iDreamPost

డ్యాన్స్ నేర్పమంటే ఒంటిపై చేతులు వేస్తూ.. OTTలో బెస్ట్ థ్రిల్లర్!

OTT Suggestions- Best Suspense Thriller Black Swan: ఓటీటీలు వచ్చిన తర్వాత చాలా మంది డ్రామాలు చూస్తున్నారు. కానీ, ఈ సస్పెన్స్ థ్రిల్లర్ గనుక ఒకసారి చూస్తే మీరు మెస్మరైజ్ అవుతారు.

OTT Suggestions- Best Suspense Thriller Black Swan: ఓటీటీలు వచ్చిన తర్వాత చాలా మంది డ్రామాలు చూస్తున్నారు. కానీ, ఈ సస్పెన్స్ థ్రిల్లర్ గనుక ఒకసారి చూస్తే మీరు మెస్మరైజ్ అవుతారు.

డ్యాన్స్ నేర్పమంటే ఒంటిపై చేతులు వేస్తూ.. OTTలో బెస్ట్ థ్రిల్లర్!

మీకు థ్రిల్లర్స్ అంటే ఇష్టమా? ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అయితే అలాంటి ఇలాంటి థ్రిల్లర్స్ కాకుండా.. మంచి కథ, కథనం ఉండే థ్రిల్లర్స్ చూసి చాలా రోజులు అయ్యింది అని బాధ పడుతున్నారా? అయితే మీకోసం ఒక క్రేజీ థ్రిల్లర్ తీసుకొచ్చాం. ఈ మూవీ ఇప్పటిది కాదులెండి.. వచ్చి చాలా ఏళ్లు అవుతోంది. అందుకే ఇది బెస్ట్ థ్రిల్లర్ అని మీకు బలంగా చెప్తున్నాం. ఈ మూవీ వచ్చి 14 ఏళ్లు అవుతోంది. కానీ, కథలో మాత్రం దీనిని కొట్టే థ్రిల్లర్ ఉండదు. ఎందుకంటే కథ మొత్తం ఒక డ్రామాలా సాగుతూ ఉంటుంది. కానీ, ట్విస్టులు.. టేకింగ్ మాత్రం నెక్ట్స్ లెవల్లో ఉంటుంది.

ఈ సినిమా మొత్తం ఒక అమ్మాయి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆమె ఒక క్లాసికల్ డ్యాన్సర్. క్లాసికల్ అనగానే కూచిపూడి, భరతనాట్యం అనుకోకండి. ఆమె ఫారనర్ కదా.. వాళ్ల క్లాసికల్ డ్యాన్స్ ఎన్ పాయింట్ డ్యాన్స్ అనమాట. అంటే మీరు చాలా సినిమాల్లో చూసే ఉంటారు. కొందరు అమ్మాయిలు కాళ్లకు వింత షూస్ వేసుకుని ముని వేళ్ల మీద నిలబడి డ్యాన్స్ చేస్తూ ఉంటారు. దానిని ఎన్ పాయింట్ డ్యాన్స్ అంటారు. ఆ డ్యాన్స్ లో హీరోయిన్ తోపు అనే చెప్పాలి. అంతేకాకుండా.. క్లాసులోనే ఆమె బెస్ట్ డ్యాన్సర్ కూడా. ఆమెను ట్రైన్ చేసే టీచర్ చాలా స్ట్రిక్ట్. ముఖ్యంగా హీరోయిన్ మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఉంటాడు.

మొదట అంతా బెస్ట్ స్టూడెంట్ కాబట్టి.. శ్రద్ధ చూపించి ఉంటాడు అనుకుంటాం. కానీ, ఆ టీచర్ మనసులో వేరే ఉంటుంది. ఆమెను లొంగ*దీసుకోవాలి అని ఆ డ్యాన్స్ టీచర్ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఒకసారి డ్యాన్స్ పేరుతో ఆమెను నేరుగానే వేధింపులకు గురి చేస్తాడు. కానీ, హీరోయిన్ మాత్రం అందుకు అంగీకరించదు. అయితే అప్పటి నుంచి ఆమెకు అసలైన వేధింపులు స్టార్ట్ అవుతాయి. ఆమెకు పోటీ పెరిగిపోతుంది. క్లాస్ లో ఉన్న మరో స్టూడెంట్ ఆమె ప్లేస్ ని భర్తీ చేస్తుంది. మెయిన్ లీడ్ డ్యాన్సర్ గా హీరోయిన్ ఛాన్స్ కోల్పోతుంది. అక్కడి నుంచి ఆమె లైఫ్, రెప్యూటేషన్, హోదా అన్ని పతనం అవుతూ ఉంటాయి.

అలాంటి పరిస్థితుల్లో హీరోయిన్ ఎలా అధిగమించింది? ఆమె తిరిగి తన జీవితంలో ఎలా తిరిగి నిలబడింది? మంచి డ్యాన్సర్ గా తనని తాను నిరూపించుకుందా లేదా? అనేదే మిగిలిన కథ. ఈ చిత్రం పేరు ‘బ్లాక్ స్వాన్’. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీలో మొత్తానికి ఒక మెసేజ్ అయితే ఉంటుంది. పడినా లేచినా.. నీ లైఫ్ కి నువ్వే కింగ్ అని మర్చిపోవద్దు. అలాగే వచ్చిన అడ్డంకులు, కష్టాలను ఎలా అధిగమించాలి అనే పాయింట్ కూడా ఉంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి