iDreamPost
android-app
ios-app

విశాఖ గ్యాస్ లీకేజీ ప్రమాదం- సహాయచర్యలు పర్యవేక్షణకు విశాఖకు వెళ్లనున్న జగన్

విశాఖ గ్యాస్ లీకేజీ ప్రమాదం- సహాయచర్యలు పర్యవేక్షణకు విశాఖకు వెళ్లనున్న జగన్

విశాఖలోని గోపాలపట్నం పరిధిలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలోని ఎల్‌జి పాలిమర్స్ పరిశ్రమలో స్టెరైన్‌ వాయువు లీకైన కారణంగా 8 మంది మృతి చెందారు. వందలాది మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పశువులు కూడా వందల సంఖ్యలో మృత్యువాత పడ్డాయి. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించడానికి సంఘటన స్థలానికి ముఖ్యమంత్రి జగన్ వెళ్లనున్నారు. ఈరోజు ఉదయం 11.45 నిమిషాలకు విశాఖపట్నం చేరుకుంటారు.ఆసుపత్రిలో బాధితులను పరామర్శించి, రసాయన వాయువు వెలువడటానికి గల కారణాలను తెలుసుకుని సహాయక చర్యలను ముఖ్యమంత్రి జగన్ పర్యవేక్షిస్తారు.

ఇప్పటికే బాధితులను కాపాడేందుకు అంబులెన్స్‌లు, మెడికల్‌ కిట్‌లతో భారత నావికాదళం రంగంలోకి దిగింది. ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇప్పటికే అధికారులు మరియు సిబ్బంది ప్రమాదాన్ని అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. దాదాపు మూడు కిలోమీటర్ల మేర విషవాయువు వ్యాపించడంతో స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.