iDreamPost

ఆ ఒక్క మాటతో అమ్మని, తమ్ముడిని చంపేశాడు! వీడు కొడుకు కాదు, యముడు!

పిల్లలు బాగా చదువుకుని.. మంచి లైఫ్ లీడ్ చేయాలని భావిస్తుంటారు. అందుకే తమ జీవితాలను శాక్రిఫైజ్ చేసుకుని బిడ్డల సంతోషం కోసం కష్టపడుతుంటారు. కానీ పిల్లలు తల్లిదండ్రుల ఆవేదనను అర్థం చేసుకోవడం లేదు.

పిల్లలు బాగా చదువుకుని.. మంచి లైఫ్ లీడ్ చేయాలని భావిస్తుంటారు. అందుకే తమ జీవితాలను శాక్రిఫైజ్ చేసుకుని బిడ్డల సంతోషం కోసం కష్టపడుతుంటారు. కానీ పిల్లలు తల్లిదండ్రుల ఆవేదనను అర్థం చేసుకోవడం లేదు.

ఆ ఒక్క మాటతో అమ్మని, తమ్ముడిని చంపేశాడు! వీడు కొడుకు కాదు, యముడు!

తల్లిదండ్రులు పిల్లల బాగోగులు కోరుకుంటారు. తమలా అత్తెసరు జీతాలతో జీవనం సాగించకూడదని,  ఏ ఆనందానికి ఆర్థిక అవసరాలు అడ్డుకాకూడదని పిల్లల్ని బాగా చదివించాలని అనుకుంటారు. ప్రతి విషయానికి అప్పు చేసే జీవితం.. పిల్లలకు కలగకూడదని ఆరాటపడుతుంటారు. అందుకే చదువుకోండి రా అని హితవు కోరుతుంటారు. బాగా చదువుకుని, ఉన్నత స్థాయికి చేరుకోండని, మాలాంటి బతుకులు వద్దు, మీరు సంపాదించుకుని దర్జాగా బతకండని పోరు పెడుతుంటారు. వారు ఏం చదువుకుంటానంటే  అది చదివిస్తున్నారు. కొన్నిసార్లు  వాళ్లకు ఏం చదువుకోవాలో సరైన అవగాహన లేకపోయినా.. పేరెంట్స్ అడిగి తెలుసుకుని అందులో జాయిన్ చేస్తారు.  కానీ బిడ్డలు మాత్రం.. వారి కోరికలు తమ మీద రుద్దుతున్నారని, తమ సంపాదన కోసం పేరెంట్స్ ఒత్తిడి చేస్తున్నారని భావిస్తుంటారు.

కొన్ని సార్లు అయితే.. తమ ఇష్టా ఇష్టాలకు విలువనివ్వడం లేదంటూ అతిగా ఆలోచించి.. తల్లిదండ్రులపై తిరగబడటం, చదువుపై దృష్టిపెట్టకపోవడం చేస్తుంటారు. చివరకు ఇంట్లో నుండి పారిపోవడం లేదంటే అఘాయిత్యాలకు పాల్పడుతుంటారు. ఈ రోజుల్లో పిల్లల్ని మంచిగా చదువుకోండని చెప్పడం కూడా పాపమైంది. కాలేజీ కోర్సు పూర్తి చేయమని చెప్పినందుకు ఓ కొడుకు తల్లిని, తమ్ముడ్ని చంపిన ఘటన తమిళనాడులోకి చెన్నైలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తిరువత్తూర్‌లోని తిరునగర్ 1వ వీధికి చెందిన పద్మ(45)కు నితేష్ (20), సంజయ్ (14) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే నితేష్ వక్రమార్గంలో నడవడం స్టార్ట్ చేశాడు. చదువు కంప్లీట్ చేయమని తల్లి ఒత్తిడి చేయడంతో కోపంలో ఊగిపోయిన పెద్ద కొడుకు తల్లిని, అతడితో పాటు తమ్ముడ్ని హత్య చేశాడు.

అనంతరం ఇద్దరి మృతదేహాలను బ్యాగులో కుక్కి.. బంధువులకు ఫోన్‌లో సమాచారం అందించాడు. బంధువులకు పంపిన మెసేజ్‌లో.. తల్లిని, తమ్ముడ్ని తానే చంపానంటూ పేర్కొన్నాడు. అనంతరం నితేష్ పరారయ్యాడు. బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. . సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నితేష్ కోసం గాలించారు. అతడ్ని తిరువత్తూర్ బీచ్‌లో తిరుగుతుండగా పట్టుకున్నారు. అతడ్ని విచారించగా.. తనను చదువుకోమని తల్లి పోరు పెడుతుందన్నందుకే చంపానని, ఆ సమయంలో తమ్ముడు కూడా ఇంట్లో ఉండటంతో హత్య చేశానని చెప్పినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి