విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై ప్రభుత్వం స్పందించిన తీరు, బాధితులను ఆదుకున్న వైనం, ప్రభావిత గ్రామాల్లో తిరిగి సాధారణ పరిస్థితులకు తీసుకొచ్చేందుకు చేస్తున్న కృషి నేపథ్యం లో వైసీపీ ప్రభుత్వం పై ఎలాంటి విమర్శలు చేసేందుకు అవకాశం లేకపోవడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు శివాలెత్తిపోతున్నారు. అర్థం పర్థం లేని ఆరోపణలతో జూమ్ ప్రెస్ మీట్లు పెట్టి ఊగిపోతున్నారు. బాధితులకు కోటి రూపాయలు ఏం సరిపోతుంది..10 కోట్లు ఇవ్వాలన్న డిమాండ్ నవ్వుల పాలు కావడంతో టిడిపి నేతలు వైసీపీ […]
వైజాగ్ ఎల్జి పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటన మరువక ముందే రాష్ట్రంలో మరో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నెల్లూరు నగరంలోని బాలాజీ కెమికల్స్ పరిశ్రమలో ఈరోజు భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నెల్లూరు నగరం పిసి నాయుడు నగర్ లో బాలాజీ కెమికల్స్ పరిశ్రమ ఉంది. పరిశ్రమకు సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ కు చెట్టుకొమ్మలు తగ్గడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు పక్కనే ఉన్న బాలాజీ కెమికల్స్ కు వ్యాపించాయి. దీంతో రసాయనాలు మండడంతో భారీ స్థాయిలో […]
విశాఖ సమీపంలోని ఆర్ ఆర్ వెంకటాపురం లో విషవాయువు లీకై 12 మంది మరణానికి కారణమైన ఎల్జి పాలిమర్స్ కంపెనీ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. విషవాయువు లీకైన ఘటనలో చనిపోయినవారి మృతదేహాలను ఈరోజు కింగ్ జార్జ్ ఆసుపత్రి నుంచి ఆర్ఆర్ వెంకటాపురం కి తీసుకు వచ్చారు. ఈ సమయంలో తీవ్ర ఉద్రిక్తులైన గ్రామ ప్రజలు మృతదేహాలను కంపెనీ గేటు ముందు ఉంచి ఆందోళనకు దిగారు. కంపెనీ ప్రతినిధులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.కంపెనీలో కి […]
ఇవాళ ఉదయం లేవగానే టీవీలు చూసిన ప్రతి ఒక్కరికి ఊహించని రీతిలో వైజాగ్ గ్యాస్ లీక్ తాలూకు విషాదం పెద్ద షాక్ ఇచ్చింది. ఒకపక్క కరోనా భయంతో బిక్కుబిక్కుమంటూ ఇళ్లలోనే కాలం గడుపుతున్న సమయంలో ఇలా కీలకమైన ఒక నగరాన్ని కుదిపేసిన గ్యాస్ ఉదంతం టాలీవుడ్ స్టార్లను సైతం కదిలించింది. విశాఖపట్నం శివార్లలో ఉన్న ఆర్ఆర్ వెంకటాపురంలో ఉన్న ఎల్జి పాలిమర్స్ ఫ్యాక్టరీ నుంచి లీకైన విష వాయువు వల్ల కొందరు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. […]
విశాఖలోని గోపాలపట్నం పరిధిలోని ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జి పాలిమర్స్ పరిశ్రమలో స్టెరైన్ వాయువు లీకైన కారణంగా 8 మంది మృతి చెందారు. వందలాది మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పశువులు కూడా వందల సంఖ్యలో మృత్యువాత పడ్డాయి. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించడానికి సంఘటన స్థలానికి ముఖ్యమంత్రి జగన్ వెళ్లనున్నారు. ఈరోజు ఉదయం 11.45 నిమిషాలకు విశాఖపట్నం చేరుకుంటారు.ఆసుపత్రిలో బాధితులను పరామర్శించి, రసాయన వాయువు వెలువడటానికి గల కారణాలను తెలుసుకుని […]
ముగ్గురు మృతి-అనేకమందికి అస్వస్థత విశాఖలోని గోపాలపట్నం పరిధిలోని ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జి పాలిమర్స్ పరిశ్రమలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. పరిశ్రమ నుంచి లీకైన రసాయన వాయువు సుమారు మూడు కిలోమీటర్ల మేర వ్యాపించడంతో అక్కడి స్థానిక ప్రజలు ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు. కానీ లీకైన రసాయన గాలిని పీల్చడంతో కొందరికి చర్మంపై దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. మరికొందరు అస్వస్థతకు గురై అపస్మారకస్థితిలో రహదారిపై పడిపోయారు. రసాయన వాయువు వ్యాపించడంతో […]