iDreamPost

ICICI బ్యాంక్ వినియోగాదారులు జాగ్రత్త! అలా పొరపడితే..మీ అకౌంట్ ఖాళీ!

ఇటీవల కాలంలో సైబర్ నేరాలు బాగా పెరిగిపోయాయి. కొందరు కేటుగాళ్లు వివిధ మార్గాల్లో సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో కొత్త రకం మోసాలు జరుగుతున్న నేపథ్యంలో తమ కస్టమర్లకు ఐసీఐసీ బ్యాంకు కీలక హెచ్చరికలు చేసింది.

ఇటీవల కాలంలో సైబర్ నేరాలు బాగా పెరిగిపోయాయి. కొందరు కేటుగాళ్లు వివిధ మార్గాల్లో సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో కొత్త రకం మోసాలు జరుగుతున్న నేపథ్యంలో తమ కస్టమర్లకు ఐసీఐసీ బ్యాంకు కీలక హెచ్చరికలు చేసింది.

ICICI బ్యాంక్ వినియోగాదారులు జాగ్రత్త! అలా పొరపడితే..మీ అకౌంట్ ఖాళీ!

నేటికాలంలో సులువుగా డబ్బు సంపాదించాలనే ఆలోచన కలిగిన వారి సంఖ్య బాగా పెరిగింది. అంతేకాక అవినీతి, అక్రమ మార్గంలో ధనం పొందాలనే వారు కూడా పెరిగి పోయారు. ఈ క్రమంలోనే కొందరు ఇళ్ల, దుకాణాల్లో, ఇతర షాపుల్లో చోరీలు చేస్తుంటారు. మరికొందరు జనాలకు మాయమాటలు చెప్పి..డబ్బులు తీసుకుని ఉడాయిస్తుంటారు. వీటన్నిటికి మించి.. అసలు కనిపించకుండా సైబర్ కేటుగాళ్లు మన జేబులు ఖాళీ చేస్తున్నారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా, ఏమరపాటుగా ఉన్నా కూడా మన అకౌంట్లను ఖాళీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ప్రైవేటు బ్యాంకు ఐసీఐసీఐ తన కస్టమర్లకు కీలక హెచ్చరిక చేసింది.  మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

ఇటీవల కాలంలో సైబర్ నేరాలు బాగా పెరిగిపోయాయి. కొందరు కేటుగాళ్లు వివిధ మార్గాల్లో సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా బ్యాంకింగ్ సంబంధించిన విషయాల్లో ఎక్కువగా మోసాలకు పాల్పడుతున్నారు. బ్యాంకుల నుంచి ఫోన్ చేస్తున్నట్లు వినియోగదారులను ఏమార్చి..వారి బ్యాంకు అకౌంట్ కి సంబంధించిన వ్యక్తిగత వివరాలను తెలుసుకుని డబ్బులు దోచుకుంటున్నారు. అంతేకాక మరికొన్ని మార్గాల్లో, ఏటీఏం సెంటర్ల వద్ద సాంకేతికను ఉపయోగించి.. అమాయకుల డబ్బులను చోరీ చేస్తున్నారు.

Icici Bak

ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నఅకౌంట్ లోని డబ్బులను క్షణాల్లో కాజేస్తున్నారు. ఇటీవలే కొత్తపథంలో సైబర్ కేటుగాళ్లు చోరీలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఇటీవల ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్లకు  ఎక్కువగా కొత్తరకం మేసేజ్ లువస్తున్నాయి. దీంతో తమ కస్టమర్లు జాగ్రత్తగా ఉండాలని కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవల ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్లకు కొత్త నెంబర్ నుంచి రూ.200.00 అకౌంట్ లో వేస్తారు. ఆ తరువాత తాము పొరపాటున 20 వేలు కొట్టినట్లు చెబుతారు. అయితే కొందరు కస్టమర్లు అలా సైబర్ కేటుగాళ్లు పంపిన అమౌంట్ లో మధ్యలో ఉంటే చుక్కును గుర్తించారు. దీంతో నిజంగానే అవతలి వ్యక్తి 20 వేలు పొరపాటున కొట్టినట్లు భావించి తిరిగి కొడుతున్నారు.

తీరా అసలు నిజం తెలుసుకుని లబోదిబో మంటున్నారు. ఇలా ఎక్కువగా ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్లకు వస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో తమ కస్టమర్లు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. ఇదే సమయంలో మరో విషయంలో వెలుగులోకి వచ్చింది. కొందరు ఫోన్ పే ద్వారా కొంత ఏమౌంట్ ను జనాలకు కొట్టి తిరిగి వారికి కాల్ చేసి..తాను పొరపాటును కొట్టినట్లు చెప్తారు. నిజమే అనుకుని తిరిగి అతడి పంపిన అమౌంట్  కొట్టడంతో మన బ్యాంకు అకౌంటింగ్ సంబంధించిన వివరాలు మొత్తం సైబర్ కేటుగాళ్ల చేతులోకి వెళ్తాయని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి