iDreamPost

శ్రద్ధాదాస్ వ్యభిచారి పాత్రలో వచ్చిన థ్రిల్లర్.. OTTలో ఉంటే ఇంకా చూడలేదా?

OTT Suggestions- Best Thriller Nireekshana Movie: ఓటీటీల్లో మీరు బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ కోసం చూస్తున్నారా? అయితే మీకు ఈ మూవీ చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఇందులో మంచి సస్పెన్స్ మాత్రమే కాకుండా.. ఒక సైకో కూడా ఉంటాడు.

OTT Suggestions- Best Thriller Nireekshana Movie: ఓటీటీల్లో మీరు బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ కోసం చూస్తున్నారా? అయితే మీకు ఈ మూవీ చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఇందులో మంచి సస్పెన్స్ మాత్రమే కాకుండా.. ఒక సైకో కూడా ఉంటాడు.

శ్రద్ధాదాస్ వ్యభిచారి పాత్రలో వచ్చిన థ్రిల్లర్.. OTTలో ఉంటే ఇంకా చూడలేదా?

ఓటీటీలో ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ చూడాలి అనుకుంటుంటే మాత్రం మీకు ఇది బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. ఎందుకంటే ఓటీటీలో ఈ మూవీకి పిచ్చెక్కిపోతారు. ఎందుకంటే ఇదంతా ఒక సైకో కిల్లర్ డ్రామా. వరుసగా హత్యలు జరుగుతూ ఉంటాయి. చేసేది ఎవరో ఆడియన్స్ కు తెలుసు. కానీ, పోలీసులు పట్టుకోవడానికి మాత్రం చాలా కష్టపడుతూ ఉంటారు. అలాగే వాడి టార్గెట్ కేవలం పడుపు వృత్తి చేసే వాళ్లే కావడం గమనార్హం. అతను రోజుకు ఒక అమ్మాయిని బుక్ చేసుకుని ఆ రాత్రే అతి దారుణంగా చంపుతూ ఉంటాడు. వాడిని పట్టుకోవడం పోలీసులు టార్గెట్. మరి.. అది సాధ్యం అయ్యిందా అనే పాయింట్లో మంచి థ్రిల్లింగ్ నరేషన్ తో ఈ మూవీని తీశారు.

సాధారణంగా థ్రిల్లర్ అంటేనే తెగ ఇష్టపడుతూ ఉంటాం. అలాంటిది సైకో థ్రిల్లర్ అంటే ఎందుకు నచ్చదు చెప్పండి. ఇందులో మంచి మంచి పాయింట్లు కూడా ఉన్నాయి. అజయ్ ఘోష్ అమ్మాయిల సప్ల*యర్ గా ఉంటాడు. అతని దగ్గర ఉన్న అందమైన అమ్మాయిలతో మంచిగా సంపాదిస్తూ ఉంటాడు. అయితే ఒకరోజు అతనికి ఒక వ్యక్తి నుంచి ఫోన్ వస్తుంది. అతనికి ఒక అమ్మాయి కావాలి అంటాడు. అజయ్ ఘోష్ ఎవరు ఏంటి అని కూడా అడగకుండా పంపేస్తాడు. ఆ అమ్మాయి తిరిగి రాదు. అలా ఒకసారి కాదు.. పలుసార్లు అమ్మాయిలను తీసుకెళ్లి కిరాతకంగా హత్య చేస్తూ ఉంటాడు. అలాంటి వాడిని పట్టుకోవడం కోసం పోలీసులు కూడా తెగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

Sradda Das

అందులో శ్రద్ధదాస్ కాస్త కొత్తగా ట్రై చేస్తుంది. తానే ఒక వ్యభిచారిణి పాత్రలో ఆ హంతకుడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అలా అయినా ఆ కిల్లర్ ను పట్టుకోవచ్చు అనే ఉద్ధేశంతో అలా చేస్తుంది. కానీ, అది కూడా విఫలయత్నంగా మారుతుంది. మరోవైపు ఇందులో ఒక క్యూట్ లవ్ స్టోరీ కూడా ఉంది. ఒక అబ్బాయి- అమ్మాయి వారి ప్రేమ గోల. అది కాస్తా ఈ సైకో కిల్లర్ మధ్యలోకి వస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ ని కిడ్నాప్ చేస్తాడు. ఆమెను అతి కిరాతకంగా చంపేందుకు ప్లాన్ చేస్తాడు. అయితే ఈ సైకో పోలీసులకు చిక్కినా కూడా అతని దగ్గరి నుంచి నిజాన్ని చెప్పించలేకపోతారు.

మొత్తానికి ఈ సైకో వల్ల ఎంత మంది హత్యకు గురయ్యారు? ఎంతమంది ప్రాణాలు కోల్పోకముందే పోలీసులు వాడిని పట్టుకున్నారు? హీరోయిన్ ని హీరో కాపాడుకున్నాడా? అనేదే పాయింట్. ఈ సినిమా పేరు నిరీక్షణ. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఫ్రీగా చూసే అవకాశం లేదు. 99 రూపాయలకు రెంటుకు తీసుకుని చూడాల్సి ఉంటుంది. ఇందులో కథ, కథనం ఓకే. కానీ, యాక్టింగ్ మాత్రం కాస్త ఇబ్బంది పెడుతుంది. సీనియర్స్ యాక్టింగ్ ఓకేగానే ఉంటుంది. కానీ కొందరి యాక్టింగ్ మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి