iDreamPost

భార్యపై అనుమానంతో 6 ఏళ్ల కూతుర్ని హత్య చేసిన కసాయి తండ్రి

అనుమానం పెను భూతం అంటారు. ఇది ఎన్నో కాపురాల్లో చిచ్చుపెట్టింది. పావనిని కూడా కాటు వేసింది ఈ అనుమానం. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి.. కాలయముడయ్యాడు. ఆరేళ్లకు నిండు జీవితాన్ని చిదిమేశాడు.

అనుమానం పెను భూతం అంటారు. ఇది ఎన్నో కాపురాల్లో చిచ్చుపెట్టింది. పావనిని కూడా కాటు వేసింది ఈ అనుమానం. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి.. కాలయముడయ్యాడు. ఆరేళ్లకు నిండు జీవితాన్ని చిదిమేశాడు.

భార్యపై అనుమానంతో 6 ఏళ్ల కూతుర్ని హత్య చేసిన కసాయి తండ్రి

భార్యా భర్తల మధ్య గొడవలు కామన్. కుటుంబ కలహాలు జరుగుతున్నప్పుడల్లా బాధితులౌతున్నారు పిల్లలు. భర్తపై కోపం వచ్చినప్పుడల్లా బిడ్డల్నే చావగొడుతుంది తల్లి. అలాగే భార్యను తిట్టాలనుకున్న ప్రతిసారి కూడా పిల్లలపై తన ప్రతాపాన్ని చూపిస్తుంటాడు భర్త. ఎడాపెడా బిడ్డల్ని కొట్టేస్తుంటారు. కొన్ని సార్లు ఇలాంటి ఘటనల్లో చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చూశాం. అంత జరిగిపోయాక.. అప్పుడు లబోదిబో అని ఏడుస్తుంటారు పేరెంట్స్. అంతేనా వివాహేతర, అక్రమ సంబంధాలకు అడ్డుగా ఉన్నారని, జీవిత భాగస్వామితో విడిగా ఉంటున్న వాళ్లు సైతం బిడ్డలను బలిగొన్న సంఘటనలు వెలుగు చూశాయి. తాజాగా ఓ ఆరేళ్ల పాపను చంపేశాడు తండ్రి. మూడు రోజుల క్రితం షాప్‌కి వెళ్లిన కూతురు తప్పిపోయిందటూ పోలీసుల ఫిర్యాదు చేశాడు.

భార్యపై అనుమానంతో కన్నకూతుర్ని పొట్టన పెట్టుకున్నాడు కసాయి తండ్రి. కంటికి రెప్పలాగా కాపాల్సిన తండ్రే ఆమె పాలిట కాలయముడయ్యాడు. ఆమెను హత్య చేసి.. కనిపించడం లేదంటూ కల్లబొల్లి ఏడుపులు ఏడ్చాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా నార్పలలో చోటుచేసుకుంది. గణేష్ దంపతులకు ఆరేళ్ల పాప పావని ఉంది. ఈ నెల 20వ తేదీన ఆమెను బయటకు తీసుకెళ్లిన తండ్రి.. హత్య చేసి.. సమీపంలో ఉన్న బావిలో పడేశాడు. అనంతరం అదే రోజు సాయంత్రం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి.. తన కూతురు కనిపించడం లేదని, షాపుకు వెళ్లి అక్కడ నుండి ఇంటికి తిరిగి రాలేదని ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. అయితే పాప జాడ కానరాలేదు. అయితే తండ్రి గణేష్ చెబుతున్న విషయాలు పొంతన లేకుండా ఉండటంతో అనుమానం ఏర్పడింది.

అతడ్ని పట్టుకుని తమదైన స్టైల్లో విచారించే సరికి పాపను తానే చంపేసి, బావిలో పడేసినట్లు వెల్లడించారు. అక్కడకు వెళ్లి చూడగా.. బావిలో మృతదేహం కనిపించింది. వెంటనే పోలీసులు బాలిక మృతదేహాన్ని బయటకు తీశారు. శరీరం ఉబ్బిపోయిన స్థితిలో చూసేసరికి కన్నీరు మున్నీరు అయ్యారు బంధువులు. కాగా భార్యపై అనుమానంతోనే గణేష్ తన కూతురిని చంపినట్లుగా పోలీసులు తెలిపారు. తన భార్యపై అనుమానంతోనే కూతురి గొంతు నులిమి చంపి.. బావిలో పడేసినట్లు అతను పోలీసుల విచారణలో అంగీకరించినట్లు వెల్లడించారు. గణేష్ పై కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడిని అరెస్ట్ చేశారు. కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి