iDreamPost

కావలి పోలీసుల ప్రత్యేక కృషితో.. అంతరాష్ట్ర బైక్ దొంగలు అరెస్ట్!

వ్యసనాలకు బానిసైన ముగ్గురు యువకులు మోటార్‌బైక్‌లను దొంగలించి పోలీసుల కళ్లుగప్పి తిరగసాగారు. వారి కదలికలపై నిఘా ఉంచిన పోలీసుల ప్రత్యేక బృందం వారి ఆటలకు చెక్ పెట్టింది. వారు చోరీ చేసిన లక్షల విలువైన బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఎక్కడంటే..

వ్యసనాలకు బానిసైన ముగ్గురు యువకులు మోటార్‌బైక్‌లను దొంగలించి పోలీసుల కళ్లుగప్పి తిరగసాగారు. వారి కదలికలపై నిఘా ఉంచిన పోలీసుల ప్రత్యేక బృందం వారి ఆటలకు చెక్ పెట్టింది. వారు చోరీ చేసిన లక్షల విలువైన బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఎక్కడంటే..

కావలి పోలీసుల ప్రత్యేక కృషితో.. అంతరాష్ట్ర బైక్ దొంగలు అరెస్ట్!

యువత అంటే కుటుంబంతో పాటు దేశానికి ఆస్తి లాంటి వారు. ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే..అందులో యువతది కీలక పాత్ర ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే చాలా మంది యువతియువకులు తమ ప్రతిభతో ఎన్నో అద్భుత ఆవిష్కరణలు చేస్తుంటారు. ఇది నాణేంకి ఒక వైపు మాత్రమే.. మరోవైపు..కొందరు యువత సమాజానికి చీడపురుగుల్లా తయారు అవుతున్నారు. జల్సాలకు, చెడు వ్యసనాలకు బానిసలుగా మారి.. చోరీలకు పాల్పడుతున్నారు. అలానే చెడు వ్యసనాలకు బానిసైన ముగ్గురు యువకులు బైకులను దొంగిలించి పోలీసుల కళ్లు గప్పి తిరగసాగారు. చివరకు పోలీసులు చాకచక్యంగా ఈ కేటుగాళ్లను పట్టుకున్నారు. ఈ  ఘటన కావలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నెల్లూరు జిల్లా ఎస్పీ కె. ఆరిఫ్ హఫీజ్ తెలిపిన వివరాల ప్రకారం..

నెల్లూరు జిల్లా కావలి ప్రాంతంలోని బోగోలు మండలం కప్పరాళ్లతిప్ప గ్రామానికి చెందిన పి.భానుప్రకాష్‌, జి.గోమ్స్‌, జి.హనుమాన్‌లు అనే ముగ్గురు యువకులు స్నేహితులు. వీరు చిన్నతనం నుంచే చెడువ్యసనాలు, జల్సాలకు అలవాటు పడ్డారు. ఇక వారి జల్సాలకు అవసరమయ్యే డబ్బుల కోసం దొంగతనాలు చేస్తుంటారు. బైకులు, ఇతర విలువైన వస్తువులను చోరీ చేసి.. అమ్మి..వాటితో వచ్చిన డబ్బులతో జల్సాగా జీవించ సాగారు. ఇలా రెండు సంవత్సరాలుగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో బైక్‌లను దొంగతనాలు చేస్తున్నారు. ఈక్రమంలోనే బైకులు చోరీకి గురికావడంతో..కావాలి పోలీసులకు ఫిర్యాదలు అందాయి. దీంతో సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్లు సీహెచ్‌ కోటేశ్వరరావు, కె.సాంబశివరావు, కావలి ఒకటో పట్టణ ఇన్‌స్పెక్టర్‌ ఎం.రాజేష్‌ తమ సిబ్బందితో ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేసి నిందితుల కదలికలపై నిఘా ఉంచారు.

ఈ క్రమంలోనే టెక్నికల్ ఆధారంగా బుధవారం కావలి పట్టణం తుమ్మలపెంట రోడ్డు వద్ద ఉండగా స్పెషల్ టీమ్ నిందితులను పట్టుకున్నారు. ఆ వెంటనే కావలి ఒకటో పట్టణ పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ నిందితులు రూ.15 లక్షల విలువ చేసే 21 బైక్ లను దొంగంతనం చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. కావలి ఒకటో పట్టణం, కావలి రూరల్‌, చీరాల ఒకటో పట్టణం, ఒంగోలు రూరల్‌, కనిగిరి పోలీసుస్టేషన్ల పరిధిలోనే ఈ చోరీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు…  చోరీకి గురైన బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు.

ఇక నిందితులను అరెస్ట్‌ చేసి.. చోరీకి గురైన బైకులను స్వాధీనం చేసుకునేందుకు కృషి చేసిన.. సీసీఎస్‌, కావలి డీఎస్పీలు పి.రామకృష్ణాచారి, ఎం.వెంకటరమణ, సీసీఎస్‌, కావలి ఇన్‌స్పెక్టర్లు, కావలి సబ్ ఇన్ స్పెక్టర్ రాజేష్‌, కావలి సిబ్బంది చేవూరి అశోక్ కుమార్, షఫీఉల్లాఖాన్‌, రవీంద్ర, సీసీఎస్‌ సిబ్బంది రావు గిరిధర్‌, సుబ్రహ్మణ్యం, వెంకటేశ్వర్లు, ప్రభాకర్‌, శ్రీనివాసులు, సాయి ఆనంద్‌, నిరంజన్‌, విజయ్‌, శివకృష్ణ, సురేష్‌, తదితరులను జిల్లా ఎస్పీ ఆరిఫ్ అభినందించి.. ప్రశంసాపత్రాలను అందజేశారు. ఎస్పీ నిర్వహించిన సమావేశానికి క్రైమ్‌ ఏఎస్పీ ఏవీఆర్‌పీబీ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. ఇక చోరీలకు పాల్పడుతున్న కేటుగాళ్లను పట్టుకున్న కావలి పోలీసులు, ఇతర సిబ్బందిపై స్థానికులు ప్రశంసల వర్షం కురిపించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి