత్రం జోక్యం చేసుకునేందకు తిరస్కరించింది.

ఈనెల 7వ తేదీన విశాఖ వెంకటాపురంలో జరిగిన ప్రమాదంలో కంపెనీ యాజమాన్యం సకాలంలో స్పందించడంలో జరిగిన నిర్లక్ష్యం 12మంది ప్రాణాలు తీసింది. వందల మంద్రి ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన దీర్ఘకాలం ప్రభావం చూపుతుందనే అంచనాలున్నాయి. దాంతో ఈ ప్రమాదంపై జోక్యం చేసుకున్న నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ఆదేశాలు జారీ చేసింది. దాని ప్రకారం కంపెనీ యాజమాన్యం రూ. 50 కోట్ల డిపాజిట్ చేయాల్సి వచ్చింది. వాటిని అనుసరించి డిపాజిట్ చేసిన తర్వాత తాజాగా కోర్టులోపిటీషన్ దాఖలు చేసింది. కానీ కోర్ట్ లో మాత్రం ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం ఆశించిన ఫలితం దక్కలేదు.

ఈ విషయంలో ఇప్పటికే ఏపీ ప్రభుత్వం రూ.30 కోట్లకు పైగా విడుదల చేసింది. బాధితులందరికీ నష్టపరిహారం అందించింది. మరోవైపు ఉన్నతాధికారులతో కూడిన కమిటీ విచారణ సాగిస్తోంది. గోపాలపట్నం పీఎస్ లో కేసు కూడా నమోదు చేసింది. రిపోర్ట్ ఆధారంగా చర్యలుంటాయని, అవసరమైతే కంపెనీ తరలిస్తామని సీఎం జగన్ ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. మరోవైపు తాము బాధితుల పక్షాన నిలుస్తామని తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్ట్ ని ఆశ్రయించి ఎన్జీటీ ఆదేశాలను రద్దు చేయించాలని ఎల్జీ పాలిమర్స్ ఆశించినప్పటికీ అందులో జోక్యం చేసుకునేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. జూన్ 1 న ఎన్జీటీలో విచారణకు రాబోతున్న నేపథ్యంలో జూన్ 8న విచారణ జరుపుతామని వాయిదా వేసింది.