iDreamPost

అఫీషియల్: OTTలోకి వచ్చేస్తున్న నవదీప్ బో*ల్డ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Navadeep Love Mouli Movie OTT Streaming Date Fix: హీరో నవదీప్ నటించిన రీసెంట్ మూవీ లవ్ మౌళి ఓటీటీలోకి రాబోతోంది. ఓటీటీ పార్ట్ నర్.. డేట్ ని కూడా లాక్ చేశారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది.

Navadeep Love Mouli Movie OTT Streaming Date Fix: హీరో నవదీప్ నటించిన రీసెంట్ మూవీ లవ్ మౌళి ఓటీటీలోకి రాబోతోంది. ఓటీటీ పార్ట్ నర్.. డేట్ ని కూడా లాక్ చేశారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది.

అఫీషియల్: OTTలోకి వచ్చేస్తున్న నవదీప్ బో*ల్డ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

హీరో నవదీప్ కు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఎంతో విభిన్నమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. హీరోగా, సపోర్టింగ్ ఆర్టిస్టు, హీరో ఫ్రెండ్ గా ఒకటేంటి అన్ని రకాల పాత్రలు పోషించాడు. అలాంటి నవదీప్ చాలా గ్యాప్ తర్వాత మళ్లీ హీరోగా వచ్చాడు. అది కూడా లవ్ మౌళి అనే ఒక విభిన్నమైన కథతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. మరి.. ఆ మూవీ ఎప్పుడు? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వబోతోందో చూద్దాం.

నవదీప్ మూవీ లవ్ మౌళి సినిమాపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎందుకంటే ఈ మూవీ చాలా బో*ల్డ్ గా ఉంది. ఆ మూవీ ట్రైలర్ చూసిన తర్వాత ఆ విషయం అందరికీ అర్థమైపోయింది. ఈ మూవీ రిలీజు కూడా వాయిదా పడుతూ వచ్చింది. ఎలాగైతేనే థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు ఓటీటీలోకి కూడా అడుగు పెట్టబోతోంది. ఈ మూవీలో హీరో పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. మనుషులతో నాకు సంబంధం లేదు అంటూ బతికే ఒక ఆర్టిస్ట్ అతను. కళ్లతో చూసిన ఏ అందాన్ని అయినా ఇట్టే కాన్వాస్ మీద ప్రింట్ చేయగలడు. కానీ, అతనికి మనుషులు, బంధాలు, బంబంధాలు, ప్రేమలు అంటే అస్సలు పడదు.

అసలు మనుషులంటేనే పడదు అనుకునే వ్యక్తి జీవితంలోకి ప్రేమ వస్తే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా కథ. కాకపోతే కాస్త బో*ల్డ్ గా.. చాలా స్ట్రైట్ అవేగా ఉంటుంది. చిన్నప్పుడు తల్లిదండ్రులు విడిపోవడంతో మౌళి ఒంటరిగానే పెరుగుతాడు. మేఘాలయాలోని ఓ రిసార్ట్ లో తన జీవితాన్ని తనకు నచ్చినట్లుగా బతుకుతూ ఉంటాడు. అతను ఎంతో అద్భుతమైన పెయింగ్స్ వేస్తాడు. వాటి ద్వారా వచ్చిన డబ్బుతోనే జీవిస్తూ ఉంటాడు. అతనికి ఒక అఘోరా పెయింటింగ్ బ్రష్ ఇస్తాడు. ఆ బ్రష్ తనకు ఇష్టమైన అమ్మాయిని గీస్తే ఆమె ప్రత్యక్షమవుతుంది. కొన్నాళ్లు వాళ్ల మధ్య రిలేషన్ బాగానే ఉంటుంది. కానీ, తర్వాత గొడవలు వస్తాయి. ఆ తర్వాత మళ్లీ మరో అమ్మాయిని గీస్తాడు. అప్పుడు కూడా మొదట వచ్చిన అమ్మాయే వస్తుంది. మరి.. మౌళి సర్దుకుపోయాడా? వారి మధ్య గొడవుల సమసిపోయాయా? అనేదే కథ. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో జూన్ 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఆహా ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి