iDreamPost

నార్త్ HYDకి దగ్గరలో 25 వేలకే గజం స్థలం.. ఇంతకంటే తక్కువకి మరెక్కడా దొరకదు

హైదరాబాద్ లో గజం స్థలం 25 వేలకు ఎక్కడా దొరకడం లేదు. సిటీకి బాగా దూరంగా వెళ్ళిపోతే తప్ప ఈ రేట్లు దొరకడం లేదు. అయితే నార్త్ హైదరాబాద్ కి దగ్గరలో 25 వేలకే గజం స్థలం దొరుకుతుంది.  

హైదరాబాద్ లో గజం స్థలం 25 వేలకు ఎక్కడా దొరకడం లేదు. సిటీకి బాగా దూరంగా వెళ్ళిపోతే తప్ప ఈ రేట్లు దొరకడం లేదు. అయితే నార్త్ హైదరాబాద్ కి దగ్గరలో 25 వేలకే గజం స్థలం దొరుకుతుంది.  

నార్త్ HYDకి దగ్గరలో 25 వేలకే గజం స్థలం.. ఇంతకంటే తక్కువకి మరెక్కడా దొరకదు

హైదరాబాద్ లో మంచి లొకేషన్ లో స్థలం కొనాలంటే గజం స్థలం మీద తక్కువలో తక్కువ 50 వేలు అయినా ఇన్వెస్ట్ చేయాలి. ప్రాంతాలను బట్టి గజం లక్ష నుంచి 2, 3 లక్షల వరకూ ఉన్నాయి ప్లాట్ ధరలు. అయితే సిటీకి కొంచెం దూరం అయినా పర్లేదు అనుకుంటే కనుక గజం 25 వేలకే సొంతం చేసుకోవచ్చు. మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లాలో ఉన్న మేడ్చల్ ఏరియా.. సిటీలో ప్రధాన డెస్టినేషన్ గా మారనుంది. ఇది నార్త్ హైదరాబాద్ కి, సికింద్రాబాద్ కి 25 కి.మీ. దూరంలో ఉంది. రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్ట్, అవుటర్ రింగ్ రోడ్, 44వ జాతీయ రహదారికి దగ్గరగా ఉండడం వల్ల ఇది వ్యూహాత్మక ప్రదేశంగా ఉంది.

హైదరాబాద్ లో మేడ్చల్ జాతీయ రహదారి మీద ఉండడం వల్ల శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. అలానే ఇండస్ట్రియల్ ఏరియాలతో బాగా కనెక్ట్ అయి ఉంది. విస్తారమైన భూములు ఉన్నాయి. మరింత అభివృద్ధి చెందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. హెచ్ఎండీఏ అప్రూవ్డ్ ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక ఇక్కడ విద్యాసంస్థలు, హెల్త్ కేర్ సెంటర్లు, షాపింగ్ హబ్స్ సహా అనేక సౌకర్యాలు ఉన్నాయి. 43, 44, 65 ఇలా మూడు జాతీయ రహదారుల గుండా మేడ్చల్ నుంచి సిటీలోని ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీ ఉంది. అలానే స్టేట్ హైవే 17 నుంచి కూడా ఈజీ యాక్సెస్ ఉంది. పబ్లిక్ రవాణా సదుపాయాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. 

ఎందుకు మేడ్చల్ లో పెట్టుబడి పెట్టాలి?:

రియల్ ఎస్టేట్:

మేడ్చల్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, కనెక్టివిటీ వంటివి అభివృద్ధి చెందుతున్నాయి. దీని వల్ల రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాపర్టీస్ కి డిమాండ్ పెరిగింది.  

పారిశ్రామిక అవకాశాలు:

మేడ్చల్ లో పారిశ్రామిక రంగం దూసుకుపోతుంది. ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రానిక్స్, టెక్స్ టైల్స్ రంగాలను ఆకర్షిస్తుంది. చిన్న ఇండస్ట్రీస్ నుంచి భారీ పరిశ్రమల వరకూ అన్ని ఇండస్ట్రీస్ కి మేడ్చల్ ప్రాంతం అనుకూలమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు సౌకర్యాలను కల్పిస్తుంది.    

 ఐటీ:

సాఫ్ట్ వేర్ డెవలప్మెంట్, డిజిటల్ మార్కెటింగ్, ఐటీ సపోర్ట్ సర్వీసెస్ వంటి వాటిలో ఇన్వెస్ట్ మెంట్ అవకాశాలను మేడ్చల్ ప్రాంతం కల్పిస్తుంది. 

ప్రస్తుతం మేడ్చల్ లో ల్యాండ్ రేట్లు హైదరాబాద్ లో ఉన్న మిగతా ఏరియాలతో పోలిస్తే తక్కువగా ఉన్నాయి. సగటున చదరపు అడుగు స్థలం రేటు రూ. 2800 పడుతుంది. అంటే గజం 25,200 రూపాయలు పడుతుంది. 100 గజాల స్థలం కొనాలంటే 25 లక్షల 20 వేలు అవుతుంది. 2 బీహెచ్కే ఇంటికి సరిపడా స్థలం కొనాలంటే 28 లక్షలు అవుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ రేటుకి ఈ సైజులో స్థలం దొరకడం అనేది కష్టం. కానీ మేడ్చల్ లో మాత్రం తక్కువ రేటుకే స్థలాలు అందుబాటులో ఉన్నాయి. ఇన్వెస్ట్ మెంట్ కి బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. 

గమనిక: అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ధరల్లో మార్పులు ఉండవచ్చు. గమనించగలరు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి