iDreamPost
android-app
ios-app

OTTలోకి వెట్రిమార‌న్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

  • Published Jun 24, 2024 | 5:36 PM Updated Updated Jun 24, 2024 | 5:36 PM

కోలీవుడ్ హీరో ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ గరుడన్. అయితే ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లోని త్వరలో స్ట్రీమింగ్ సిద్ధంగా ఉంది. ఇంతకి ఎప్పుడంటే..

కోలీవుడ్ హీరో ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ గరుడన్. అయితే ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లోని త్వరలో స్ట్రీమింగ్ సిద్ధంగా ఉంది. ఇంతకి ఎప్పుడంటే..

  • Published Jun 24, 2024 | 5:36 PMUpdated Jun 24, 2024 | 5:36 PM
OTTలోకి వెట్రిమార‌న్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఈ మధ్య కోలీవుడ్ లో కూడా చిన్న సినిమాలుగా తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటున్న సినిమాలు చాలానే ఉన్నాయి. అలాంటి సినిమాల్లో ‘గరుడన్’ కూడా ఒకటి. ఇక ఈ సినిమాలో భాగమతి మూవీ ఫేమ్ ఉన్ని ముకుందన్ హీరోగా నటించాడు. ఇక యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు అగ్ర ద‌ర్శ‌కుడు వెట్రిమార‌న్ క‌థ‌ను అందించాగా.. ఆర్ ఎస్ దురై సెంథిల్‌కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.అలాగే ఇందులో తమిళంలో పాపులర్ కమెడియన్స్ అయినా.. సూరి, శశికుమార్ లు కూడా నటించారు. అలాగే ఇందులో రోషిని హ‌రిప్రియ‌న్‌, శివ‌ద హీరోయిన్లుగా న‌టించారు. ఇకపోతే ఈ సినిమాలో సముద్రఖని కీలక పాత్ర పోషించాడు.అయితే ఈ సినిమా గతనెల మే 31వ తేదీన థియేటర్లలో రిలీజై పెద్ద హిట్ గా నిలిచింది. ఇకపోతే ఈ సినిమాకు దాదాపు 20 కోట్ల బడ్జెట్ తో రూపొందించగా.. సుమారు యాభై కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ క్రమంలోనే ఈ మూవీ గత కొన్ని రోజులుగా ఓటీటీలోకి వస్తుందనే వార్త వినిపిస్తున్న విషయం తెలిసిందే. కానీ, ఇంతవరకు ఏ ఫ్లాట్ ఫామ్ లోకి వస్తుందనే క్లారిటీ మాత్రం లేదు.అయితే తాజాగా ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లోకి స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానుంది. ఇంతకి ఎప్పుడంటే..

కోలీవుడ్ హీరో ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘గరుడన్’. కాగా, ఈ మూవీ గత నెల మే 3 1వ తేదీని థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా.. ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ కూడా అందుకున్నాయి.అయితే ఎంతగానో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ మూవీ గత కొన్ని రోజులుగా ఓటీటీలో అలరించనుందనే టాక్ వినిపిస్తోంది. కానీ, దీనిపై ఇంక అధికారికంగా ప్రకటన రాలేదు. ఈ క్రమంలోనే తాజాగా గుడన్ మూవీని ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్ హక్కులకు దక్కించుకున్నట్లు సమాచారం అందింది.

garudan

అంతేకాకుండా.. ఈ మూవీ ఈనెల జూన్ 28 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు టాక్ జోరుగా వినిపిస్తోంది. అయితే థియేటర్లలో రిలీజ్ అయిన నెల రోజులకే ఈ మూవీని ఓటీటీలో తమిళ్ తో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ వంటి భాషల్లో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. మరి, గరుడన్ మూవీ అమెజన్ లో స్ట్రీమింగ్ పై ఇంక అధికారిక ప్రకటన వచ్చేంత వరకు ఎదురు చూడాల్సిందే.ఇక గరుడన్ సినిమాకు వెట్రిమార‌న్ నిర్మతలో ఒకరిగా వ్యవహరించారు.అలాగే ఈ సినిమాకు శంకర్ రాజా సంగీతాన్ని అందించారు.

ఇక గరుడన్ సినిమా కథ విషయానికొస్తే.. చెన్నై సిటీలో మ‌ధ్య‌లో ఉన్న కోట్ల విలువైన భూమిని త‌న సొంతం చేసుకోవ‌డానికి మినిస్ట‌ర్‌ ప్ర‌య‌త్నిస్తాడు. ఈ క్రమంలోనే.. సొక్క (సూరి), క‌రుణ (ఉన్ని ముకుంద‌న్‌), ఆది (శ‌శికుమార్‌) అనే ముగ్గురు స్నేహితులు ఆ మినిస్ట‌ర్‌ను ఎలా ఎదురించారు?ఈ పోరాటంలో ముగ్గురు స్నేహితులు ఎందుకు శ‌త్రువులుగా మారారు? ఊరి గుడిలో ఎన్నో ఏళ్లుగా భ‌ద్రంగా దాచిన ఓ పెట్టెలో ఏముంది? ఆ బాక్స్‌ను ద‌క్కించుకునేందుకు మినిస్ట‌ర్ ఎలాంటి ప్ర‌య‌త్నాలు చేశాడు? మినిస్ట‌ర్‌పై చేసిన పోరాటంలో ముగ్గురు ఎలాంటి క‌ష్టాలు ప‌డ్డారు అన్న‌దే ఈ మూవీ క‌థ‌. ఇక ఈ విషయాలన్నింటికి సమాధానం తెలియాలంటే వెంటనే గరుడన్ మూవీ ఓటీటీలో చూసేయాల్సిందే. మరి, అమెజాన్ ప్రైమ్ లో త్వరలోనే గరుడన్ మూవీ స్ట్రీమింగ్ అవుతుందనే టాక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap