iDreamPost
android-app
ios-app

నెల్లూరు బాలాజీ కెమికల్స్ లో భారీ అగ్నిప్రమాదం

  • Published May 10, 2020 | 5:28 PM Updated Updated May 10, 2020 | 5:28 PM
  • Published May 10, 2020 | 5:28 PMUpdated May 10, 2020 | 5:28 PM
నెల్లూరు బాలాజీ కెమికల్స్ లో భారీ అగ్నిప్రమాదం

వైజాగ్ ఎల్జి పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటన మరువక ముందే రాష్ట్రంలో మరో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నెల్లూరు నగరంలోని బాలాజీ కెమికల్స్ పరిశ్రమలో ఈరోజు భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నెల్లూరు నగరం పిసి నాయుడు నగర్ లో బాలాజీ కెమికల్స్ పరిశ్రమ ఉంది. పరిశ్రమకు సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ కు చెట్టుకొమ్మలు తగ్గడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు పక్కనే ఉన్న బాలాజీ కెమికల్స్ కు వ్యాపించాయి. దీంతో రసాయనాలు మండడంతో భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి. ఫలితంగా పరిసర ప్రాంతాల్లో భారీగా పొగ కమ్ముకుంది.

కెమికల్స్ పరిశ్రమ కావడంతో నగర వాసులు తీవ్ర భయాందోళన లో ఉన్నారు విశాఖ ఘటనను గుర్తు తెచ్చుకుంటూ వణికిపోతున్నారు. ప్రమాదకర వాయువులు వెలువడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అగ్నిమాపక శాఖ మంటలను ఆర్పేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ ఘటనపై పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి స్పందించారు. అధికారులను అప్రమత్తం చేశారు.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom