iDreamPost

హైవే ప్రాంతంలో తగ్గిన ల్యాండ్ రేట్లు.. ఇప్పుడు కొంటే లక్షల్లో లాభం!

Land Prices Reduced: భూముల ధరలు తగ్గడం అనేది ఉండదు. కానీ కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితుల కారణంగా కొద్దిగా తగ్గుతాయి. ఈ క్రమంలోనే ఈ హైవే మీద ఉన్న భూముల ధరలు తగ్గాయి. ఇప్పుడు కనుక ఇన్వెస్ట్ చేస్తే కనుక లక్షల్లో లాభం పొందవచ్చు.

Land Prices Reduced: భూముల ధరలు తగ్గడం అనేది ఉండదు. కానీ కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితుల కారణంగా కొద్దిగా తగ్గుతాయి. ఈ క్రమంలోనే ఈ హైవే మీద ఉన్న భూముల ధరలు తగ్గాయి. ఇప్పుడు కనుక ఇన్వెస్ట్ చేస్తే కనుక లక్షల్లో లాభం పొందవచ్చు.

హైవే ప్రాంతంలో తగ్గిన ల్యాండ్ రేట్లు.. ఇప్పుడు  కొంటే లక్షల్లో లాభం!

భూమి మీద పెట్టుబడి పెట్టడం అనేది రిస్క్ లేని వ్యాపారం అని తెలిసిందే. ఒకసారి పెట్టుబడి పెట్టిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేదు. అయితే కొన్ని ఒడిదుడుకుల కారణంగా రియల్ ఎస్టేట్ డల్ అవుతుంది. రియల్ ఎస్టేట్ పై ప్రతికూల ప్రభావం పడినప్పుడు ల్యాండ్ రేట్లు అనేవి కొంచెం తగ్గుతాయి. ఈ కొంచెం డిఫరెన్స్ లోనే లక్ష, 2 లక్షలు నుంచి 5, 10 లక్షల వరకూ డబ్బులు ఆదా చేసుకోవచ్చు. ప్రస్తుతం తెలంగాణలో రియల్ ఎస్టేట్ నెమ్మదించిందని నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగా ధరలు కూడా తగ్గాయి. అయితే తగ్గిన ధరలు ఇలానే ఉండిపోతాయా అంటే ఉండవని.. రియల్ ఎస్టేట్ మళ్ళీ పుంజుకుని అమాంతం రేట్లు పెరిగిపోతాయని చెబుతున్నారు.

కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే కనుక కనీసం 2 లక్షల నుంచి 5 లక్షల వరకూ డబ్బు ఆదా అవుతుందని.. రేట్లు పెరిగిన తర్వాత లాభాలు అవుతాయని అంటున్నారు. బెంగళూరు హైవే పెట్టుబడికి అత్యుత్తమైన ప్రాంతం అని నిపుణులు సూచిస్తున్నారు. బెంగళూరు హైవే మీద స్థలాల మీద పెట్టుబడి పెడితే మంచి లాభాలను చూడవచ్చునని అంటున్నారు. ప్రస్తుతం బెంగళూరు హైవే మీద స్థలాల రేట్లు గతంతో పోలిస్తే ఇప్పుడు కొంచెం తగ్గాయి. జనవరి నుంచి మార్చి నెలల్లో చూసుకుంటే బెంగళూరు హైవే మీద చదరపు అడుగు స్థలం రూ. 1600గా ఉండేది. ఇప్పుడది 1500 రూపాయలు పలుకుతుంది. చదరపు అడుగు మీద 100 రూపాయలు తగ్గింది. అంటే గజం రూ. 900 తగ్గినట్టు. ప్రస్తుతం గజం స్థలం రూ. 13,500 పడుతుంది.

ఉదాహరణకు మీరు 150 గజాల స్థలం తీసుకున్నట్లైతే 1,35,000 ఆదా అవుతుంది. అదే 250 గజాల స్థలం కొన్నట్లైతే రూ. 2,25,000 మిగులుతాయి. అదే 300 గజాల స్థలం కొన్నట్లైతే కనుక 2,70,000 మిగిలినట్టే. ఈ డబ్బుతో మీకు అదనంగా ఇంకో 10 గజాల నుంచి 20 గజాల స్థలం వస్తుంది. 10, 20 గజాల స్థలం అంటే తక్కువేం కాదు. ఇప్పుడు చదరపు అడుగు 1500గా ఉంది. రానున్న రోజుల్లో 5 వేలు అయినా గానీ అప్పుడు 20 గజాల స్థలం విలువ దాదాపు 10 లక్షలు అవుతుంది. ఓవరాల్ గా 300 గజాల స్థలం విలువ కోటి 35 లక్షలు అవుతుంది.

ఒకప్పుడు చదరపు అడుగు 1500 రూపాయలు ఉన్న ఏరియాల్లో ఇప్పుడు 5 వేలు, 10 వేలు పలుకుతున్న విషయం తెలిసిందే. అలానే ఈ బెంగళూరు హైవే మీద ఉన్న స్థలాల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుండడం.. సమీపంలో రీజనల్ రింగ్ రోడ్ వస్తుండడం, పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టడం వంటివి రియల్ ఎస్టేట్ బూమ్ కి కారణాలు కానున్నాయి. కాబట్టి ఈ హైవే ప్రాంతంలో స్థలాల మీద ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే కనుక లక్షల్లో లాభం పొందవచ్చు. లక్షలు ఆదా చేసుకోవచ్చు.  

గమనిక: అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ధరల్లో మార్పులు ఉండవచ్చు. గమనించగలరు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి