iDreamPost

రూ.100 కోట్లు కలెక్షన్స్ వచ్చిన హారర్ కామెడీ మూవీ OTTలోకి.. ఎప్పుడంటే?

  • Published Jun 25, 2024 | 11:28 AMUpdated Jun 25, 2024 | 11:28 AM

Munjya Movie: కేవలం అతి చిన్న సినిమాగా థియేటర్లలో రిలీజ్ అయ్యి 17 రోజుల్లో రూ.100 కోట్లు కలెక్షన్స్ సాధించిన లేటెస్ట్ హారర్ కామెడీ మూవీ మంజ్యా. అయితే ఇప్పుడు ఈ మూవీ ప్రముఖ ఓటీటీలోకి రానుంది. ఇంతకి ఎప్పుడంటే..?

Munjya Movie: కేవలం అతి చిన్న సినిమాగా థియేటర్లలో రిలీజ్ అయ్యి 17 రోజుల్లో రూ.100 కోట్లు కలెక్షన్స్ సాధించిన లేటెస్ట్ హారర్ కామెడీ మూవీ మంజ్యా. అయితే ఇప్పుడు ఈ మూవీ ప్రముఖ ఓటీటీలోకి రానుంది. ఇంతకి ఎప్పుడంటే..?

  • Published Jun 25, 2024 | 11:28 AMUpdated Jun 25, 2024 | 11:28 AM
రూ.100 కోట్లు కలెక్షన్స్ వచ్చిన హారర్ కామెడీ మూవీ OTTలోకి.. ఎప్పుడంటే?

ప్రస్తుతం హారర్ జోన్ కు సంబంధించిన సినిమాలపై ప్రేక్షకులు ఎంతటి ఆదరణ చూపిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ సినిమాలకు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ ఎంతో ఆసక్తిగా చూపుతారు. ఒక రకంగా భయపడుతునే ఎంటర్టైన్మెంట్ పొందుతుంటారు. ఇక ప్రేక్షకుల అభిరుచుల మేరకు ఈ మధ్యకాలంలో థియేటర్లలోకి, ఓటీటీలోకి ఎన్నో రకాల హారర్ సినిమాలు అలరించాయి.అయితే వీటిలో కేవలం చిన్న సినిమా తెరకెక్కి ప్రేక్షకులకు కావలసినంత కామెడీతో పాటు భయపెట్టి బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా పెద్ద సినిమాలను కాస్త వెనక్కి నెట్టి బాక్సాపీస్ వద్ద రికార్డులు సృష్టించిన హారర్ సినిమా ‘మంజ్యా’. కాగా, ఈ సినిమాను దర్శకుడు ఆదిత్య సర్పోదర్ తెరకెక్కించారు.

ఇకపోతే ఈ సినిమాలో శర్వరి వాఘ్, అభయ్ వర్మ, మోనా సింగ్, సత్యరాజ్ నటించారు.అయితే ఈ మూవీ ఈ నెల అనగా జూన్ 7వ తేదీన థియేటర్ల విడుదలై కేవలం 17 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్ లో చేరింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీ ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానున్నది. ఇంతకి ఎప్పుడంటే..? హారర్ కామెడీ జానర్ లో వచ్చిన ‘ముంజ్యా’ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికే భారీ కలెక్షన్స్ తో రికార్డులు సృష్టిస్తుంది. కేవలం చిన్న సినిమాగా తెరకెక్కిన మంజ్యా కార్తీక్ ఆర్యన్ లాంటి హీరో నటించిన చందూ ఛాంపియన్ ను కూడా వెనక్కి నెట్టి 17 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్ లో చేరింది. ఇక ఆ విషయాన్ని మాడక్ ఫిల్మ్స్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ లో అధికారికంగా వెల్లడించింది. ‘అలాగే ముంజ్యా సినిమా అందర్నీ నవ్విస్తూ, భయపెడుతూ రూ.100 కోట్లు సంపాదించేసింది.  ఏదైనా మీరు లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదు అని అభిమానులకు థ్యాంక్స్’ చెబుతూ ఈ పోస్ట్ చేసింది.

అయితే ఈ ప్రొడక్షన్ హౌజ్ అధికారికంగా షేర్ చేసిన వివరాల ప్రకారం.. ముంజ్యా సినిమా రూ.103 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది.ఇక నెట్ కలెక్షన్స్ చూస్తే.. తొలి వారమే రూ.36.5 కోట్లతో సంచలనం రేపింది.  ఇక ఇదే జోరు కొనసాగిస్తూ.. రెండో వారం కూడా మరో రూ.32 కోట్లు వసూలు చేసింది. అలాగే మూడో వారము కూడా మంజ్యూనే అత్యధిక వసూళ్లు రాబడుతుంది. ఇదిలా ఉంటే.. ఈ మూవీ ఓటీటీలోకి వస్తుందనే టాక్ జోరుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీని ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ హక్కులను సొంతం చేసుకుంది. అయితే ముంజ్యా మూవీని ఓటీటీలో చూద్దామని వేచి చూసే ప్రేక్షకులు కాస్త ఓపిక పట్టాల్సిందే. ఎందుకంటే ఒప్పందం ప్రకారం రెండు నెలల తర్వాతగానీ ఈ మూవీ ఓటీటీలోకి వచ్చే అవకాశం లేదు.

అయితే ఆగస్టులో కూడా ఈ మూవీ ఓటీటీలోకి అడుగుపెట్టే సూచనలు కనిపించడం లేదు. పైగా బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికీ బాగానే రాబడుతోంది. ఒకవేళ థియేటర్లలో కాస్త జోరు తగ్గితే.. జులైలోనే ఓటీటీలోకి వచ్చినా ఆశ్చర్యం లేదు. అయితే ఈలోపు ఈ ముంజ్యా మూవీ డైరెక్టరే తీసిన కాకుడా (Kakuda) అనే మరో హారర్ మూవీ జీ5 ఓటీటీలోకి నేరుగా వస్తోంది. జులై 12 నుంచి స్ట్రీమింగ్ కానున్న ఆ సినిమాను చూసేయండి. ఇక మంజ్యూ మూవీ కథ విషయానికొస్తే.. మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతంలో జరిగిన స్టోరీగా దీనిని తెరకెక్కించారు. ముంజ్యా అనే ఓ వింత జీవి, అది బిట్టూ (అభయ్ వర్మ) జీవితంపై చూపించే ప్రభావం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. మరి, మంజ్యూ సినిమాను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ హక్కులను సొంతం చేసుకోవడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి