iDreamPost

బ్రేకప్.. ప్యాచప్.. OTTలో ఈ లవర్స్ ని చూస్తే ముచ్చటేస్తుంది!

OTT suggestions- Best Love Story One Day: ఓటీటీల్లో మంచి మంచి లవ్ స్టోరీలను చూసే ఉంటారు. కానీ, ఈ లవ్ స్టోరీ మాత్రం మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తుంది. అరె ఏంట్రా ఇలాంటి మూవీ మిస్ అయ్యాను అనిపిస్తుంది. ఒక మంచి యూత్ ఫుల్ లవ్ స్టోరీ కావాలి అంటే ఈ మూవీ చూసేయండి.

OTT suggestions- Best Love Story One Day: ఓటీటీల్లో మంచి మంచి లవ్ స్టోరీలను చూసే ఉంటారు. కానీ, ఈ లవ్ స్టోరీ మాత్రం మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తుంది. అరె ఏంట్రా ఇలాంటి మూవీ మిస్ అయ్యాను అనిపిస్తుంది. ఒక మంచి యూత్ ఫుల్ లవ్ స్టోరీ కావాలి అంటే ఈ మూవీ చూసేయండి.

బ్రేకప్.. ప్యాచప్.. OTTలో ఈ లవర్స్ ని చూస్తే ముచ్చటేస్తుంది!

ప్రేమకథ.. ఈ ప్రపంచమే ప్రేమ మీద ఆధారపడి నడుస్తోంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ విశ్వం ముందుకు వెళ్లాలి అంటే ముఖ్యంగా కావాల్సింది ప్రేమ. అంతా దాని మీద ఆధారపడే ముందుకు వెళ్తుంది. అందుకే ఆడియన్స్ కూడా ఎక్కువగా ప్రేమకథలను ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి ఆడియన్స్ కోసం ఒక క్యూట్ అండ్ స్వీట్ లవ్ స్టోరీ తీసుకొచ్చాం. ఈ మూవీ చూస్తే మీరు కచ్చితంగా ఫిదా అయిపోతారు. ఇది సినిమా కూడా కాదు.. ఒక వెబ్ సిరీస్. ఈ సిరీస్లో ఒక అబ్బాయి.. ఒక అమ్మాయి.. వారి మధ్య ప్రేమే ఉంటుంది. అయితే సీదా చూడటం.. మాట్లాడటం.. ప్రేమించుకోవడం చేస్తే ఏం బాగుంటుంది. అందుకే ఆ మూడింటి మధ్యలో మంచి డ్రామా క్రియేట్ చేశారు.

మీరు సాధారణంగా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనే మాట వినే ఉంటారు. అంటే మీకు ఒకరిని చూడగానే వారి మీద తెలియని ఫీలింగ్ కలుగుతుంది. వారితో మీ జీవితం మొత్తాన్ని ఊహించేసుకుంటారు. అలాంటి పాయింట్ తోనే ఈ కథ స్టార్ట్ అవుతుంది. ఒక కుర్రాడు.. ఒక అమ్మాయి.. ఇద్దరూ తొలిచూపులోనే ఒకరిని ఒకరు ఇష్టపడతారు. ఒకరు లేకుండా మరొకరు ఉండలేం అనేంత గాఢంగా ప్రేమించుకుంటారు. అయితే వారి ప్రేమను ముందే వ్యక్త పరచకుండా డేటింగ్ స్టార్ట్ చేస్తారు. ఒకరిని ఒకరు కలవడం, మాట్లాడటం, ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకోవడం చేస్తూ ఉంటారు. ఆ తరుణంలోనే వారి మధ్య బాండింగ్ మరింత బలపడుతుంది.

One Day

మీరు ఈ కొటేషన్ చదివే ఉంటారు.. ప్రేమ ఉన్న దగ్గరే కోపం, గొడవలు ఉంటాయని. వీళ్ల మధ్య ప్రేమ చాలా ఎక్కువ కదా.. అందుకే కాస్త గట్టిగానే గొడవలు పడతారు. ఒకరంటే ఒకరికి చచ్చేంత ప్రేమ. కానీ, ఒకరంటే ఒకరికి పడదు అన్నట్లు మారిపోతారు. ఒక్క క్షణం కూడా వదిలి ఉండలేని పరిస్థితి నుంచి.. ఒక్క క్షణం కూడా కలిసి ఉండలేని స్థితికి వచ్చేస్తారు. నోరు తెరిస్తే గొడవ.. పలకరిస్తే వాదన.. ఇదే ధోరణిగా మారిపోతారు. అసలు వాళ్ల మధ్య ఏం జరిగింది? అనే పాయింట్ మనల్ని బాగా ఎంగేజ్ చేస్తుంది.

అంత గాఢంగా ప్రేమించుకున్న వాళ్లు.. ఇలా శత్రువులుగా ఎందుకు మారారా? అసలు వారి మధ్య ఎందుకు చెడింది? ఎందుకు వాళ్లు శత్రువులుగా మారిపోయారు? అసలు చివరికి వాళ్లు కలిశారా లేదా? చెప్పడం మర్చిపోయాను.. వాళ్లిద్దరికీ బిడ్డ కూడా పుడుతుంది. మరి.. ఆ బిడ్డ సంగతి ఏంటి? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ పాయింట్స్, ప్రశ్నలకు సమాధానం దొరికాలి అంటే మీరు కచ్చితంగా ఈ మూవీ చూడాల్సిందే. ఈ మూవీ పేరు ‘వన్ డే’. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో ఫిబ్రవరి 8 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మీరు గనుక ఈ సినిమాని మిస్ అయ్యుంటే.. కచ్చితంగా చూసేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి