iDreamPost

2 నెలల తర్వాత OTTలోకి సూపర్ హిట్ కామెడీ మూవీ.. ఎప్పుడంటే?

  • Published Jun 05, 2024 | 11:29 AMUpdated Jun 05, 2024 | 11:29 AM

కోలీవుడ్ స్టార్ కమెడియన్ యోగి బాబు ఇటీవలే నటించిన మూవీ బూమర్ అంకుల్. కాగా, ఈ మూవీ రెండు నెలల క్రితం థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ లోని రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇంతకి ఎప్పుడంటే..?

కోలీవుడ్ స్టార్ కమెడియన్ యోగి బాబు ఇటీవలే నటించిన మూవీ బూమర్ అంకుల్. కాగా, ఈ మూవీ రెండు నెలల క్రితం థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ లోని రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇంతకి ఎప్పుడంటే..?

  • Published Jun 05, 2024 | 11:29 AMUpdated Jun 05, 2024 | 11:29 AM
2 నెలల తర్వాత OTTలోకి సూపర్ హిట్ కామెడీ మూవీ.. ఎప్పుడంటే?

సినీ ఇండస్ట్రీలో కమెడియన్లు హీరోలుగా వెండితెరకు పరిచయమవ్వడం కొత్తేమీ కాదు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీ ఏదైనా కమెడియన్లు మాత్రం తమని తాము నిరూపించుకోవడం కోసం హీరోలుగా ఎంట్రీ ఇస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీలో చాలామంది కమెడియన్లు హీరోలుగా పరిచయమవ్వగా.. వారిలో కోలీవుడ్ స్టార్ కమెడియన్ ‘యోగి బాబు’ కూడా ఒకరు. ఈయన ఇటీవలే హీరోగా తమిళంలో బూమర్ అంకుల్ అనే సినిమాలో నటించాడు. కాగా, ఈ సినిమాను స్వదీస ఎమ్మెస్ దర్శకత్వం వహించారు. ఇక ఈ చిత్రం మార్చి 29న థియటర్లలో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ‘బూమర్ అంకుల్’ సినిమా రిలీజ్ అయ్యి రెండు నెలలు కావొస్తున్న ఇంతవరకు ఓటీటీలోకి రాలేదు. కానీ, త్వరలోనే ఈ మూవీ ఓటీటీలో సందడి చేయనుందని అధికారికంగా ప్రకటించారు. ఇంతకి ఎప్పుడంటే..?

కోలీవుడ్ స్టార్ కమెడియన్ యోగి బాబు ఇటీవలే లీడ్ రోల్లో నటించిన మూవీ ‘బూమర్ అంకుల్’. ఈ సినిమాను స్వదీస్ ఎమ్మెస్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా మార్చి 29న థియేటర్లలో రిలీజై సందడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయ్యి రెండు నెలలు క కావొస్తున్న ఇంతవరకు ఓటీటీ స్ట్రీమింగ్ కు రాలేదు. కానీ, తాజాగా ఈ మూవీ త్వరలోనే ఓటీటీలో సందడి చేయడానికి రెడీగా ఉందని అధికారికంగా ప్రకటించారు. కాగా, బూమర్ అంకుల్ మూవీని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సంస్థ ఆహా హక్కులను కొనుగోలు చేసుకుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ఈ శుక్రవారం అనగా జూన్ 7 నుంచి ఆహా తమిళ్ ఓటీటీలో స్ట్రీమింగ్ వస్తోంది. ఇక ఈ విషయాన్ని ఆహానే స్వయంగా తన సోషల్ మీడియాలో అనౌన్స్ చేసింది. పైగా తోజర్‌గాలే (కామ్రేడ్స్) అసెంబుల్.. బూమర్ అంకుల్ ఆహా తమిళ్ లో జూన్ 7 నుంచి” అనే క్యాప్షన్ కూడా పెట్టింది. అయితే ఈ సినిమా తమిళంలో మాత్రమే అందుబాటులోకి రానుంది.ఇక ఈ సినిమాలో యోగిబాబుతో పాటు ఒవియా, సతీష్ మోషన్, రోబో శంకర్ లాంటి వాళ్లు నటించారు.

ఇక బూమర్ అంకుల్ సినిమా కథ విషయానికొస్తే.. బూమర్ అంకుల్ మూవీ కామెడీతోపాటు మంచి థ్రిల్ పంచుతుంది. ఇక ఈ సినిమా మొత్తం నేసమ్ (యోగి బాబు), అతని విదేశీ భార్య అమీ చుట్టూ తిరుగుతుంది. ఎందుకంటే.. నేసమ్  అతని భార్యతో విడాకుల ఒప్పందాన్ని ఫైనలైజ్ చేయడం కోసం అతడు తన పూర్వీకులు వదిలి వెళ్లిన ఇంటికి వెళ్తాడు. అయితే అతనితోపాటు అక్కడి వెళ్లిన అమీ మాత్రం మరో మిషన్ పై ఉంటుంది. ఇక నేసమ్ తండ్రి చేసిన శాస్త్రీయ ప్రయోగాల గుట్టు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఆమె అక్కడికి వెళ్తుంది. వీళ్లతోపాటు ఒకప్పుడు అక్కడ పని చేసిన వాళ్లు కూడా మరో ఎజెండాతో అక్కడికి వెళ్తారు. ఇలా ఆ ఇంట్లోకి వెళ్లే వాళ్లకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయన్నదే ఈ సినిమా స్టోరీ. మరి, ఈ విషయాలని తెలుసుకోవాలంటే వెంటనే బూమర్ అంకుల్ మూవీ ఓటీటీలో చూసేయాల్సిందే. మరి, త్వరలోనే ఓటీటీలోకి రాబోతున్న బూమర్ అంకుల్ మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి