iDreamPost

IND vs ENG: సరికొత్త చరిత్ర సృష్టించిన టీమిండియా! 10 ఏళ్ల రికార్డు బద్దలు..

ఇంగ్లండ్ తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా టీమిండియ సరికొత్త చరిత్రను సృష్టించింది. దాంతో దశాబ్ద కాలంగా చెక్కుచెదరకుండా ఉన్న రికార్డు బద్దలు అయ్యింది. ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే?

ఇంగ్లండ్ తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా టీమిండియ సరికొత్త చరిత్రను సృష్టించింది. దాంతో దశాబ్ద కాలంగా చెక్కుచెదరకుండా ఉన్న రికార్డు బద్దలు అయ్యింది. ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే?

IND vs ENG: సరికొత్త చరిత్ర సృష్టించిన టీమిండియా! 10 ఏళ్ల రికార్డు బద్దలు..

టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా ఫైనల్ కు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. గయానా వేదికగా సెమీస్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో 68 రన్స్ తేడాతో భారత్ అద్భుత విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ(57), సూర్యకుమార్ యాదవ్(47), హార్దిక్ పాండ్యా(23) పరుగులతో రాణించారు. అనంతరం 172 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లండ్ కేవలం 103 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కుల్దీప్, అక్షర్ చెరో మూడు వికెట్లతో చెలరేగారు. ఇక ఈ విజయంతో దశాబ్ద కాలం రికార్డును బద్దలు కొట్టింది టీమిండియా. ఆ వివరాల్లోకి వెళితే..

ఇంగ్లండ్ పై విజయం సాధించడం ద్వారా సరికొత్త చరిత్ర లిఖించింది టీమిండియా. అదేంటంటే? 2014 టీ20 వరల్డ్ కప్ తర్వాత నాకౌట్ మ్యాచ్ ల్లో డిఫెండింగ్ చేసి, విజయం సాధించిన తొలి టీమ్ గా భారత్ చరిత్ర సృష్టించింది. 2014 టీ20 వరల్డ్ కప్ లో శ్రీలంక సెమీ ఫైనల్లో 160 పరుగుల టార్గెట్ ను కాపాడుకుంది. ఈ మ్యాచ్ లో డక్ వర్త్ లూయిస్ ప్రకారం 27 పరుగుల తేడాతో విజయం సాధించింది.

అప్పటి నుంచి మళ్లీ ఇప్పటి వరకు ఏ జట్టు కూడా మెుదట బ్యాటింగ్ చేసిన జట్టు విజయం సాధించిన దాఖలాలు లేవు. 12 సార్లు ఛేజింగ్ చేసిన టీమే గెలిచింది. కానీ ఇంగ్లండ్ పై 171 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుని అద్భుత విజయం సాధించింది టీమిండియా. దాంతో దశాబ్ద కాలంగా చెక్కుచెదరకుండా ఉన్న రికార్డును బద్దలు కొట్టింది భారత జట్టు. ఇదిలా ఉండగా.. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో సెమీస్, ఫైనల్లో ఇప్పటి వరకు టాస్ గెలిచి, బౌలింగ్ ఎంచుకుని ఓడిపోవడం ఇది రెండోసారి మాత్రమే. 2009లో వెస్టిండీస్, ఇప్పుడు ఇంగ్లండ్ ఓడిపోయింది. ఇక శనివారం(జూన్ 29) జరిగే ఫైనల్లో దక్షిణాఫ్రికాతో అమీతుమీ తేల్చుకోనుంది టీమిండియా.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి