iDreamPost

OTT Must Watch Crime Thriller:నివేద పేతురాజ్ నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ని కానీ మిస్ అయ్యారా ! ఏ OTT లో ఉందంటే !

  • Published Jun 25, 2024 | 7:51 PMUpdated Jun 25, 2024 | 7:51 PM

నివేద పేతురాజ్ ప్రస్తుతం ఈ నటి పేరు బాగా వినిపిస్తుంది. తాజాగా ఈ నటి పరువు వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను బాగా మెప్పించింది. అయితే నివేద నటించిన మరొక క్రైమ్ థ్రిల్లర్ ఆల్రెడీ ఓటీటీ లో.. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

నివేద పేతురాజ్ ప్రస్తుతం ఈ నటి పేరు బాగా వినిపిస్తుంది. తాజాగా ఈ నటి పరువు వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను బాగా మెప్పించింది. అయితే నివేద నటించిన మరొక క్రైమ్ థ్రిల్లర్ ఆల్రెడీ ఓటీటీ లో.. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

  • Published Jun 25, 2024 | 7:51 PMUpdated Jun 25, 2024 | 7:51 PM
OTT Must Watch Crime Thriller:నివేద పేతురాజ్ నటించిన ఈ  క్రైమ్ థ్రిల్లర్ ని కానీ మిస్ అయ్యారా ! ఏ OTT లో ఉందంటే !

ఈ మధ్య కాలంలో తెలుగు కథలకు క్రేజ్ బాగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. దీనితో మేకర్స్ కొత్త కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జీ 5 లో వచ్చిన పరువు వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సిరీస్ లో నటించిన నివేద పేతురేజ్ కూడా ఇప్పుడు బాగా ఫేమస్ అవుతుంది. దీనితో ఇప్పుడు ఈ అమ్మడు నటించిన సినిమాల కోసం తెగ సెర్చ్ చేస్తున్నారు ప్రేక్షకులు. ఈ క్రమంలోనే పరువు కంటే ముందు.. నివేద నటించిన ఓ ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఆల్రెడీ ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో.. ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఓ లుక్ వేసేయండి.

ఈ సినిమా పేరు బ్లడీ మేరీ. ఇదొక ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్. ఈ సినిమాకు చందూ మొండేటి దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో.. నివేద పేతురేజ్ తో పాటు.. అజయ్, బ్రహ్మాజీ, కిరీటి దామరాజు, రాజ్ కుమార్ కాశీరెడ్డి లాంటి వారు ప్రధాన పాత్రలలో నటించారు. 2022 లోనే ఈ సినిమా ఆహా ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ అని చెప్పి తీరాలి. కొందరికి అనుకోకుండా కొన్ని శారీరక లోపాలు ఉంటూ ఉంటాయి. అటువంటి వారు ఏదైనా ప్రమాదంలో పడినప్పుడు.. వారిని వారు ఎలా రక్షించుకోవాలి.. అనేది చూపిస్తూనే అక్కడ జరిగిన హత్యలను ఎలా సాల్వ్ చేశారు అనేది కూడా ఈ సినిమాలో.. చక్కగా చూపించారు. కాబట్టి ఈ సినిమాను ఇప్పటివరకు ఎవరైనా మిస్ చేస్తే మాత్రం.. వెంటనే చూసేయండి.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమాలో నివేద పేతురాజ్ ఓ అనాధ. ఆమె మరో ఇద్దరు అనాధలైన భాషా , రాజు లతో కలిసి విశాఖలో నివసిస్తూ ఉంటుంది. ఆమె ఓ హాస్పిటల్ లో నర్స్ గా పని చేస్తుంది. భాషకు మాటలు రావు కానీ యాక్టర్ అవ్వాలనేది మాత్రం అతని కల. రాజుకి వినపడదు కానీ కెమెరామ్యాన్ అవ్వాలనేది అతని లక్ష్యం. సో కెమెరా కొనుక్కోవడానికి నివేద అతనికి డబ్బులు ఇస్తుంది. వారంతా వారి లోపాల గురించి పట్టించుకోకుండా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. ఇంతలో వారి జీవితాలు ఊహించని మలుపులు తిరుగుతాయి. అనుకోకుండా నివేద ఓ డాక్టర్ ను హత్య చేస్తుంది. మరో హత్యకు భాష , రాజు సాక్ష్యులుగా ఉంటారు. ఈ కేసును సాల్వ్ చేయడానికి వచ్చిన మరొక పోలీస్ ఆఫీసర్ కు ఇంకో హత్యకు సంబంధం ఉంటుంది. అసలు ఈ హత్యలు ఎవరు చేశారు ! నివేద గతం ఏంటి ! దీని నుంచి ఆమె బయటపడిందా లేదా ! వారంతా వారు అనుకున్న లక్ష్యాలు ఛేదించారా లేదా ! చివరకు ఈ కథ ఎలా ముగిసింది ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి