iDreamPost

OTT Suggestion: ఇంట్లో దెయ్యం.. అనుక్షణం వెంటాడుతూ.. OTTలో బెస్ట్ హారర్ మూవీ!

  • Published Jun 27, 2024 | 4:36 PMUpdated Jun 27, 2024 | 4:36 PM

OTT Best Horror Suspense Thriller: ఇప్పటివరకు ఓటీటీ లో చాలానే హర్రర్ సినిమాలు చూసి ఉంటారు కానీ.. ఇలాంటి హర్రర్ సినిమాను మాత్రం చూసి ఉంటారు. అసలు ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో.. ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

OTT Best Horror Suspense Thriller: ఇప్పటివరకు ఓటీటీ లో చాలానే హర్రర్ సినిమాలు చూసి ఉంటారు కానీ.. ఇలాంటి హర్రర్ సినిమాను మాత్రం చూసి ఉంటారు. అసలు ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో.. ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

  • Published Jun 27, 2024 | 4:36 PMUpdated Jun 27, 2024 | 4:36 PM
OTT Suggestion: ఇంట్లో దెయ్యం.. అనుక్షణం వెంటాడుతూ.. OTTలో బెస్ట్ హారర్ మూవీ!

హర్రర్ సినిమాలన్నీ ఒకేలా ఉంటాయని.. కొంతమంది కొన్ని సినిమాలను లైట్ తీసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను కానీ మిస్ చేసి ఉంటే మాత్రం.. ఓ మంచి హర్రర్ సినిమాను మిస్ చేసినట్లే. ఇప్పటివరకు ఎన్నో హర్రర్ సినిమాలను చూసి ఉంటారు కానీ.. ఇలాంటి సినిమాను మాత్రం అసలు చూసి ఉండరు. అంత డిఫ్ఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు మేకర్స్. కాబట్టి హర్రర్ మూవీ లవర్స్ అంతా కూడా అసలు మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో.. ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

ఈ సినిమా కథేంటంటే… పిమ్ , పుత్ ఇద్దరు అక్కాతమ్ముళ్ళు. వాళ్ళ అమ్మ మాయి ఓ సింగిల్ పేరెంట్. వీరు ముగ్గురు కలిసి సరదాగా తమ జీవితాలను గడుపుతూ ఉంటారు. ఈ క్రమంలో ఓ రోజు మాయి తన ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చిందని.. సాయంత్రం పార్టీ ఇస్తానని చెప్తుంది. ఇక ఆ రోజు సాయంత్రం పిమ్ ఇంటికి వచ్చేసరికి.. పుత్ తన ఫ్రెండ్ తో కలిసి ఇంటికి వచ్చి వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటాడు. పిమ్ బట్టలు మార్చుకోడానికి వెళ్తున్నప్పుడు.. పుత్ ఫ్రెండ్ కూడా పిమ్ ను ఫాలో అయ్యి వెళ్తాడు. పిమ్ గట్టిగా తలుపు వేయడంతో… పుత్ ఫ్రెండ్ కాలికి గాయం అవుతుంది. కట్ చేస్తే.. పుత్ ఫ్రెండ్ పుత్ తో.. మీ అక్క బాగా ఎక్కువ చేస్తుంది. ఆమె నాతో డేటింగ్ చేయకపోతే.. ఆమె బట్టలు మార్చుకుంటున్నపుడు తీసిన వీడియో లీక్ చేస్తానని బెదిరిస్తాడు.

ఇక మరోవైపు.. మాయి ఇంటికి వచ్చే దారిలో పెద్ద వర్షం పడుతుండడంతో.. ఆమెకు యాక్సిడెంట్ అయ్యి కోమాలోకి వెళ్తుంది. దీనితో మాయి తండ్రి.. పిమ్, పుత్ దగ్గరకు వచ్చి.. నేను మీ తాతయ్యను అని చెప్పి వారిని హాస్పిటల్ కు తీసుకుని వెళ్తాడు. వారిద్దరిని ఒంటరిగా వదిలేయడం ఇష్టం లేక. వారి అమ్మమ్మ తాతయ్య వారిద్దరిని వారితో పాటు తీసుకుని వెళ్తారు. కొత్త ప్లేస్ అవ్వడంతో ఆ ఇల్లు వారికి కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. ఓ రోజు పుత్ కు ఆ ఇంట్లోని ఓ గదిలో ఓ కన్నం కనిపిస్తుంది. అందులో నుంచి చూస్తే.. పక్క గదిలో ఓ దెయ్యం కనిపిస్తుంది. కానీ ఆ దెయ్యం పిమ్ , పుత్ లకు మాత్రమే కనిపిస్తుంది. ఈ క్రమంలో ఓ రోజు పుత్ ఫ్రెండ్.. ఆ కొత్త ఇంటికి కూడా వచ్చి పుత్ ను బెదిరిస్తూ ఉంటాడు. అయితే పుత్ తన ఫ్రెండ్ కు ఆ కన్నం చూపించి ఏమైనా కనపడుతుందా అని అడుగుతాడు. అతను ఆ కన్నంలోకి చూసిన వెంటనే ఎవరో పుత్ ఫ్రెండ్ ను.. గట్టిగా కొడతారు. దీనితో అతని ముక్కు పగిలి రక్తం వస్తుంది. తన మీద కోపంతోనే పుత్ తనను కొట్టడనుకుని.. ఆ వీడియో లీక్ చేస్తానని పుత్ ఫ్రెండ్ అక్కడినుంచి వెళ్ళిపోతాడు.

పిమ్ , పుత్ కీ ఏమో ఆ కన్నంలో చూసిన ప్రతిసారి ఎదో ఒక వింత ఘటన కనపడుతూనే ఉంటుంది. అలాగే ఓసారి ఆ కన్నంలో చూసినప్పుడు .. ఓ అమ్మాయి రక్తం కక్కుకుని చనిపోయినట్లు కనిపిస్తుంది. ఈలోపు వాళ్ళమ్మ మాయి కోమాలో నుంచి బయటకు వస్తుంది. పిల్లలు అమ్మమ్మ తాతయ్య ఇంట్లో ఉన్నారని తెల్సి చాలా కంగారు పడుతుంది. అసలు ఆమె ఎందుకు కంగారు పడుతుంది! అమ్మమ్మ, తాతయ్య ఇంట్లో ఏముంది ! ఎందుకు పిమ్ , పుత్ లకు మాత్రమే ఆ దెయ్యం కనిపిస్తుంది! అసలు వాళ్ళ మాయి కి పేరెంట్స్ ఉన్నారా ! పుత్ ఫ్రెండ్ ఆ వీడియో ను లీక్ చేస్తాడా ! ఇవన్నీ తెలియాలంటే “ది హోల్ ట్రూత్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ మూవీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను మిస్ చేస్తే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి