iDreamPost

కొండాపూర్‌లో స్థలం కొంటారా? భారీగా తగ్గిన రేట్లు.. ఎంత తగ్గాయంటే?

Land Rates Reduced In Kondapur: స్థలం కొనాలి లేదా స్థలం మీద ఇన్వెస్ట్ చేసి లాభాలు పొందాలి అని అనుకుంటున్నారా? అయితే ఇదే మంచి అవకాశం. హైదరాబాద్ లో ప్రధాన ఏరియాగా ఉన్న కొండాపూర్ లో ల్యాండ్ రేట్లు తగ్గాయి. ఎంత తగ్గాయంటే?

Land Rates Reduced In Kondapur: స్థలం కొనాలి లేదా స్థలం మీద ఇన్వెస్ట్ చేసి లాభాలు పొందాలి అని అనుకుంటున్నారా? అయితే ఇదే మంచి అవకాశం. హైదరాబాద్ లో ప్రధాన ఏరియాగా ఉన్న కొండాపూర్ లో ల్యాండ్ రేట్లు తగ్గాయి. ఎంత తగ్గాయంటే?

కొండాపూర్‌లో స్థలం కొంటారా? భారీగా తగ్గిన రేట్లు.. ఎంత తగ్గాయంటే?

హైదరాబాద్ లో స్థలం కొనాలనేది చాలా మంది కల. ఇక్కడ భూమి మీద ఇన్వెస్ట్ చేస్తే లక్షల్లో లాభాలు వస్తాయని బలంగా నమ్ముతారు. కొంతమంది తమ సొంత ప్రయోజనాల కోసం స్థలం కొనుక్కుంటారు. కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి లాభాలు పొందాలని కొనుక్కుంటారు. కానీ హైదరాబాద్ లో ఏ మూలన ఇన్వెస్ట్ చేసినా గానీ లాభం అనేది ఉంటుంది. అప్పుడప్పుడూ ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి కానీ రియల్ ఎస్టేట్ మరీ దారుణంగా పడిపోవడం అయితే జరగదు. ప్రస్తుతం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో స్థలాల ధరలు, ఇళ్ల ధరలు తగ్గాయి. కొన్ని ప్రాంతాల్లో భారీగా పెరిగినప్పటికీ ప్రధాన ఏరియాల్లో మాత్రం తగ్గాయి. కొండాపూర్ లో కూడా స్థలాల ధరలు తగ్గాయి. 

2023లో జనవరి-మార్చి నెలల్లో చదరపు అడుగు స్థలం రూ. 11,450 ఉండగా.. ఆ తర్వాత ఏప్రిల్-జూన్ నెలల్లో 10,550కి పడిపోయింది. ఆ తర్వాత జూలై-సెప్టెంబర్ నెలల్లో 12,450కి పెరిగింది. ఈ ఏడాది జనవరి-మార్చి నెలల్లో గత ఏడాది ధరలకు చేరుకుంది. చదరపు అడుగు రూ. 14,800కి చేరింది. ప్రస్తుతం మాత్రం చదరపు అడుగు మీద రూ. 1400 తగ్గింది. ప్రస్తుతం చదరపు అడుగు స్థలం రూ. 13,400గా ఉంది. అంటే గజం మీద ఏకంగా రూ. 12,600 తగ్గింది. మీరు కనుక 1200 చదరపు అడుగుల స్థలం కొన్నట్లైతే కనుక దాదాపు 17 లక్షలు మిగులుతాయి. ప్రస్తుతం ఈ ఏరియాలో గజం యావరేజ్ గా రూ. 1,20,600 పడుతుంది.

అంతకు ముందు రూ. 1,33,200 ఉండేది. కాబట్టి స్థలం కొనాలనుకునే ఐటీ ఉద్యోగులకు, పెట్టుబడి పెట్టాలనుకునేవారికి ఇదే మంచి అవకాశం. మళ్ళీ ఈ ధరలు పెరిగితే కనుక అతి తక్కువ సమయంలోనే మంచి లాభాలను పొందవచ్చు. ఇప్పుడు 17 లక్షల నుంచి 20 లక్షలు మిగలడమే కాకుండా.. రేట్లు పెరిగాక 20 లక్షల వరకూ లాభం పొందవచ్చు. అయితే ఈ ఏరియాలో ఇవి సగటు ధరలు. ఈ ధరల మీద కొంచెం తక్కువ ఉండచ్చు లేదా ఎక్కువ ఉండచ్చు. ఎలా ఉన్నా కానీ ప్రస్తుతం అయితే కొండాపూర్ లో స్థలాల రేట్లు అయితే తగ్గాయని రియల్ ఎస్టేట్ కంపెనీలు తమ నివేదికల్లో వెల్లడించాయి. కాబట్టి కొనాలనుకునేవారికి, రియల్ ఎస్టేట్ లో లాభాలు పొందాలనుకునేవారికి ఇదే మంచి అవకాశం.  

గమనిక:

అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ధరల్లో మార్పులు ఉండవచ్చు. గమనించగలరు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి