iDreamPost

అబ్బాయిలను గుడ్డిగా ప్రేమించే అమ్మాయిలకు ఈమె కథ గుణపాఠం!

ఆ ఇద్దరిదీ బ్యాంకు ఉద్యోగం. అక్కడ ఏర్పడిన పరిచయం, ప్రేమకు దారి తీసింది. వీరి ప్రేమను పెళ్లి పీటలు ఎక్కించుకున్నారు. హాయిగా సాగిపోతుంది కాపురం. అంతలో భర్త మరో ప్రాంతానికి తన ఉద్యోగాన్ని మార్చుకున్నాడు.

ఆ ఇద్దరిదీ బ్యాంకు ఉద్యోగం. అక్కడ ఏర్పడిన పరిచయం, ప్రేమకు దారి తీసింది. వీరి ప్రేమను పెళ్లి పీటలు ఎక్కించుకున్నారు. హాయిగా సాగిపోతుంది కాపురం. అంతలో భర్త మరో ప్రాంతానికి తన ఉద్యోగాన్ని మార్చుకున్నాడు.

అబ్బాయిలను గుడ్డిగా ప్రేమించే అమ్మాయిలకు ఈమె కథ గుణపాఠం!

ఈ ఫోటోలోని అమ్మాయి పేరు శిఖా అగర్వాల్. మంచి ఉద్యోగం. కోరుకున్న భర్త దొరికాడు. ఎంతో ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని మనువాడింది. ఆర్థికంగా ఎటువంటి లోటు లేదు. ఇక అన్నీ హ్యాపీడేస్ అనుకుంది. తన వంటి అదృష్టవంతురాలు లేదని భావించింది. కానీ పెళ్లైన ఆరు నెలలకే రోడ్డు మీద శవమై కనిపించింది. అయితే అప్పటికే ఆమె తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు నమోదు చేయడంతో ఆమెను శిఖా అని గుర్తించారు పోలీసులు. అయితే దర్యాప్తులో భర్త పంకజ్ బాత్రా హంతకుడని తేలింది. భర్తను నమ్మి అతడితో కలిసి బయటకు వెళ్లినందుకు చివరకు కడతేర్చాడు కసాయి మొగుడు. ప్రేమించి..నువ్వు లేకపోతే నేను లేనని కల్లబొల్లి కబుర్లు చెప్పిన ప్రియుడు..తాళి కట్టాక.. భార్యను హతమార్చాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని సికార్ జిల్లాలో చోటుచేసుకుంది.

శిఖా, పంకజ్ ఇద్దరూ బరోడా ప్రాంతీయ రాజస్థాన్ గ్రామీణ బ్యాంకులో పనిచేశారు. అక్కడ ఏర్పడిన పరిచయం, ప్రేమకు దారి తీసింది. గత ఏడాది డిసెంబర్ 4న ప్రియుడైన పంకజ్ బాత్రాతో పెళ్లి జరిగింది. నచ్చిన వాడిని కట్టుకున్నానన్న ఆనందంలో మునిగిపోయింది శిఖా. కానీ ఆ కాపురం మూడునాళ్ల ముచ్చటగా మిగిలిపోయింది. పెళ్లైన 3 నెలల నుండి ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభం అయ్యాయి. కొంతకాలం క్రితం పంకజ్ నీమ్‌కథానలోని వేరే బ్రాంచికి బదిలీ అయ్యాడు. అప్పటి నుండి నిత్యం తగాదాలు జరుగుతుండటంతో.. విడివిడిగా జీవిస్తున్నారు. ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే ఈ నెల 16న భర్త ఫోన్ చేసి సమీపంలో పార్కులో ఉన్నాను రా.. మాట్లాడదాం అంటూ పిలిచాడు. ఈ నేపథ్యంలో రాత్రి 9 గంటలకు ఇంట్లో నుండి వెళ్లింది.

అయితే ఎంతకు తిరిగి రాలేదు. కూతురు ఫోన్ కూడా లిఫ్ట్ చేయకపోవడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. అల్లుడు పంకజ్ పై అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు అతడి ఫోన్ ట్రేస్ చేయగా.. స్విచ్ఛాఫ్ వచ్చింది. అలాగే శిఖా ఫోన్ చెక్ చేయగా.. లోకేషన్ చూపించింది. అక్కడికి వెళ్లగా..  మరో చోట రోడ్డు ప్రక్కన మృతదేహం కనిపించింది. పోలీసులు ఈ కేసును మరింత ముమ్మురం చేసి.. పరారీలో ఉన్న శిఖా భర్త పంకజ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు నేరం ఒప్పుకున్నాడు. ఆమెతో గొడవలు జరుగుతుండటంతోనే.. తట్టుకోలేక భార్యను అంతమొందించాలని భావించిన పంకజ్.. భార్యను పార్కుకు పిలిచి.. అనంతరం కారులో ఎక్కించుకుని..నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి.. కారులోనే గొంతు నులిపి చంపేశాడు. తర్వాత మృతదేహాన్ని బయట పడేసి.. పరారయ్యాడు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు భార్య ఫోన్‌ను ఒకచోట నుంచి మరో చోటికి విసిరేశాడు. అతడ్ని పట్టుకోవడంతో ఈ విషయాలు వెలుగుచూశాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి