iDreamPost

తనవారి బాగు కోసం దర్శన్ చేసే పోరాటం! OTTలో మంచి సినిమా!

OTT Suggestions Hero Darshan Best Movie Yajamana: ఛాలెంజింగ్ స్టార్ హీరో దర్శన్ తన కెరీర్లో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మెప్పించాడు. తన కెరీర్లో వచ్చిన ఒక బెస్ట్ మూవీ ఇప్పుడు ఓటీటీలో ట్రెండ్ అవుతోంది.

OTT Suggestions Hero Darshan Best Movie Yajamana: ఛాలెంజింగ్ స్టార్ హీరో దర్శన్ తన కెరీర్లో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మెప్పించాడు. తన కెరీర్లో వచ్చిన ఒక బెస్ట్ మూవీ ఇప్పుడు ఓటీటీలో ట్రెండ్ అవుతోంది.

తనవారి బాగు కోసం దర్శన్ చేసే పోరాటం! OTTలో మంచి సినిమా!

ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అక్కర్లేదు. సౌత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో. కన్నడ ప్రజలు అభిమానంగా బాస్ అని పిలుచుకుంటారు. అయితే దర్శన్ ఇటీవల అభిమాని హత్య కేసులో ముద్దాయిగా ఉన్న విషయం తెలిసిందే. ఆ వార్త దేశవ్యాప్తంగా తెగ వైరల్ అయ్యింది. దర్శన్ తన ప్రియురాలి కోసం అభిమానిని హత్య చేయించాడు అంటూ చాలానే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఓటీటీలో ఉన్న దర్శన్ సినిమాలు ట్రెండ్ అవుతున్నాయి. వాటిలో ఈ మూవీ కూడా ఒకటి. ఈ సినిమా మాత్రం ఎంతో అద్భుతంగా ఉంటుంది. దర్శన్ యాక్టింగ్ హైలెట్ గా నిలుస్తుంది.

ఓటీటీలో దర్శన్ యాక్ట్ చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. వాటిలో కాటేరాకి ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఆ సినిమాకి ఓటీటీలో కూడా మంచి వ్యూవర్ షిప్ లభిచింది. ఈ మూమెంట్లో కాటేరా చిత్రాన్ని కూడా ఆడియన్స్ మరోసారి చూస్తున్నారు. అయితే అంతకన్నా ఓల్డ్ సినిమా ఒకటి మరోసారి ట్రెండ్ అవుతోంది. ఆ మూవీలో దర్శన్ ఎంతో ప్రత్యేకమైన రోల్ చేశాడు. తన కుటుంబం, తన ఊరు, తన గ్రామ ప్రజల కోసం తన ప్రాణాలను కూడా లెక్క చెయ్యడు. ఆ ఊరు బాగుకోసం ఎంతకైనా తెగిస్తాడు. ప్రేమ, అనురాగం, మమకారం వంటి పదాలకు అర్థం తెలియని ఒక విలన్ కి బుద్ధి చెప్పడం కోసం తాను యాక్షన్ లోకి దిగుతాడు.

Darshan Movie

ఛాలెంజింగ్ స్టార్ విసిరిన ఛాలెంజ్ ని అందుకున్న విలన్ తన గ్రామాన్ని టార్గెట్ చేస్తాడు. తన గ్రామ ప్రజలను మాత్రమే కాకుండా.. తన కుటుంబాన్ని కూడా ఇబ్బందుల్లోకి నెడతాడు. తన వాళ్లు అందరినీ ప్రమాదంలో నుంచి బయట పడేయడం మాత్రమే కాకుండా.. తన ఊరిని కూడా కాపాడుకుంటాడు. దర్శన్ ఈ మూవీలో సాంప్రదాయ బద్దంగా నూనె తయారు చేసే వ్యాపారిగా కనిపిస్తాడు. తన కుటుంబం మొత్తం ఎంతో మంచి పద్ధతిలో ఈ వ్యాపారం చేస్తూ ఉంటారు. అలాంటి వారిని దెబ్బ తీయడానికి వచ్చిన ఈగో కలిగిన విలన్ కి దర్శన్ తనదైన శైలిలో బుద్ధి చెప్తాడు.

ఈ సినిమా పేరు యజమాన. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. మీరు గనుక ఈ సినిమాని ఇంకా చూడకపోతే మాత్రం తప్పకుండా చూసేయండి. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చూశామనే బావన కలుగుతుంది. పైగా ఈ చిత్రంలో హీరోయిన్ గా పాన్ ఇండియా క్రష్ రష్మికా మందన్నా నటించింది. దర్శన్- రష్మికా యాక్టింగ్ మాత్రమే కాకుండా.. సాంగ్స్, డ్యాన్సులు అన్నీ ఆకట్టుకుంటాయి. మరి.. మీరు ఈ యజమాన సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి