iDreamPost

మీరు తలచుకుంటే మాదాపూర్‌లో ఇల్లు కొనగలరు.. ఎందుకంటే ధరలు తగ్గాయ్!

Madhapur Flat Rates Reduced: హైదరాబాద్ లో ఇల్లు కొనడం కష్టమే. కానీ ధరలు తగ్గినప్పుడు కొనడం కొంచెం కష్టమైనా పర్లేదు కొనేద్దాం అనుకునేవారికి ఇదే మంచి అవకాశం. ఎందుకంటే ఇప్పుడు మాదాపూర్ లో గతంతో పోలిస్తే ఇండ్ల ధరలు భారీగా తగ్గాయి. ఇప్పడు కొనుక్కుంటే కనుక భారీ లాభాలు పొందవచ్చు.

Madhapur Flat Rates Reduced: హైదరాబాద్ లో ఇల్లు కొనడం కష్టమే. కానీ ధరలు తగ్గినప్పుడు కొనడం కొంచెం కష్టమైనా పర్లేదు కొనేద్దాం అనుకునేవారికి ఇదే మంచి అవకాశం. ఎందుకంటే ఇప్పుడు మాదాపూర్ లో గతంతో పోలిస్తే ఇండ్ల ధరలు భారీగా తగ్గాయి. ఇప్పడు కొనుక్కుంటే కనుక భారీ లాభాలు పొందవచ్చు.

మీరు తలచుకుంటే మాదాపూర్‌లో ఇల్లు కొనగలరు.. ఎందుకంటే ధరలు తగ్గాయ్!

హైదరాబాద్ సిటీలో ఇల్లు కొనాలంటే కొనలేని పరిస్థితి. నెలకు లక్షల్లో సంపాదించే ఉద్యోగులు తప్పితే సామాన్యులు నగరంలో ఇల్లు కొనలేని పరిస్థితి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెడితే బంగారం మీద పెట్టిన దాని కంటే ఎక్కువే అని అంటారు. పెరగడమే గానీ తగ్గేదేలే అన్నట్టు ఇక్కడ ప్రాపర్టీ ధరలు పెరిగిపోతూ వచ్చాయి. అయితే ఇటీవల చోటు చేసుకున్న కొన్ని అనూహ్య మార్పుల కారణంగా హైదరాబాద్ లోని పలు చోట్ల స్థలాలు, ఇళ్ల ధరలు తగ్గాయి. ఇప్పటికే హైదరాబాద్ లో, శివారు ప్రాంతాల్లో స్థలాల రేట్లు ఎక్కడ తగ్గాయి? ఎక్కడ పెరిగాయి? ఇండ్ల ధరలు ఎక్కడ తగ్గాయి? అనే వివరాలు ఇచ్చి ఉన్నాం. ఈ కథనం చదివిన తర్వాత స్థలాలు, ఇండ్ల ధరలు ప్రస్తుతం ఎలా ఉన్నాయో చూడండి.

మాదాపూర్ లాంటి ఏరియాలో ఇళ్ల ధరలు దారుణంగా పడిపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మామూలు రోజుల్లో మాదాపూర్ లో ఇల్లు కొనాలంటే కోటి రూపాయలు పైనే పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి. అలాంటిది ఇప్పుడు ఏకంగా 30 లక్షలు పైనే తగ్గింది. వెస్ట్ హైదరాబాద్ లో ఉన్న మాదాపూర్ లో రెండు నెలల క్రితం వరకూ చదరపు అడుగు రూ. 9,950 ఉండేది. అంటే ఒక 2 బీహెచ్కే (1200 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఫ్లాట్) ఇల్లు కొనాలంటే కనుక కోటి 20 లక్షలు దాకా అవుతుంది. అదే ఇప్పుడు కొంటే కనుక 2 బీహెచ్కే ఫ్లాట్ కి 83 లక్షలు వరకూ అవుతుంది. చదరపు అడుగు మీద ఏకంగా రూ. 3 వేలు తగ్గింది.

ప్రస్తుతం మాదాపూర్ లో చదరపు అడుగు రూ. 6950/-గా ఉంది. అంటే గజం రూ. 62,550 పడుతుంది. అంతకు ముందు అయితే 89 వేలు పైనే ఉండేది. మాదాపూర్ లో ఫ్లాట్ కొనుక్కోవాలి అనుకునేవారికి ఇదే మంచి అవకాశం. కోటి 20 లక్షలు పైనే ఉన్న మాదాపూర్ ఫ్లాట్స్ ఇప్పుడు రూ. 80 లక్షలకే అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు కొనుగోలు చేయడం ద్వారా మీకు 36 లక్షల వరకూ ఆదా అవుతుంది. అంటే మళ్ళీ ఇక్కడ ప్రాపర్టీ ధరలు పెరిగితే కనుక ఆ 36 లక్షలు లాభం వచ్చినట్టే. ఐటీ ఉద్యోగులకు ఇది మంచి అవకాశం అని చెప్పాలి. అయితే ఈ ధరలనేవి ఆ ఏరియాలలో ఉన్న యావరేజ్ ధరలు. ఈ ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. 

గమనిక: అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ధరల్లో మార్పులు ఉండవచ్చు. గమనించగలరు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి