iDreamPost

కొత్త బైక్ కొనాలనుకునే వారికి షాక్.. ఒక్కసారిగా పెరిగిన ధరలు..ఎందుకంటే?

కొత్త బైక్ కొనాలనుకునే వారికి షాక్. బైక్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ బైక్ ధరలు పెంచింది. ధరలు ఎంత పెరగనున్నాయంటే?

కొత్త బైక్ కొనాలనుకునే వారికి షాక్. బైక్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ బైక్ ధరలు పెంచింది. ధరలు ఎంత పెరగనున్నాయంటే?

కొత్త బైక్ కొనాలనుకునే వారికి షాక్.. ఒక్కసారిగా పెరిగిన ధరలు..ఎందుకంటే?

ఈ రోజుల్లో టూవీలర్ తప్పనిసరి అయిపోయింది. ఆఫీసులకు, ఇతర పనుల కోసం లేదా బయటికి ఎక్కడికైనా వెళ్లాలనుకున్నా బైక్ లనే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కరోనా అనంతరం వ్యక్తిగత వాహనాలకు డిమాండ్ పెరిగింది. సొంత బైక్ ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. మరి మీరు కూడా ఈ మధ్యకాలంలో కొత్త బైక్ కొనాలనుకుంటున్నారా? అయితే వెళ్లి ఇప్పుడే కొనుక్కోండి. మరికొన్ని రోజుల్లో బైక్ ల ధరలు పెరగనున్నాయి. అయితే అన్ని కంపెనీల బైక్ ల ధరలు కాదండోయ్. హీరో కంపెనీకి చెందిన బైక్ లు మాత్రే. ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ హీరో మోటార్ కార్ప్ తన వాహనాల ధరలను పెంచేందుకు రెడీ అవుతోంది. కంపెనీ నిర్ణయంతో కొత్తగా బైక్ కొనాలనుకునే వారికి ఆర్థిక భారం పడనుంది. ఇంతకీ హీరో బైక్ ల ధరలు ఎంత పెరగనున్నాయంటే?

హీరో కంపెనీకి చెందిన బైక్ లకు మార్కెట్ లో ఫుల్ డిమాండ్ ఉంటుంది. హీరో విడుదల చేసే ఏ బైక్ అయినా సరే సేల్స్ లో అదరగొడుతాయి. ఈ కంపెనీకి చెందిన బైక్ లకు మంచి ఆదరణ ఉంటుంది. మార్కెట్ లో రారాజుగా వెలుగొందుతున్న హీరో తాజాగా కస్టమర్లకు షాక్ ఇచ్చింది. తన వాహనాల ధరలను పెంచనుంది. కంపెనీ ఎంపిక చేసిన బైక్ లు స్కూటర్ల ధరలను పెంచుతున్నట్లు హీరో మోటార్ కార్ప్ ఇవాళ(సోమవారం) తెలిపింది. గరిష్ఠంగా రూ.1500 వరకు ఈ పెంపు చేపడుతున్నట్లు వెల్లడించింది. పెరిగిన ధరలు జులై 1 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది. మరి మీకు అదనపు ఆర్థిక భారం కాకూడదు అనుకుంటే ధరలు పెరగక ముందే కొత్త బైక్ కొనుక్కోండి.

అయితే హీరో మోటార్ కార్ప్ తన వాహనాల ధరలు పెంచడానికి గల కారణాలను తెలిపింది. ఉత్పత్తి వ్యయం పెరిగిన కారణంగా ధరలు పెంపు నిర్ణయాన్ని తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. బైక్ మోడల్ ను బట్టి ఈ పెంపు ఉంటుందని పేర్కొన్నది. హీరో సంస్థ స్ప్లెండర్‌, హెచ్‌ఎఫ్‌ డీలక్స్‌, గ్లామర్‌ వంటి టూవీలర్స్ తో పాటు జూమ్‌, డెస్టినీ 125 ఎక్స్‌టెక్‌, హీరో ప్లెజర్, హీరో మ్యాస్ట్రో ఎడ్జ్ 110 వంటి స్కూటర్లను విక్రయిస్తోంది. హీరో కంపెనీకి చెందిన వాహనాలపై కస్టమర్లకు నమ్మకం ఎక్కువ. ధరలు బడ్జెట్ లోనే ఉండడం.. మంచి మైలేజ్ అందించడం వంటి కారణాలతో హీరో కంపెనీ వాహనాలకు క్రేజ్ ఎక్కువ.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి