iDreamPost

స్థలం లేదా ఇల్లు కొంటారా? ఇప్పుడే కొనేయండి.. భారీ లాభాలు పొందే ఛాన్స్ దక్కుతుంది

Huge Profits: స్థలం లేదా ఇల్లు కొనాలనుకుంటే ఇప్పుడే కొనేయండి. ఎందుకంటే ప్రాపర్టీ ధరలు భారీగా పెరగనున్నాయి. అదే సమయంలో లాభాలు పొందాలంటే కూడా ఇదే తగిన సమయం. ఇప్పుడు ఉన్న ధరకు స్థలం గానీ ఇల్లు గాని కొనుక్కుంటే భారీగా లాభాలు పొందే ఛాన్స్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Huge Profits: స్థలం లేదా ఇల్లు కొనాలనుకుంటే ఇప్పుడే కొనేయండి. ఎందుకంటే ప్రాపర్టీ ధరలు భారీగా పెరగనున్నాయి. అదే సమయంలో లాభాలు పొందాలంటే కూడా ఇదే తగిన సమయం. ఇప్పుడు ఉన్న ధరకు స్థలం గానీ ఇల్లు గాని కొనుక్కుంటే భారీగా లాభాలు పొందే ఛాన్స్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

స్థలం లేదా ఇల్లు కొంటారా? ఇప్పుడే కొనేయండి.. భారీ లాభాలు పొందే ఛాన్స్ దక్కుతుంది

స్థలం లేదా ఇల్లు కొంటారా? అయితే ఇదే మంచి సమయం. హైదరాబాద్, నగర శివారు ప్రాంతాలు, పరిసర ప్రాంతాల్లో ప్రాపర్టీ కొనేందుకు ఇదే తగిన సమయమని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణం తెలంగాణ ప్రభుత్వం భూముల ధరలను పెంచాలని నిర్ణయించుకోవడమే. ప్రభుత్వం భూముల ధరలను అప్పుడప్పుడు సవరిస్తుంటుంది. భూమి విలువను పెంచాలని నిర్ణయం తీసుకుంటుంది. 2021లో అప్పటి కేసీఆర్ సర్కార్ భూముల ధరలు, స్థలాలు, ఫ్లాట్ల మార్కెట్ విలువను పెంచింది. తాజాగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం భూముల ధరలను పెంచే యోచనలో ఉంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన సలహాదారులు వేం నరేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో నిర్మాణ రంగం జెట్ స్పీడ్ లో అభివృద్ధి జరగాలని వేం నరేందర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ క్లబ్ లో సైబరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్ ఆవిర్భావ వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలపై భారం పడకుండా రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఉండేలా చూస్తామని అన్నారు. అయితే రాష్ట్రంలో భూముల విలువ పెంచాల్సిన అవసరం ఉందని కూడా అన్నారు. దీంతో భూముల ధరల్లో మార్పులు రానున్నాయి. ప్రభుత్వ భూముల ధరలు పెరిగినట్టే.. ప్రైవేట్ వ్యక్తుల భూముల ధరలు కూడా పెరిగే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు అవుతుందని చెబుతున్నారు.

హైదరాబాద్ తో పాటు పరిసర ప్రాంతాలు, నగర శివారు ప్రాంతాల్లో ఉన్న స్థలాల ధరలు పెరుగుతాయని అంటున్నారు. ఈ కారణంగా ఫ్లాట్స్, ఇళ్లు, విల్లాల ధరలు కూడా పెరుగుతాయని చెబుతున్నారు. కాబట్టి ఇప్పుడు తక్కువ ధరకు ఎక్కడైనా స్థలాలు, ఫ్లాట్లు కొనుక్కుంటే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాక ధరలు పెరిగే ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు. బయట మార్కెట్ రేటుతో పోలిస్తే ప్రభుత్వ ధర చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఈసారి మాత్రం భూముల ధరలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ నిర్ణయంతో రియల్ ఎస్టేట్ ఊపందుకోనుంది. స్థలాల ధరలు, వ్యక్తిగత ఇళ్ల ధరలు, ఫ్లాట్ల ధరలు, విల్లాల ధరలు పెరగనున్నాయి.

దీంతో కొనుగోలుదారులు పెరగక ముందే కొనేందుకు ఆసక్తి చూపిస్తారు. పైగా రిజిస్ట్రేషన్ ఛార్జీల ధరలు ప్రజలపై భారం పడకుండా ఉండేలా నిర్ణయం తీసుకుంటామని చెప్పడం వల్ల కూడా కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లు భారీగా పెరగనున్నాయి. ఈ కారణంగా మార్కెట్ లో ఫ్లోటింగ్ పెరగనుంది. మొన్నటివరకూ రియల్ ఎస్టేట్ కాస్త నెమ్మదించిందని చాలా మంది రియల్ ఎస్టేట్ నిపుణులు వెల్లడించారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మరోసారి రియల్ ఎస్టేట్ దూసుకుపోతుందని అంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి