iDreamPost

రైతు పొలంలో వెంకటేశ్వర స్వామి విగ్రహం.. చూసేందుకు భారీగా జనం!

Venkateswara Swamy Idol: ప్రస్తుతం వ్యవసాయ చేసేందుకు రైతులు పొలాలను చదును చూస్తున్నారు. వర్షం పడితే పంటలను వేసేందుకు నేలను రెడీ చేసి పెడుతున్నారు. ఈ క్రమంలో అద్భుతాలు బయట పడుతున్నాయి.

Venkateswara Swamy Idol: ప్రస్తుతం వ్యవసాయ చేసేందుకు రైతులు పొలాలను చదును చూస్తున్నారు. వర్షం పడితే పంటలను వేసేందుకు నేలను రెడీ చేసి పెడుతున్నారు. ఈ క్రమంలో అద్భుతాలు బయట పడుతున్నాయి.

రైతు పొలంలో వెంకటేశ్వర స్వామి విగ్రహం.. చూసేందుకు భారీగా జనం!

భూమిలో ఎన్నో రకలా విలువైన, వింతైన వస్తువులు దాగి ఉంటాయి. తరచూ అరుదైన వస్తువులు నేలలో నుంచి బయటపడుతుంటాయి. ముఖ్యంగా రైతులు వ్యవసాయం చేసే సమయంలో, ఏదైన పాతభవాన్ని తొలగించే సమయంలో కొన్ని రకాల వస్తువులు కనిపిస్తుంటాయి. గతంలో రైతుల పొలాల్లో బంగారు నాణేలు దొరికిన ఘటనలు అనేకం జరిగాయి. అలానే కర్నూలు జిల్లాలోని జొన్నగిరి ప్రాంతంలో వజ్రాలు కూడా బయటపడుతుంటాయి. తాజాగా నారాయణ్ ఖేడ్ లోని ఓ రైతు పొలంలో ఓ అద్భుతం జరిగింది. వెంకటేశ్వర స్వామి విగ్రహం బయటడింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ప్రస్తుతం వ్యవసాయ చేసేందుకు రైతులు పొలాలను చదును చూస్తున్నారు. వర్షం పడితే పంటలను వేసేందుకు నేలను రెడీ చేసి పెడుతున్నారు. ఈక్రమంలో పొలాల్లో ఉన్న చెత్తను, ముళ్లకంపళ్ళను, రాళ్లను తొలగిస్తూ చదును చేసుకుంటున్నారు. ఇలా రైతులు భూమిని సాగుకు సిద్ధం చేసే క్రమంలో కొన్ని ప్రాంతాల్లో బంగారు, వెండి వస్తువులు బయటపడుతున్నాయి. గతంలో కొన్ని చోట్ల బంగారు నాణేలు ఉన్న బిందెలు కనిపించిన సంఘటనలు మనం చూశాం. అలానే కొందరు రైతులకు అయితే ఏకంగా వజ్రాలు కూడా దొరికాయి.  ఇవే కాకుండా.. మరికొన్ని సందర్భాల్లో దేవుళ్ల విగ్రహాలు బయట పడుతుంటాయి. గతంలో రాములోరి, నాగమ్మ, శ్రీకృష్ణుడి వంటి దేవుళ్ల విగ్రహాలు నేలలో నుంచి బయట పడ్డాయి.

తాజాగా తెలంగాణ రాష్ట్రం నారాయణ్ ఖేడ్ ప్రాంతంలో ఓ అద్భుత సంఘటన చోటుచేసుకుంది. నారాయణ్ ఖేడ్ మండంలోని హనుమంతరావి పేట గ్రామంలో బంజే సరోజ అనే మహిళ తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటుంది. ఇక అదే గ్రామంలోని వెంకటేశ్వర స్వామి టెంపుల్ కు ఎదురుగా ఆమె పొలం ఉంది. దానిని చదును చేసుకుని వ్యవసాయం చేస్తూ..జీవనం సాగిస్తున్నారు. ఏటా మాదిరిగానే ఈ సారి కూడా భూమిని చదును చేసేందుకు సరోజ కుటుంబ సిద్ధమైంది. ఆదివారం మధ్యాహ్నం  పొలం చదను చేస్తుండగా శ్రీ వెంకటేశ్వర స్వామి పంచలోహ విగ్రహం బయటపడింది.  ఆదివారం జేసీబీతో భూమిని లెవల్​ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

మట్టిలో నుంచి విగ్రహం బయట పడటంతో అక్కడ ఉన్నవారంత ఒక్కసారిగా షాకి గురయ్యారు. ఈ విషయంలో గ్రామంలోని వారికి తెలియడంతో పురాతనమైన ఈ విగ్రహాన్ని చూడడానికి పెద్ద సంఖ్యలో జనం తరలి వచ్చారు. ఇక పొలంలో బయటపడిన ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహం సుమారు రెండున్నర నుండి మూడు కిలోల వరకు బరువు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. పొలంలో బయలుబడిన ఈ విగ్రహాన్ని భక్తుల సందర్శనార్థం పక్కనే ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉంచారు. మొత్తంగా ఈ ఘటన గురించి స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి