iDreamPost
android-app
ios-app

Vijay Sethupati: OTTలోకి వచ్చేసిన విజయ్ సేతుపతి మూవీ! వెంటనే చూసేయండి!

  • Published Jun 24, 2024 | 11:20 AMUpdated Jun 24, 2024 | 11:20 AM

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి రెమ్యున‌రేష‌న్ తీసుకోకుండా ఫ్రీగా గెస్ట్ రోల్ లోని ఓ తమిళ సినిమాలో అలరించారు. అయితే తాజాగా ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకి ఆ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి రెమ్యున‌రేష‌న్ తీసుకోకుండా ఫ్రీగా గెస్ట్ రోల్ లోని ఓ తమిళ సినిమాలో అలరించారు. అయితే తాజాగా ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకి ఆ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Published Jun 24, 2024 | 11:20 AMUpdated Jun 24, 2024 | 11:20 AM
Vijay Sethupati: OTTలోకి వచ్చేసిన విజయ్ సేతుపతి మూవీ! వెంటనే చూసేయండి!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఇటీవలే ‘మహారాజ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కాగా, ఈ సినిమా ఈనెల జూన్ 14వ తేదీన థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇకపోతే ఈ సినిమానకు నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహించారు.కాగా, ఇందులో మమతా మోహన్ దాస్, అనురాగ్ కశ్యపఫ్, అభిరామి కీలక పాత్రలు పోషించారు. అయితే యాక్షన్ డ్రామా కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన తొలిరోజు నుంచే మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోవడమే కాకుండా.. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అలాగే మరోవైపు తెలుగులో కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా దాదాపు వంద కోట్ల క్లబ్ కు చేరువైంది. దీంతో ఈ మూవీ పెట్టుబడికి పదింతల లాభాలను తెచ్చిపెట్టడమే కాకుండా.. ఈ ఏడాది కోలీవుడ్ లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాలో మహారాజ మూవీ కూడా ఒకటిగా నిలిచింది. ఇదిలా ఉంటే..గతంలో విజయ్ సేతుపతి గెస్ట్ రోల్ లోని ఓ తమిళ సినిమాలో అలరించారు. అయితే తాజాగా ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకి ఆ సినిమా ఏదంటే..

విజయ్ సేతుపతి గతంలో ‘అళ‌గీయ క‌న్నే’ అనే తమిళ్ సినిమాలో అతిథి పాత్రలో నటించారు. కాగా, ఈ మూవీ గతేడాది 2023 జూన్ 23న థియేటర్లలో విడుదలైంది. కాగా, ఈ సినిమాను ఆర్. విజయకుమార్ దర్శకత్వం వహించారు.ఇకపోతే ఈ సినిమాలో లియో శివకుమార్, సంచితా శెట్టి హీరో హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యి ఏడాది తర్వాత ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతుంది. కాగా, ఈ మూవీని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ హక్కులను దక్కించుకుంది. ఈ క్రమంలోనే అళగీయ మూవీ ఏడాది తర్వాగ సడెన్ గా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.అయితే ఈ సినిమాకు విజయ్ సేతుపతి దర్శకుడు మీద అభిమానంతో ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషణ్ తీసుకోలేదట. పైగా ఈ సినిమాలో విజ‌య్ సేతుప‌తి క్యారెక్ట‌ర్‌ను హైలైట్ చేస్తూ మేక‌ర్స్ ప్ర‌మోష‌న్స్ చేయ‌డంతో.. ఈ చిన్న సినిమాపై కోలీవుడ్ లోని ప్రేక్ష‌కుల్లో  ఆస‌క్తి ఏర్ప‌డింది. కానీ, రొటీన్ స్టోరీలైన్ కార‌ణంగా అళ‌గీయ క‌న్నే క‌మ‌ర్షియ‌ల్ ఫెయిల్యూర్‌గా నిలిచింది.

ఇక అళ‌గీయ క‌న్నే సినిమా కథ విషయానికొస్తే.. హీరో ఇన్బా (లియో శివ‌కుమార్‌) సినిమా డైరెక్ట‌ర్ కావాల‌నే ప్ర‌య‌త్నాల్లో ఉంటాడు. కానీ అవకాశాల కోసం ఎదురుచూస్తూ ఖాళీ సమయంలో నాట‌కాల‌కు స్క్రిప్ట్‌లు రాస్తుంటాడు. ఇక ఈ నాటకాలకు స్క్రిప్ట్ లు రాస్తుంటాడు. అలా ఆ నాటకాల ద్వారా హీరోయిన్ కస్తూరితో (సంచితాశెట్టి)తో ఇన్బాకు ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. అలా ఒకరిని ఒకరు ప్రేమించుకుంటారు. కానీ, వారి కులాలు వేరు కావ‌డంతో వారి పెళ్లికి పెద్ద‌లు ఒప్పుకోరు. దాంతో చెన్నై పారిపోయిన ఇన్భా, క‌స్తూరి అక్కడ పెళ్లిచేసుకుంటారు. ఇక హ్యాపీగా సాగిపోతున్న వారి కాపురంలో అనుకోకుండా క‌ల‌త‌లు వ‌స్తాయి. అవేమిటి? హీరో విజ‌య్ సేతుప‌తితో సినిమా చేసే అవ‌కాశం ఇన్బాకు ఎలా వ‌చ్చింది అన్న‌దే అళ‌గీయ క‌న్నే మూవీ క‌థ‌. అయితే ఈ విషయాలన్ని తెలుసుకోవాలంటే వెంటనే ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ లో చూసేయండి. మరి, విజయ్ సేతుపతి గెస్ట్ గా నటించిన ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండటం పై మీ అభిప్రాాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి