iDreamPost

Telugu OTT Bold Movie: పెద్దలు మాత్రమే చూడాల్సిన బో*ల్డ్ మూవీ OTT లోకి వచ్చేసింది!

  • Published Jun 27, 2024 | 5:45 PMUpdated Jun 27, 2024 | 5:45 PM

ఈ మధ్య కాలంలో థియేటర్స్ లో రిలీజ్ అయినా సినిమాలలో.. ఈ సినిమా త్వరగా ఓటీటీ లోకి వస్తే బావుంటుంది అని.. కొన్ని సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతో ఇంట్రెస్ట్ గా ఎదురుచూస్తూ ఉంటారు. ఇప్పుడు అలాంటి ఓ సినిమానే ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

ఈ మధ్య కాలంలో థియేటర్స్ లో రిలీజ్ అయినా సినిమాలలో.. ఈ సినిమా త్వరగా ఓటీటీ లోకి వస్తే బావుంటుంది అని.. కొన్ని సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతో ఇంట్రెస్ట్ గా ఎదురుచూస్తూ ఉంటారు. ఇప్పుడు అలాంటి ఓ సినిమానే ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

  • Published Jun 27, 2024 | 5:45 PMUpdated Jun 27, 2024 | 5:45 PM
Telugu OTT Bold Movie: పెద్దలు మాత్రమే చూడాల్సిన బో*ల్డ్ మూవీ OTT లోకి వచ్చేసింది!

కొన్ని సినిమాలు ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉన్నా సరే.. థియేటర్ లో అందరితో కలిసి చూడలేము. ఒంటరిగా చూడడానికే ఇష్టపడుతూ ఉంటారు ప్రేక్షకులు. అందులోను అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమాలైతే.. ఎప్పుడెప్పుడు ఒంటరిగా చూద్దామా అని ఎదురుచూస్తుంటారు. ఇక ఈ మధ్య కాలంలో అచ్చం అలాంటి సినిమానే ఒకటి థియేటర్ లోకి వచ్చేసింది. థియేటర్ లో ఈ సినిమా యావరేజ్ టాక్ సంపాదించుకున్నా కూడా.. ఓటీటీ లో మాత్రం హిట్ టాక్ సంపాదించుకుంటుంది చెప్పొచ్చు. మరి ఈ బో*ల్డ్ కంటెంట్ మూవీ ఏంటి.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

కొన్ని సినిమాలు పిల్లలతో కలిసి అసలు చూడలేరు.. కేవలం పెద్దలు మాత్రమే చూడాలి.. అవే బో*ల్డ్ కంటెంట్ సినిమాలు. ఇప్పటివరకు డిఫ్ఫరెంట్ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో.. రకరకాల జోనర్స్ లో రొ*మాంటిక్ , బో*ల్డ్ సినిమాలు వచ్చాయి. ఇలాంటి సినిమాలకు యూత్ లో మంచి క్రేజ్ ఉంటుంది. ఇక ఈ మధ్య కాలంలో ఇలాంటి కంటెంట్ తో వచ్చిన సినిమా లవ్ మౌళి. చాలా గ్యాప్ తర్వాత నవదీప్ మెయిన్ లీడ్ లో నటించిన.. ఈ సినిమాపై అందరికి భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ థియేటర్ లో మాత్రం అంతగా మెప్పించలేకపోయింది. అయితే యూత్ మెచ్చే అడల్ట్ సీన్స్ మాత్రం చాలానే ఉన్నాయని సమాచారం. ఇక ఈ సినిమా మొదట ఆహా, అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుందని టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు ఈ సినిమా కేవలం ఆహా ప్లాట్ ఫార్మ్ లో జూన్ 17 అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఖచ్చితంగా ఈ సినిమా ఓటీటీ లవర్స్ ని మెప్పిస్తుందని చెప్పి తీరాలి.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. నవదీప్ చిన్నప్పుడే తన తల్లిదండ్రులు విడిపోవడంతో.. ఒంటరిగా పెరుగుతాడు. మేఘాలయాలోని ఓ రిసార్ట్ లో ఉంటూ.. తనకు నచ్చినట్లు లైఫ్ ను లీడ్ చేస్తూ ఉంటాడు. అయితే అతనికి మనుషులంటే అసలు పడదు. అతను ఎంతో అద్భుతంగా పెయింటింగ్స్ వేస్తాడు. దాని ద్వారా వచ్చిన డబ్బుతోనే తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఈ క్రమంలో ఓ రోజు అతనికి ఒక అఘోర ఓ మ్యాజిక్ పెయింటింగ్ బ్రష్ ను ఇస్తాడు. ఆ బ్రష్ తో అతను ఓ అందమైన అమ్మాయి బొమ్మ గీస్తాడు. ఆ బొమ్మ కాస్త నిజంగానే ప్రత్యేక్షమవుతుంది. మెల్లగా వాళ్ళ మధ్య పరిచయం పెరుగుతుంది. కొన్నాళ్ళు వాళ్ళ మధ్య రిలేషన్ బాగానే ఉన్నా సరే.. ఆ తర్వాత గొడవలు అవుతాయి. మళ్ళీ అతను మరొక అమ్మాయి బొమ్మ గీస్తాడు. అప్పుడు కూడా మొదట గీసిన అమ్మాయే వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది ! వారి మధ్య బాండింగ్ ఎలా ముందుకు సాగింది ! అనేదే ఈ సినిమా కథ. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి