iDreamPost

యూజర్లకు Airtel బిగ్ షాక్ .. భారీగా పెరిగిన రీఛార్జ్ ధరలు

Bharti Airtel Tariffs Hike: మొబైల్ యూజర్లకు బిగ్ షాక్ ఇస్తున్నాయి టెలికాం కంపెనీలు. ఇకపై రీఛర్జ్ లు చేయాలంటే మీ జేబులకు చిల్లు పడాల్సిందే. తాజాగా ఎయిర్ టెల్ రీఛార్జ్ ధరలను పెంచింది.

Bharti Airtel Tariffs Hike: మొబైల్ యూజర్లకు బిగ్ షాక్ ఇస్తున్నాయి టెలికాం కంపెనీలు. ఇకపై రీఛర్జ్ లు చేయాలంటే మీ జేబులకు చిల్లు పడాల్సిందే. తాజాగా ఎయిర్ టెల్ రీఛార్జ్ ధరలను పెంచింది.

యూజర్లకు Airtel బిగ్ షాక్ .. భారీగా పెరిగిన రీఛార్జ్ ధరలు

మొబైల్ వినియోగాదారులకు షాకుల మీద షాకులిస్తున్నాయి టెలికాం కంపెనీలు. ఆర్థికంగా బలంగా ఉండేందుకు కస్టమర్లపై ఆర్థిక భారాన్ని మోపేందుకు సిద్ధమయ్యాయి. ఇటీవల లోక్ సభ ఎన్నికల అనంతరం టెలికాం కంపెనీలు రీఛర్జ్ ధరలు పెంచుతాయని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే నిజమైంది. టెలికాం కంపెనీలు మొబైల్ రీఛర్జ్ ధరలను భారీగా పెంచుతున్నాయి. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్న వారికి మొబైల్ రీఛార్జ్ ధరలు పెరుగుతుండడంతో మరింత ఆర్థిక భారం కానున్నది. తాజాగా ఎయిర్ టెల్ రీఛార్జ్ ధరలను భారీగా పెంచింది.

ఈ నేపథ్యంలో నిన్న రిలయన్స్ జియో రీఛార్జ్ ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. రిలయన్స్ జియో మొబైల్ టారిఫ్‌లలో 12-27 శాతం పెంపును ప్రకటించింది. తాజాగా ఎయిర్ టెల్ కూడా యూజర్లకు షాక్ ఇచ్చింది. జియో బాటలోఎయిర్ టెల్ నడిచింది. తాజాగా ఎయిర్ టెల్ మొబైల్ టారిఫ్స్ పెంచుతున్నట్లు ప్రకటించింది. ఎయిర్ టెల్ రీఛార్జ్ ధరలను 10-21 శాతం పెంచింది. జులై 3 నుంచి పెంచిన ధరలు అమల్లోకి వస్తాయని తెలిపింది. రూ. 179 ప్లాన్ ను రూ. 199కి, రూ. 299 ప్లాన్ ను రూ. 349కి, రూ. 399 ప్లాన్ ను రూ. 449కి, రూ. 455 ప్లాన్ ను రూ. 599కి పెంచింది. కాగా ఎయిర్ టెల్ కస్టమర్లకు ప్రస్తుతమున్న రీఛార్జ్ ధరలు జులై 02 వరకు వర్తించనున్నాయి.

రిలయన్స్‌ జియో తన 28 రోజుల ప్లాన్‌లు, 56 రోజులు, 84 రోజులు, వార్షిక ప్లాన్ల మొత్తాన్ని పెంచింది. టెలికాం కంపెనీలు మొబైల్ రీఛార్జ్ ధరలను పెంచుతుండడంతో యూజర్ల జేబులకు చిల్లు పడక తప్పడం లేదు. మొబైల్ అనేది అవసరంగా మారిన నేపథ్యంలో రీఛార్జ్ చేయక తప్పదు. ఒక వేళ రీఛార్జ్ చేయకపోతే సర్సీసులను నిలిపివేస్తున్నాయి టెలికాం కంపెనీలు. ప్రస్తుతం ఉన్న ధరలే అధికమనుకుంటే మరోసారి రీఛార్జ్ ధరలను పెంచి కస్టమర్ల నెత్తిన పిడుగును వేశాయి. మరి రీఛార్జ్ ధరల పెంపుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

డేటా ప్లాన్స్ కూడా భారీగా పెరిగాయి. 28 రోజుల వాలిడిటిటీ, రోజుకు 1 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు గల రూ.265 ప్లాన్ ధరను రూ. 299కి పెంచింది. అలాగే 1.5 జీబీ డేటా ప్యాక్ ధర రూ.299 ఉండగా దానిని రూ. 349కి పెంచింది. 2.5 జీబీ డేటా ప్యాక్ ధర రూ.359 ఉండగా దానిని రూ. 409కి చేర్చింది. రూ.399తో వచ్చే 3జీబీ 28 రోజుల ప్యాక్ ధర రూ. 449కి చేర్చింది. ఇక 56 రోజుల వాలిడిటీ ప్యాక్స్‌లో రూ.479 1.5 జీపీ ప్లాన్ ధరను రూ.579కి చేసింది. రూ.549 ప్లాన్ 2జీపీ పర్ డే ప్యాక్ రూ.649కి పెరగనుంది. 84 రోజుల ప్లాన్లలో రూ.719 ప్లాన్ ధరను రూ. 859కి చేర్చగా.. రూ.839 ప్లాన్ ధరను రూ. 979కి పెంచింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి