iDreamPost

చుట్టూ కష్టాలే.. కానీ పడి పడి నవ్వుతారు.. OTTలో బెస్ట్ కామెడీ థ్రిల్లర్!

OTT Suggestions- Best Comedy Drama Kuiko: యోగిబాబు అంటే ఇష్టపడని సినిమా ప్రేక్షకులు ఉండరు. అలాంటి యోగిబాబు ఒక అదిరిపోయే కామెడీ డ్రామా తీశాడు. ఆ మూవీ చూస్తే మీరు పడి పడి నవ్వుకుంటారు.

OTT Suggestions- Best Comedy Drama Kuiko: యోగిబాబు అంటే ఇష్టపడని సినిమా ప్రేక్షకులు ఉండరు. అలాంటి యోగిబాబు ఒక అదిరిపోయే కామెడీ డ్రామా తీశాడు. ఆ మూవీ చూస్తే మీరు పడి పడి నవ్వుకుంటారు.

చుట్టూ కష్టాలే.. కానీ పడి పడి నవ్వుతారు.. OTTలో బెస్ట్ కామెడీ థ్రిల్లర్!

ఓటీటీలో ఎప్పుడూ హారర్, యాక్షన్ థ్రిల్లర్స్, డ్రామాలు చూసి బోర్ కొట్టిందా? అయితే మీకోసం ఒక మంచి కామెడీ చిత్రాన్ని తీసుకొచ్చాం. ఈ మూవీ చూసిన తర్వాత మీరు కనీసం ఒక రెండ్రోజులు గుర్తు చేసుకుని నవ్వుకుంటారు. ఈ మూవీకి ఆ రేంజ్ కెపాసిటీ ఉంది. నిజానికి ఓటీటీలోకి వచ్చి ఏడాది కావొస్తోంది. కానీ, చాలా మంది ఈ చిత్రాన్ని లైట్ తీసుకున్నారు. ఒక మంచి కామెడీ ఎంటర్ టైనర్ చూడాలి అనుకుంటే మాత్రం ఇది బెస్ట్ ఛాయిస్ అవుతుంది. ఈ సినిమాలో ఒక మంచి కథ ఉంది. అలాగే ఆ కథలో మంచి కాన్ ఫ్లిక్ట్ ఉంది. అయితే పాత్రలు ఇబ్బంది పడుతుంటే.. మనం మాత్రం తెగ నవ్వేసుకుంటాం. అయితే అది రాక్షసానందం అని మిమ్మల్ని మీరు కించ పరుచుకోకండి. నవ్వడం తప్పేం కాదు.

ఈ సినిమా గురించి ఇంత హైప్ ఇవ్వడానికి కారణం.. ఇందులో ఉండే కథే. ఈ మూవీలో అద్భుతమైన కథ ఉంది. ఆ కథలో ప్రధాన పాత్రగా ప్రముఖ కమెడియన్ యోగి బాబు ఉన్నాడు. ఈ సినిమాలో యోగి బాబు చుట్టూనే కథ మొత్తం తిరుగుతూ ఉంటుంది. యోగి బాబు ఊర్లో గేదెలు కాచుకుంటూ ఉండేవాడు. అయితే దుబాయ్ లో వెళ్లిపోయి అక్కడ ఒక షేక్ దగ్గర ఒంటెలు కాసే పనిలో చేరతాడు. బాగా సంపాదిస్తాడు. ఊర్లో ఉన్న తన ఒకే ఒక తల్లికి డబ్బు పంపుతూ ఉన్నాడు. కానీ, అతను ఎంత డబ్బు పంపినా అది తల్లికి అందదు. ఆమె దీనస్థితిలోనే ప్రాణాలు కోల్పోతుంది.

Kuiko

తల్లి మరణవార్త తెలుసుకున్న యోగిబాబు దుబాయ్ నుంచి బయల్దేరుతాడు. అప్పటి వరకు తన తల్లి మృతదేహాన్ని ఫ్రీజర్ లో పెట్టి జాగ్రత్తగా చూసుకోవాలి అని కోరతాడు. అయితే అక్కడున్న ప్రజలకు ఆ ఫ్రీజర్ ని వాడటం తెలియదు. అందుకే ఆ ఫ్రీజర్ డెలివరీ ఇవ్వడానికి వచ్చిన టీచర్ ని ఆ ఊరి వాళ్లు ఎక్కడికీ వెళ్లకుండా ఆపేస్తారు. తాను వెళ్లిపోతే ఆ మహిళ శవాన్ని కాల్చేస్తామంటూ బెదిరిస్తారు. ఆ కొడుకు రానే వస్తాడు. తన తల్లికి సైనిక వందనం చేయిస్తానని కొందరిని పిలిపిస్తాడు. కానీ, వాళ్లు పిట్టలు కొట్టే వాళ్లు అని తెలిసిద్ది. అన్నీ ఏర్పాటు చేసి వెళ్లి చూస్తే తల్లి శవం ఉన్న ఫ్రీజర్ మాయం అవుతుంది. అక్కడి నుంచి కథ మొత్తం సస్పెన్స్ థ్రిల్లర్ గా మారిపోతుంది.

అంతేకాకుండా.. తన తల్లి మృతదేహం కోసం యోగిబాబు వెతుకుతూ ఉంటాడు. పోలీసులకు ఫిర్యాదు కూడా చేస్తాడు. అయితే అసలు ఇలాంటి ఒక పాయింట్ మీద కథ రాయొచ్చా? అనే హద్దు పెట్టుకోకుండా కథను రాసిన తీరు.. తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మొత్తానికి ఈ సినిమాతో యోగి బాబు మిమ్మల్ని కడుపుబ్బా నవ్విస్తాడు. ఈ సినిమా పేరు ‘కుయికో‘. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి