iDreamPost

కూకట్‌పల్లిలో భారీగా తగ్గిన ఇళ్ల ధరలు.. కొనాలనుకుంటే ఇప్పుడే కొనేయండి..

Flat Prices Reduced In Kukatpally: హైదరాబాద్ లో ఇల్లు కొనే ఆలోచనలో ఉన్నారా? అయితే భారీగా లాభం పొందడానికి ఇదే సరైన అవకాశం. ఎందుకంటే కూకట్ పల్లిలో ఇళ్ల ధరలు భారీగా తగ్గాయి. ఇప్పుడు కొంటే కనుక రెండు, మూడు నెలల్లో లక్షల్లో లాభం పొందే అవకాశాలు ఉన్నాయి.

Flat Prices Reduced In Kukatpally: హైదరాబాద్ లో ఇల్లు కొనే ఆలోచనలో ఉన్నారా? అయితే భారీగా లాభం పొందడానికి ఇదే సరైన అవకాశం. ఎందుకంటే కూకట్ పల్లిలో ఇళ్ల ధరలు భారీగా తగ్గాయి. ఇప్పుడు కొంటే కనుక రెండు, మూడు నెలల్లో లక్షల్లో లాభం పొందే అవకాశాలు ఉన్నాయి.

కూకట్‌పల్లిలో భారీగా తగ్గిన ఇళ్ల ధరలు.. కొనాలనుకుంటే ఇప్పుడే  కొనేయండి..

ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు. అంటే ఇల్లు కట్టడం, పెళ్లి చేయడం అనేవి సాహసోపేతమైన అంశాలు. ఎంతో రిస్క్ చేస్తేనో, సాహసం చేస్తేనో తప్ప సొంతింటి కల నిజం కాదు. ఇక హైదరాబాద్ లాంటి నగరాల్లో అంటే సాహసం చేయాలన్న ఆలోచన కూడా రాదు కొంతమందికి. అయితే ఓ 10, 15 లక్షలు తగ్గితే కొనాలని అనుకుంటారుగా. అసలు హైదరాబాద్ లో ప్రాపర్టీ ధరలు తగ్గడమన్న కాన్సెప్టే లేదు. కానీ అనుకోకుండా ఇప్పుడు ధరలు తగ్గాయి. కాబట్టి ఇల్లు కొనాలి అనుకునేవారికి ఇదే మంచి ఛాన్స్. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కాస్త నెమ్మదించింది. నగరంలోని కొన్ని ప్రాంతాలు మినహాయిస్తే మిగతా ఏరియాల్లో స్థలాల ధరలు, ఇళ్ల ధరలు తగ్గాయి.

మాదాపూర్ సహా పలు ప్రాంతాల్లో ఇళ్ల ధరలు తగ్గాయి. కూకట్ పల్లిలో కూడా ఇళ్ల ధరలు తగ్గాయి. 2019 నుంచి ఇప్పటి వరకూ అనేక సార్లు ధరలు పెరగడం, తగ్గడం జరుగుతూ వచ్చింది. 2023 జనవరి-మార్చి నెలల్లో చదరపు అడుగు ఫ్లాట్ ధర 6 వేల రూపాయలు ఉండేది. ఏప్రిల్-జూన్ నెలల్లో 6,350 రూపాయలుగా ఉంది. ఆ తర్వాత జూలై-సెప్టెంబర్ నెలల్లో 6 వేలకు పడిపోయింది. అక్టోబర్-డిసెంబర్ నెలల్లో రూ. 6,450కి పెరిగింది. 2024 జనవరి-మార్చి నెలల్లో చదరపు అడుగు ఫ్లాట్ ధర రూ. 6,500 అయ్యింది. ప్రస్తుతం అది రూ. 5,700కి తగ్గింది. అంటే చదరపు అడుగు మీద 800 రూపాయలు తగ్గింది. మీరు 1200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక 2 బీహెచ్కే ఇల్లు లేదా ఫ్లాట్ కొనాలి అనుకుంటే కనుక ఇప్పుడు 68 లక్షలు అవుతుంది.

ఈ ధరలు తగ్గక ముందు అయితే 78 లక్షలు ఉండేది. ఇప్పుడు ఏకంగా 10 లక్షలు తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి. 10 లక్షలు తగ్గడం అంటే చిన్న విషయమేమీ కాదుగా. ఒకవేళ మీరు కనుక ఇల్లు లేదా ఫ్లాట్ మీద ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కనుక ఇదే మంచి ఛాన్స్. రెండు, మూడు నెలల్లో ఈ ధరలు మళ్ళీ పెరిగితే మీకు తక్కువ రోజుల్లోనే 10 లక్షలు లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇవి కూకట్ పల్లిలో యావరేజ్ గా ఉన్న ధరలు. కొంచెం ఎక్కువ ఉండచ్చు లేదా తక్కువ ఉండచ్చు. అక్కడ ఏరియా డిమాండ్ ని బట్టి మార్పులు ఉండవచ్చు.   

గమనిక:

అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ధరల్లో మార్పులు ఉండవచ్చు. గమనించగలరు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి